14, మార్చి 2021, ఆదివారం

నేనేల , నింగి ఐన వేళ ..1

 నేల , నింగి ఐన వేళ ..1 

నాగపూర్ కి వెళుతూ తేదీ 19-12-2018



నాగపూర్ ..సెంటర్ అఫ్ ఇండియా ..ఓరేంజ్ సిటీ ,ఆరెస్సెస్ కేంద్రం ,దీక్ష భూమి .. ఈ నగరానికి ఎన్నో ప్రత్యేకతలు .. 

డిసెంబర్ చలి రాత్రులు .. మధ్యాహన్నం పూట కూడా చలిగానే ఉంది .. స్వేట్టెర్ లాంటిదే వేసుకొని బయలు దేరాను మిత్రుడ్ని కలుద్దామని ,నీరి గెస్ట్ హోసే నుంచి .ఓలా  ఆటో బుక్ చేద్దామని ట్రై చేసాను. పాత బకాయిలు కడితేనే వొస్తాను అని చూపించింది .. వద్దులే అని వదిలేసి రోడ్డు పైకి వచ్చి లోకల్ ఆటో ఎక్కి కోల్ ఇండియా ఆఫీస్ కి అని  చెప్పాను . అప్పుడు 12 అవుతుంది . లంచ్ చేయలేదు . ఆటో దిగి టీ తాగా ను. తాపీగా నడుచుకుంటూ ఆఫీస్ మెయిన్ గేట్ నుంచి లోపలి వెళుతున్నాను . గేట్ దగ్గ ఎవ్వరు ఆపలేదు . కొద్దీ దూరం నడిచాక అనుమానం వచ్చి గేట్ వేపు చూసాను . పోలీస్ ల్లాంటి కురచ కట్టింగ్ తో ఓ నలుగురు మనుషులు నా వేపే నడుస్తూ వచ్చారు. వారి నడక ,చూపులను బట్టి వారు పోలీసులే అనుకున్నాను .కొంచెం భయం వేసింది .ఏమిటి చేయడం ?

ఎటు పరుగెత్తినా ,వాళ్ళు నలుగురు ..నేను ఒక్కడ్ని .. తప్పించుకోలేను ..వృథా ప్రయాస . లెట్స్ పేస్ ఇట్  అనే నిర్ణయానికి వచ్చేసాను . కొంచెం నిబ్బరం కూడా అరువు తెచ్చుకున్నాను . దగ్గరగా వచ్చి నా పేరు తో పిలిచారు .. ఊ అన్నాను భయంగా .. 

వాళ్లు నన్నెరగరు . నా పేరేదో తెలుసు .. అంతే. 

నలుగురు  నా చుట్టూ మూగి బయట జీపు దగ్గరికి నడవమని చెప్పారు . అది స్కార్పియో బండి .. మధ్య సీటు లో మధ్యన కూర్చో బెట్టి ,ఇరు పక్కలా ఇద్దరు కూర్చున్నారు .. డ్రైవర్ సీట్లో ఇన్స్పెక్టర్ రాంక్ పోలీస్ .. అతని పక్కన కూడా పోలీస్ .. అయితే వారు నన్నేమి భయపెట్టలేదు .. వారు కూడా ఎందుకో భయం భయం గానే ఉన్నారని అనిపించింది .  

అయితే అకస్మాత్తుగా అంతా తలకిందులుగా ఐంది అని అనిపించినా తరుణంలో .. ఒక భయం .. ఒక భాధ కలగలిసి వెన్నాడుతున్నట్టే వుంది . . 

వాతావరణాన్ని తేలీక చేయటం కోసం నేనే మొదట అన్నాను .. నా షుగర్ మందులు ,బ్యాగ్  నా గెస్ట్ హోసే లో ఉన్నాయ్ .. ఎలాగూ తీసుకెడుతున్నారు కాబట్టి అవి కూడా తెచ్చేయమని కాస్త కూల్ గానే చెప్పాను . 

అప్పటికే సమయం ఒంటి గంట దాటి ముప్పై నిముషాలు  ఐంది . ఒక పోలీస్ అధికారి నా దగ్గర గెస్ట్ హౌస్ అడ్రెస్ తీసికొని వెళ్ళిపోయాడు .. 

పోలీస్ వాహనం మాంచి స్పీడ్ లో వెళుతోంది . 

ఎటు తీసుకెళతారో .. ఎం చేస్తారో.. రకరకాల ఊహాలు ..భయాలు ... ఊహాలు ..వ్యూహాలు .. తప్పించుకొనే అవకాశం ఉంటుందా ?


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి