4, ఫిబ్రవరి 2023, శనివారం

 ద్రౌపది సలహా 

************


పంచ పాండవులు  ఒక రోజు వేటకు వెళ్లి ఏమి పడక  పోతే  , అడ విలో పడివున్న చెట్టు మొద్దు నొక దాన్ని  మోసుకొచ్చేశారు . అమ్మ కుంతి కి  సంతోషం గా ఆ విషయం  చెప్పారు .

 తాను ఎప్పటి లాగే "నాయనా .. అందరూ కలిసి పంచుకోండి"  ,, అంది . 

చెట్టు మొద్దు నైతే తీసుకు రాగలిగాం . కానీ దాన్ని ఐదు సమ భాగాలుగా విడగొట్టాలంటే 

తాతలు తండ్రులు దిగివస్తారు .. 

ఐదుగురు కలిసి  ఉమ్మడి భార్య ద్రౌపది   ని సలహా అడిగారు . 

ఆమె వారిని ముద్ధుగా .. మొద్దు బుర్రలు .. అని తిట్టి 

ఇది పండు కాదు పంచుకొని తినటానికి .. 

పొయ్యు లో పెడితే అదే కాలిపోతుంది . కావలిస్తే దాని మీద వండిన వంటని 

పంచుకొని తినండి .. అని .. నవ్వుకుంది  , తన పెళ్లప్పుడు కుంతీ మాత   చేసిన నిర్వాకం గుర్తొచ్చి .. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి