14, మార్చి 2021, ఆదివారం

మాట వరసకి

 మాట వరసకి


రోజూ లాగే ఫోన్ చేసే మిత్రుడే.. మాటల్లో పడి  సీరియస్ విషయాల్ని కూడా పిచ్చాపాటిగా తీసుకునే వాడే .. 

ఒక అధర్మ సందేహం గురుంచి ఇంకో మిత్రుడితో మాట్లాడానని చెప్పాను  

ఎందుకు అందరి సలహా అడుగుతావు ?మనకు ఎమన్నా తెలివి తక్కువా ?.. అని తనతో పాటు నన్ను పైకి లేపేశాడు 

నా తెలివి గురుంచి నాకు కించిత్ గర్వమే !

ఈ తెలివి అనే భావ పదార్థం గురుంచి ఎన్ని తగవులో!ఈ మిత్రుడే ఒకసారి మాటల్లోనే .. నీదంతా 

పు స్తకాల తెలివి .. మీ లాంటోళ్ళు అంతా కలల్లో లేదా పుస్తకాల్లోమాత్రమే  ఉంటారని కొందరితో కలిపి నన్ను అవతలికి విసిరి పారేశాడు. 

ప్రాక్టికల్ గా ఉండాలి ..గ్రౌండ్ మీద మనిషి అనుభవాలు వేరు . అవి సిద్ధాంతాలకు లొంగవు .అలా హితబోధ చేస్తూ కమ్యూనిజం కూడా అందుకే ఫెయిల్ అయిందని తేల్చేసాడు 

అతనలా గ్రౌండ్ మీద నిలబడి గట్టిగా  మాట్లాడేసరికి  కాస్త గాభరా పడిపోయాను . 

నా కలలు ,పుస్తకాలు గాల్లో ఎగిరిపోతున్నట్టే అనిపించింది 

అయితే నా వంతు పోరాటాన్ని నేనూ  వదల్లేదు

అతనితో వాదానికి తల పడ్డాను 

అయితే ఏమిటి ?ప్రేమ వివాహాలు తప్పంటావు 

అవి నిలబడవు .చివరికి కుటుంబాలే వారిని  కాపాడుతాయి . కుటుంబాలే దిక్కు ..అన్నాడు 

ఎర్రజెండా కప్పుకున్న మనువును మీరెప్పుడైనా చూసారా ?

చూసే వుంటారు .కానీ రంగుల ప్రపంచీకరణ లో గుర్తుపట్టడం చాలా కష్టమైన పని .. 

ఇందులో తప్పు ఎవరిదెంత అని అప్పు ఆలోచనల్లో పడ్డాను 

అయితే మొదట్లో ఒక విషయాన్ని లేవనెత్తి నేను ,మీరు ఎటో కొట్టుకు పోయాం 

విష్యం ఏంటి అసలు 

మనకు తెలివి ఉందా లేదా 

వుంది ..బోల్డంత ..పుస్తకాలు పుస్తకాలుగా ఉంది 

కానీ అవతలవాళ్ళ తెలివి పర్వతాలు పర్వతాలుగా ,సాంప్రదాయాల పొరలు పొరలుగా పేరుకు పోయి ఉంది 

దాన్నే అనుభవంగా బెదరగొడుతున్నారు

 

ముల్లుని ముల్లుతోనే తీయాలనేది పాత సామెతే కాదు, పనికి రాదనీ కూడా రుజువు అవుతూనే ఉంది 

అయితే ఏమి చేయాలి 

ఎప్పటికి వాడుకోగలిగే  శేషప్రశ్న..  

మనకు తెలివి వున్నా మాట వాస్తవమే గావచ్చు గాక .. 

కానీ అడ్డగోలు తెలివి ని బద్దలుగొట్టగలిగే గుండె ధైర్యాన్ని అలవర్చుకోవడం 

నేటి  అవసరం .. 

దాన్ని మరీ అంత తేలికగా తీసిపారవేయలేము అనే సంగతిని కూడా గుర్తు పెట్టుకొని మెలగాలి .. 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి