14, మార్చి 2021, ఆదివారం

నేల ,నింగి ఐన వేళ-2

 నేల ,నింగి  ఐన వేళ-2




తేది 19. 12. 2018నాగపూర్ కి చేరుకునే ముందే ట్రైన్ లో .. 




సినిమా కథలు ,కర్ణా కర్ణిగా విన్న అనుభవాలు  ఎన్నో తెరలు తెరలు గా తిరుగుతున్నాయి  మైండ్ లో .. స్కార్పియో వేగంగా భండారా వేపు వెళుతోంది. 

డ్రైవర్ (పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ )కర్ణాటక దావా ణ గేర్ లో డాక్టరీ చదివానని చెప్పాడు .మా ఇద్దరి మధ్య మర్యాదపూర్వకంగా మాటలు నడుస్తున్నాయి .నా చదువు గురుంచి నా జాబ్  గురుంచి ప్రశ్నలు అడిగాడు .నేను సరదాగా సమాధానాలు చెబుతూనే జరగబోయే విపత్కరం గురుంచి మనుసు లో ఆలోచిస్తున్నాను . నన్ను భండారా తీసుకు వెళతారేమోనని అనుకున్నాను . 

1994 సంవత్సరం  లో నా  ఉద్యోగం లో భాగం గా భండారా (మహా రాష్ట్ర )ఎస్పీ ని ,కలకలెక్టర్ ని కలిశాను . కలవడమే కాదు ఒక నెలరోజులు వారి కాంటాక్ట్ లోనే ఉన్నాను భండారా లోని ప్రభుత్వ అతిధి గృహం లోనే ఉన్నాను. 

అప్పట్లో పోలీసులకి కలెక్టర్ కి ప్రచ్ఛన్న యుద్ధం జరిగేది. . భండారా పెద్ద నక్సలైట్ ఏరియా .. కల్లోలిత ప్రాంతం .. దానితో పోలీసులు చాలా సహజంగా తమ అధికారమే నడవాలని అనుకునేవారు . పరిపాలన అంత తన ఆఫీస్ నుంచే సాగాలని ఎస్పీ ఉబలాట పడేవాడు . 

పాపం ,కలెక్టర్ తానే నిజమైన అధికారినని ,దాన్నెలా నిలబెట్టుకోవాలో తెలియక సతమతమయ్యేవాడు . 

నాకైఎహె భలే సరదాగా నడిచింది అప్పుడు. ఇప్పుడు అవన్నీ ఒక్కటొక్కటిగా గుర్తు రాసాగాయి .

భండారా అప్పటి నుంచే ఒక పెద్ద పోలీస్ కేంద్రం .. 

సీక్రెట్ చిత్రహింసల కేంద్రం ఏదన్న అక్కడ ఉందేమోనననే ఊహ వచ్చింది . 

భండారా లో బంధించి టార్చర్ పెడతామేననే భయం లోపల తొలిచేసింది .. 

ఆ భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ అప్పటిదాకా ఆపుకున్న ఆకలి బాధ తోసుకొచ్చింది . 

మధ్యాహ్నం మిత్రుడ్ని కలిసిన తరవాత భోజనం చేద్దాంలే అని కడుపుతో నా ఒప్పందం .. 

వీళ్ళేమో వొట్టి మంచినీళ్లు మాత్రమే ఇస్తూ ఎత్తుకెళుతున్నారు . 

స్కార్పియో లో కూర్చోబెట్టి వెంటనే నా పర్సు ,క్రెడిట్ కార్డ్స్ ,మొబైల్ ఫోన్ తీసేసుకున్నారు . 

భండారా దాటి దట్టమైన  అడువుల్లోచి వాహనం హై వే పైనే వెళుతుంది . ఛత్తీస్గఢ్ (దుర్గ్) వైపు ప్రయాణం సాగుతుంది . 

ఒకప్పుడ్డు అందంగా ,ఆరాధనగా కనిపించిన అడవులు ఇప్పుడు ఒక భయాన్ని కలుగచేస్తున్నాయి .. దట్టమైన అడవులు కనిపించగానే ఇక ఇదే చివరి చూపు లాగ గుండె వేగం పెరిగింది  ఏ అడవి లో నిలబెట్టేస్తారో అనే భయం కూడా మొదలైంది. 

అంతిమ గడియలు అంటే ఇవే కాబోలు అనే పిచ్చి పిచ్చి ఊహలు వెంటాడాయి . 

ఛత్తీస్గఢ్ అంటే నాకు మొదటి గుర్తొచ్చే పేరు శంకర్ గుహ నియోగి .. పేరుతో పాటు అతని రూపు కళ్ళకు కడుతుంది . గళ్ళ లుంగీ మీద తెల్లని బనీను  వేసుకొని నులక మంచం లో కూర్చుని ,అమాయకంగా  ,నిబ్బరంగా వుండే అతని  ఫోటోయే గుర్తుకు వస్తుంది. 

కార్మిక నాయకుడికి అతను ఒక మోడల్ . 

ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారో కదా ఈ సమాజాన్ని మార్చాలని .. 

నిజంగా ఎన్కౌంటర్ చేసేస్తారా ?

ఎందుకో నా వెంట వున్నవాళ్లు అంతకు తెగేంచేలా లేరు అని అనిపించింది 

బహుశా ఎక్కడో వీళ్ళ మెయిన్ ఆఫీసర్ ఉంటాడేమోనని అనిపించింది 

ఎవరితోనో చాలా సేపు మాట్లాడారు 

ఒక కొత్త వ్వక్తి దారిలోకలిశాడు .సమోసాలు, నీళ్ల బాటిల్ తీసుకు వచ్చాడు 

దాంతో నా ఆకలి కొంత చల్లారింది 

ఆ తర్వాత టాయిలెట్ కి వెళ్లాలని అడిగాను 

ఒకటా ..రెండా అని వేళ్ళు చూపిస్తూ అడిగారు 

ఒకటే లే అన్నాను 

ఒక నిర్మానుష్య ప్రాంతంలో  బండి ఆపారు 

నా వెనకే వెనకే ఎస్కార్ట్ గా ఇద్దరు నిలబడ్డారు 

నేను ఎక్కడ తప్పించుకుపోతాననే ఏమో చాలా జాగ్రత్త గా కనిపెడుతూ ఉన్నారు 

ఒకో సారి ఎలాగైనా పారిపోవాలని అనిపించేది 

కానీ నా ఆరోగ్యం,మందులతో నడిచే జీవితం ... ఎంత దూరమో పరుగెత్తి తప్పించుకోవడం అసాధ్యమనిపించింది 

నాలో పీక మొండి ధైర్యం రాసాగింది 

భయాన్ని దూరం నెడుతూ ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నిచాను 

వారితో ఎదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాను 

ఇంతలో వాహనం భిలాయ్ టౌన్ లోకి ప్రవేశించింది 

ఒక పెద్ద ప్రభుత్వ ఆఫీసర్ ఇల్లు లాంటి ప్రాంతం లోకి తీసుకు వెళ్లారు 

నన్ను ఒక చిన్నగదిలో కూర్చోబెట్టారు 

అప్పటికి టైం సాయంత్రం 6 కావొస్తుంది . 

అంటే ఒంటిగంట కి నన్ను పట్టుకొని వేగంగా కేవలం 5 గంటల్లోనే నాగపూర్ నుంచి 

ఛత్తీస్గఢ్ లోని ఉక్కునగరం భిలాయ్ కి దాదాపు 260 కిలో మీటర్ల దూరం  తీసుకు వచ్చేసారు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి