14, మార్చి 2021, ఆదివారం

మట్టిబుర్ర

మట్టిబుర్ర 

 అప్పటికే

వేడి పాలు తాగి 

నాలుక కాల్చుకున్నవాడిని 


ఇప్పుడు 

చల్లని మజ్జిగ ని కూడా 

ఊదుకుంటూ 

తాగడం 

ఒక అలవాటుగా మారింది 


అది కూడా 

ఒకలాంటి  భయం  అని 

తెలిసేలోగా 

చీకటి పడిపోయింది 

అంతే .. 

నా కండ్లు 

ఆ చీకటికి 

కావలి కుక్కలా 

అతుక్కు పోయాయి 


అవునూ .. నువ్వు 

పండు వెన్నెలలా 

పరుచుకున్నావు 

కొండ వెలుగులా 

విచ్చుకున్నావు 

నిన్ను 

పోల్చుకోలేక పోయాను 

అనేది ఒక  అందమైన అబద్దం 

నిన్ను 

తెల్సుకోలేకపోవటం 

నేను ఎక్కాల్సిన రైలు 

ఒక జీవిత కాలం లేటు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి