31, మార్చి 2021, బుధవారం


 


 


 


 


 


 

 april modati vaaram, 2018,mandamarri


28, మార్చి 2021, ఆదివారం

part4

 తెల్లవారింది .. థైరాయిడ్  టాబ్లెట్ వేసుకోవాలి . బాగ్ లోంచి తీసుకొని టాబ్లెట్ మింగాను . కాల కృత్యాల తో పాటు స్నానం కూడా చేశాను . టిఫిన్  ,టీ ఇచ్చారు . 

రెండో రోజు ,డిసెంబర్ 21 ,2018. 

అందరూ  ఎవఱి కోసమో ఎదురు చూస్తూ ఉన్నట్లు వున్నారు . నా అరెస్ట్ ఆపరేషన్ ఇన్ ఛార్జ్ మరియు ఎస్పీ స్థాయి అధికారి సింగ్ కూడా వచ్చాడు .. నన్ను పలకరించాడు . 

"నువ్వు ఏమి చెప్పటం లేదు .. నోరు విప్పడం లేదు .. అస్సలు మొగుడు వస్తున్నాడు 

"

ఇంతలోకి ఎవరో రానే వచ్చారు ... అతనికి నన్ను చూపించారు. హైదరాబాద్ నుంచి వచ్చాడు నాకోసమే ఫ్లైట్ లో .. అతని దగ్గర నా మొత్తం హిస్టరీ ఉందంట .. 

అతను నా వేపు పలకరింపుగా చూసాడు .. ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ నుండి వచ్చాడంట

నా గురుంచి తెలుసు కానీ ఈ విషయం  వారు ఊహించ లేకపోయారట .. 

అతను నాతో తెలతెలుగు లోనే మాట్లాడాడు .. అందరిలాగా అతని డి ఒకటే టార్గెట్ .. ఎవరినైనా పట్టించు .. 

ఇంతలో ఎస్పీ సింగ్ వచ్చి ఇంగ్లిష్ లో మాట్లాడండి అన్నాడు .. సంభాషణ ఇంగ్లీష్ లో నడిచింది . కాసేపు ఇద్దరు బెదిరించారు .. 

నా దగ్గర ఒక్కటే ఆన్సర్ .. 

పాపం వాళ్ళు విసిగిపోయారు. 

హైదరాబాద్ నుంచి వచ్చిన ఆఫీసర్ కథ రాసుకున్నాడు నా ఫొటోస్ తీసుకొన్నాడు . 

చివర్లో నాకో ఆఫర్ ఇచ్చాడు 

ఎవరి వివరాలు ఐన చెబితే కేసులు ఏమి లేకుండా చూస్తానని అన్నాడు 

ఎదో ఆశ కలిగింది .. నా కు ఎవరి గురుంచి తెలీదు .. నన్ను ధీట్లోంచి బయట పడేయమని కన్నీళ్లతో అడిగాను .. అతనేమీ కరగలేదు .. బహుశా అతని చేతిలో కూడా ఏమి లేదేమోనని సరిపెట్టుకున్నాను . 

అతను వెళ్ళిపోయాడు . 

స్సయోకాలం  వరకు ఎవరెవరో వస్తూనే వున్నారు ,పోతు వున్నారు 


మధ్యాహ్నం తర్వాత పహాడ్ సింగ్ అనే లొంగిపోయిన ఛట్ఠస్గఢ్ మావోయిస్టు ని తీసుకొచ్చారు . 

తెలుసాని అడిగారు ..తెలుసు అని చెప్పను .. అప్పటికే అతగాడు అన్నే విషయాలు వారికి చెప్పివున్నాడు.  నాగపూర్ లో నా అరెస్ట్ కి  అతని లొంగుబాటు కి సంభంధం ఉందని అనిపించింది . అతడి మీద కోపం ,జాలి రెండు కలిగాయి . 

సిగ్గు లేకుండా నాతో నవ్వుతు చాలాసేపు మాట్లాడాడు .  వాడి లాభం కోసం నా మీద చాలా ఊహించి చెప్పాడని అర్థమైంది నాకు . 

ఆదివాసీ గా ఉద్యమం లోకి వచ్చాడు . భార్య పిల్లలు ఊరి లో ఉంటారు . ఏవో అసంతృప్తులతో ,కుటుంబం కోసం AK 47 ఆయుధం తో లొంగిపోయాడు . ఆదివాసీ అస్మిత కోసం ప్రజా ఉద్యమం చేస్థానాని ,నక్సలైట్లు ఆదివాసీలను వాడుకొంటున్నారని మీడియా ముందు చెప్పాడు . అతని లొంగుబాటు గురుంచి మీడియా ద్వారా అప్పుడే నాకు తెలుసు . కానీ అతని వల్లా నాకు ఇంత ముప్పు ఉంటుందని ఊహించలేక పోయాను . 

ఇప్పుడు ఇకచేయగలిగింది ఏమి లేదు .. దేన్నైనా గుండె నిబ్బరం తో ఎదుర్కోవటమే ..  

చిరునవ్వులతోనే సంభాషణలు జరుగుతున్నాయి 

సాయంకాలం  తెలిసింది . నన్ను డోంగర్ గఢ్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారని .. 

ఆపేరు వ్వినంగానే భయం వేసింది . ఏ కొండల్లోకో ,అడవుల్లోకో తీసుకెళ్లి ఎన్కౌంటర్ 

చేస్తారేమోనని భయం వేసింది . 

ఓక పోలీస్ సాయం తో గుర్తు వున్న ఒకే ఒక ఫోన్ నెంబర్ హేమ తో మాట్లాడాను అరెస్ట్ గురుంచి చెప్పాను . 

తనతో మాట్లాడిన తర్వాత కొంచెం ధైర్యం పెరిగింది 

ఆ రాత్రే డోంగర్ గఢ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు .. రాత్రి 8 గంటలకు దగ్గర్లో ఉన్న గెస్ట్ హౌస్ లో ఉంచారు . రాత్రి 11 తర్వాత గోండియా నుంచి ఎవరో ఇంటెల్లజెన్సీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడని అతని రూమ్ కి తీసుకెళ్లారు .  

అతను కొంచెం వయసు మళ్ళిన వాడు లాగా ఉన్నాడు .. మనిషి అన్నే పనులు నింపాదిగా చేస్తున్నాడు 

నాకు కాసపు భగత్గీత గురుంచి బోధించాడు .. నేను విన్నట్టే విన్నాను . 

ఆ తర్వాత బుక్ లాంటి కాగితాల కట్ట తీసాడు .. అందులో ఫోటోలు ,వారి తలల మీద వెలలు,వాళ్ళ స్థాయి ,మరికొన్ని వివరాలు ఉన్నాయ్ .  

నాకు చాలా ఫోటోలు చూపించి గుర్తు పట్టగలవా అని అడిగాడు . 

అందరికి చెప్పినట్టే అతనికి ఆవే  సమాధానాలు చెప్పాను . ఆయన శాపాలు పెట్టాడు . నీకు మల్లి జైలు తప్పదు అన్నాడు ,అంతకు మునుపు హైదరాబాద్ లో ఫామిలీ కేసు లో జైలు కి వెళ్లిన విష్యం  గుర్తు చేస్తూ .. 

 టతెల్లవారుగట్ల ఎప్పుడో నిద్ర పోవటానికి దయ తలిచాడు 

నాకెప్పుడూ అనుభవం లోకి రాని కొత్తశక్తులతో ఒంటిరిగా యుద్ధం చేస్తున్నాను . 

ఇదొక చీకటి లోకం .. వెలుగు వచ్చే అవకాశమే లేదు 

అలిసిపోయి మొండిగా నిద్రలోకి జారిపోయాను 

తెల్లవారిపోయింది భయం భయంగానే .. 

నా భయానికి అది మూడో రోజు ..డేట్ 22..12..  218


రెండు తెలుగు రాష్ట్రాలనుండి ,మధ్య ప్రదేశ్ ,ఛత్తీస్గఢ్ ,ఢిల్లీ నుంచి రకరకాల  పోలీస్ డిపార్ట్మెంట్స్ నుంచి రకరకాల వ్యక్తులు రావడం ,అవే  ప్రశ్నలు రక రకాలుగా అడగడం ,ప్రతీవాళ్ళూ తెగ రాసుకోవడం ,ఫొటోస్ తీసుకోవడం .. నాలో ఒక భయం,బాధ ,వేదన .. 

ఉద్యోగ ధర్మం గ పోలీసులు  కానీ సాటి మనిషిగానే నా అవసరాలు అన్నీ  తీర్చారు.  

పోలీస్ with human face లానే అనిపించింది . 

dongargadh  జిల్లా కేంద్రం .. నిన్నటి నుంచి అక్కడి గెస్ట్ హౌస్ లోనే ఉంచారు . 

ఇది నాలుగో రోజు .. 23.1 2. 2018. 

టీ, టిఫిన్  అన్నే అయ్యాక ఇక్కడి నుంచి మహారాష్ట్ర బోర్డర్ పోలీస్ స్టేషన్ బాగ్ నది కి తీసుకెళ్లారు . అక్కడి దగ్గర్లోని అడవుల్లో మధ్యాహ్నం తర్వాత నేను దొరికినట్టు ,నాదగ్గర నక్సల్ సామగ్రి ..పుస్తకాలు,డిటొనేటర్స్ దొరికినట్టు ..మొత్తంగా పెద్ద సీన్  సృష్టించి  నా మీద కేసు రాశారు . ఎవరో ఇద్దరు పిల్లలని తీసుకొచ్చి నన్ను చూపించి ,వారిని ప్రధాన సాక్షులుగ్గా పెట్టారు .. 

ఈ తతంగం అంత ముగిశాక JNU  ,ఢిల్లీ స్టూడెంట్ అని చెప్పుకొని ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి ,నాతో సంభాషణ కి ఉపక్రమించాడు. 

JNU లో తను Free Thinkers Forum  లో ఉండే వాడినని ,ఇప్పుడు ఇక్కడ conciliar గా పని చేస్తున్నానని చెప్పుకొచ్చాడు  

 

లొంగిపోయిన నక్సలైట్స్ ని ,అరెస్ట్ కాబడ్డ వారిని కలిసి  మాట్లాడి ,సన్మార్గం లో పెట్టదానికి పో తాను ప్రయత్నం చే స్తుంటానని చెప్పుకొచ్చాడు . మనిషి చూడడానికి లాల్చీ పైజామా వేసుకొని చిన్న గడ్డం తో ఉన్నాడు. 

సంభాషణ అంత ఇంగ్లిష్ లో సాగింది . 

రష్యా ,చైనా లో కంమ్యూనిజం ఫెయిల్ అయిందని ,హింస వల్ల కాకుండా శాంతియుతగా సమాజం లో మార్పు తీకు రావచ్చు కదా ..ఇలా ఇలాంటి విషయాలు ఎన్నో దొర్లాయి .. 

చాలా తెలివిగా నన్ను ఎదో ఇరికించే విషయాలు ఎన్నో ప్రస్తావించాడు . 

అతనికి నా గురుంచి ఒక క్లారిటీ ఇచ్చాను ,అతని  ఎక్సపెక్టషన్స్ చూసి  . 

నేను మావోస్టు పార్టీ నాయకుడిని కాదు. ఒక sympathiser ని మాత్రమే . ఐన అతని పట్టు వదలలేదు 

నా మాట నమ్మలేదు .  

ప్రభుతవానికి ,మావోస్టులకి మధ్య చర్చలు జరిగితే  బాగుంటుంది అనే విష్యం మీద ఇద్దరం ఏకాభిప్రాయానికి వచ్చాం . 

అయితే దానికి పార్టీ నుంచి ఎవరైనా పెద్ద తలకాయ ఉంటె బాగుటుంది కదా !

కాబట్టి ఒక పేరు సూచించామని నన్ను పదేపదే అదిగేవాడు .. 

నాకైతే ఎవ్వరు తెలీదు .. బయట హరగోపాల్ ,వరవరరావు ఉన్నారని చెప్పాను . 

వాళ్ళు పాత వాలు కదా .. కొత్తవారి గురుంచి చెప్పమని తెలివిగా అడిగేవాడు . 

నా సమాధానం తెలిసి కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా సాగా దీసేవాడు 

అతనికిఅది ఉద్యోగ ధర్మం 

నాకిది ప్రాణ సంకటం .. 

అతను అన్నే ట్రిక్కులు ప్రయోగించేవాడు . 

నాకైతే ఒక టైం పాస్ లే అనిపించింది . 

తిరిగి సాయంకాలానికి dongargarh  జిల్లా కేంద్రానికి తీసుకు వచ్చారు . 

ఇప్పుడు సివిల్ లో న కేసు ఇంచార్జి ఆఫీసర్ చంద్ర సాబ్ . 

ఎస్పీ రాంక్ ఆఫీసర్ .. కొంచెం యువకుడు .  నన్ను కొంచెం ప్రత్యేఖమ్ గా డీల్ చేసాడు . తాను కూడా స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉన్నానని చెప్పాడు. AISF  (CPI ) విద్యార్ధి సంఘం లో వుండే ఫ్రెండ్స్ తో తాను తీరిగేవాడట .. అయితే వాళ్ళు కరెక్ట్ టైం కి వెనక్కి జారుకునేవాళ్లట .. 

మొత్తంగా కమ్యూనిస్టులు అలాంటివారని ,దానికి బహుశా నా దగ్గర ఏమి ఆన్సర్ ఉండదనే అనుకున్నట్టు అన్నాడు . 

కానీ అంత భయం లోను నా అధ్యయానం నన్నెంతో నిలబెట్టింది 

గోడకి కొట్టిన బంతిలా నేను సమాధానంచెప్పాను 

అక్కడే సో కాల్డ్ కమ్యూనిస్టులకు ,మావోయిస్టులకు తేడా అని .. 

అంతే .. అప్పడు కానీ ఆతర్వాత అతని ఆధీనం లో ఉన్న వారం రోజులు కానీ ఇంక్కా ఏమి అడగలేదు 

నువ్వు నాకు అప్పుడే  అర్థం అయిపోయావని నాతో పాటు అందరికి చెప్పేవాడు .. 

 నా ఆరోగ్యాన్ని పట్టించుకుంటూ ,దానికి తగ్గ ఆహారం గురుంచి జాగ్రత్త వహిస్తూ ,'తోడేళ్ళ గుంపు "నుంచి, వాళ్ళ ప్రశ్నల బాణాల నుంచి తన పరిధి మేరకు ప్రయత్నించాడు . 

ఆ సాయంత్రమే హేమ కి ఫోన్ చేసి చెప్పారు .. నాతొ మాట్లాడించారు .. 


రేపు బిలాస్పూర్ లోని NIA court  కి తీసుకెళతారు . ఇక్కడి నుండి దాదాపు 200kms .



 


23, మార్చి 2021, మంగళవారం

నేల ,నింగి ఐన వేళ-3

 నేల ,నింగి ఐన వేళ-3


నేను కూర్చున్న గదిలో  నాకు రక్షణగా పోలీసుల సంఖ్య పెరిగింది . 

నా మందుల గురుంచి అడిగారు. ఆ భయం లో వాటి పేర్లు చాల సేపటి వరకు గుర్తు రాలేదు . చాలా బలవంతంగా గుర్తుకు తెచ్చకోనే ప్రయత్నం ఓ మేరకు ఫలించింది. ఒక్క రోజు కోసం షుగర్ మందులు,ఇన్సులిన్ తీసుకొచ్చారు. అంతలోనే నాగపూర్ గెస్ట్ హౌస్ లో నేను వదిలేసిన నా బ్యాగ్ ,మందులు ,లాప్టాప్ వచ్చేసాయి  . 

వంట ఏర్పాట్లు అయ్యాయి. అందరం కలిసే భోజనం చేసాం. మర్యాదలు  ఏమీ తక్కువ చెయ్యలేదు . మానవత్వం లో లోపం కనిపించలేదు . 

ఈ ఆపరేషన్ కి అసలు బాస్ ఒక సర్దార్జీ . పొట్టిగా గట్టిగానే ఉన్నాడు . తన టీం ని అభినందించాడు. వెల్ డన్ my boys  అని ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ దొర లాగ మెచ్చుకున్నాడు . మొదట నన్నూ   బాగానే పలకరించాడు . నా దగ్గర సమాధానాలు లేని  ప్రశ్నలు కొన్ని అడిగి భంగ పడ్డాడు . కొంచెం బెదిరించాడు .. నా దగ్గర నుంచి వారు ఆశించిన దేదీ దొరకలేదు. 

ఉగ్గబట్టుకున్న కోపం కట్టలు తెంచుకుంది. 

"you Mother Fucker" అని ఇంగ్లీష్ లోనే గట్టిగా అరిచాడు .. నా కంటే అతని సిబ్బంది ఎక్కువ

 భయపడినట్టు నటించారు . 

నా కైతే ఆ మాటకు రోషం పొడుచు కొచ్చింది . mother  fucker అనే మాట నేను ఎప్పుడు వినలేదు . కానీ అది పెద్ద బూతు తిట్టు అని అర్థమైంది . అమ్మ ని తిట్టాడు అని అనిపించింది . మనసులోనే బాధ పడ్డాను .. ఆ తర్వాత సిబ్బందితో నా ఆగ్రహాన్ని పంచుకున్నాను . 

అందరిదీ ఒకే ప్రయత్నం .. నేను  ఎవరైనా ఒక పెద్ద నాయకుడిని పట్టివ్వాలి. లేదా వారి ఫోన్ నెంబర్ ఇవ్వాలి. 

దాని కోసం అందరు నా చుట్టూ వరాలిచ్చే దేవుళ్ళలాగా మసులుకోసాగారు ..  

ఓ ఇద్దరు తెలుగు వాళ్ళను వెదికి  నా దగ్గర కి పంపించారు. ఆ ఇద్దరు  శ్రీకాకుళం వాళ్ళు .. ఇద్దరు యువకులే .. 30 లేదా 35  సంవత్సరాల వయసు ఉంటుంది . రావడం ,రావడమే నాతో వరసలు కలిపేసి బాబాయ్ ,బాబాయ్ అని మాటల్లోకి దింపారు .  కొంచెం సేపు బుజ్జగించేవారు. మరికొంత సేపు ముద్దు ముద్దుగా బెదిరించేవారు . మొదటి రాత్రి నిద్ర పోనివ్వలేదు . ఏవేవో అడగటం ,వాళ్ళు ఎదో రాసుకోవటం ..రాత్రి అంతా  అలానే తెల్లారిపోయింది .. 


 .. పాపం వాళ్ళ మీద జాలేసింది .. వాళ్ళ కానిస్టేబుల్ లేదా హోమ్ గార్డ్ హోదాకి వాళ్ళు పడే తిప్పలు చూస్తే నవ్వొచ్చింది .కానీ ఎవ్వరితో ఏమీ మాట్లాడలో అర్థం కాక ముక్త సరిగా వాళ్ళు అడిగినదానికి సమాధానాలు చెప్పాను . కానీ వాళ్ళు అవకాశాన్ని వదలలేదు . నన్ను బాగు చెయ్యాలని, వాళ్ళు బాగుపడాలని వాళ్ళు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి

వాళ్ళ మొబైల్స్ నిండా వాళ్ళు పట్టుకోవాల్సిన నక్సలైట్ల ఫోటోలు . నన్ను గుర్తుపట్టమని అడిగేవారు

అప్పటికే మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణపతి స్థానం లో శ్రీకాకుళం జిల్లాకి చెందిన నంబాల కేశవరావు ను నియమించినట్లు ఒక పత్రికా  ప్రకటన వచ్చింది .. అతని పాత ఫోటో ఒకటి కూడా మీడియా లో వచ్చింది . ఫోటో చూపిస్తూ ,అతన్ని పట్టుకుని చంపేస్తే  చాలు మొత్తం ఉద్యమం సమసిపోతుందని 'బాబాయ్, బాబాయ్ 'అని పిలిచే అబ్బాయిలు మాట్లాడేవారు

నా ఒక చేతికి ఆ అబ్బాయి(పోలీస్ ) చేతికి చెరో బేడీ వేసి  కాసేపు నిద్ర పోనిచ్చారు . 

జరగ బోయే దేమిటో తెలియదు .. మొత్తానికి జీవితం తల కిందులు అయింది కాబట్టి 

చాలా జాగ్రత్తగా మసులుకోవాలని  విన్న అనుభవాలు ,చదివిన పుస్తకాలు మెదడులో హెచ్చరిస్తున్నాయి . 

డిసెంబర్ 20 రాత్రి గడిచిపోయింది అలా.. 

తెల్లవారింది .. థైరాయిడ్  టాబ్లెట్ వేసుకోవాలి . బాగ్ లోంచి తీసుకొని టాబ్లెట్ మింగాను . కాల కృత్యాల తో పాటు స్నానం కూడా చేశాను . టిఫిన్  ,టీ ఇచ్చారు . 

రెండో రోజు ,డిసెంబర్ 21 ,2018. 


 


17, మార్చి 2021, బుధవారం

 నిప్పు

పదే పదే ఒకే విషయాన్ని
అదే పనిగా చెబుతుంటే ..
అగ్గిపెట్టెను
ఎన్నిసార్లు కనిపెట్టాలని
విసుక్కునే వాడిని
ఎందుకంత అనవసర శ్రమ
అని వాపోయే వాడిని
కాని, నిప్పుదేవుడు
పూజలు అందుకుంటున్నంత కాలం
అగ్గిపెట్టె
కనిపెట్ట బడినదిగా గుర్తించ బడదు
ఆ గుర్తింపు కోసమే మళ్ళీ మళ్ళీ
అగ్గిపెట్టెను
కనిపెట్టవలసి వుంది .

14, మార్చి 2021, ఆదివారం

నిప్పు కణిక

నిప్పు కణిక  


మందు పాతరలను  తప్పించుకోగలిగే 

పాద లాఘవం నీది 

నల్లేరు మీద నడక 

నీ పాద ముద్ర 


ఇక నీ ముద్దుకు 

ఒకే ఒక్క చిరునామా 

రెక్క విప్పిన రెవల్యూషన్ 


దీ నమ్మా .. 

జీవితాన్ని చాప లాగ చుట్టి 

సంకన మడిసి పెట్టుకొని 

వంచిన తల ఎత్తకుండా 

ఏకా ఎకి సాగే 

ఏకాకి నౌక ప్రయాణం .. నువ్వు 


నవ్వు ఆపుకోలేను 

చుక్కల దండ చుట్టుకొన్న 

నీ బాహువుల్లో నే ఒదిగిపోయి 

బోసిపోయిన ఆకాశాన్ని చూసినపుడు 


నువ్వు 

చెక్కుతాను అంటావు 

కానీ అచ్చంగా కోసి 

కారం బెట్టి 

దండెం మీద ఎండేసిన 

కబాబులు కదా 

నీ అక్షరాలు 


కణ కణ మండే 

ఆచరణ నిప్పుల్లో 

లావాలా ప్రవహించే 

ఉనికే నువ్వు 

నివురు చేరగలేని 

నిప్పుకణికే నువ్వు 


కన్నీరింకిపోయిన నవ్వుల్లో 

ఎడారి ఎండమావుల్లో 

నిండైన ఓయాసిస్సే 

నువ్వూ..  నీ మనసూ 


పంతం బట్టి 

ఆకాశాన్ని పతంగం చేసి 

విహంగమయ్యే నువ్వు 

పువ్వుల తోటి కన్నులు కలిపి 

గుండెలు తొలిచే నీ నవ్వు 


అందరూ తల్లి కడుపు లోంచే 

పుడతారు  

నువ్వెంటో  .. ఆశ్చర్యంగా 

నీ దేహంలోంచే మొలకెత్తినట్టు 

ఆకుపచ్చని అందానివి 

ఆత్మ విశ్వాస ప్రతీకవి 

నీ అణువణువూ ప్రత్యేకం 

తపస్సమాధి లోంచి విడివడిన 

చైతన్య ప్రవాహం ఆయేషా .. 

హమేషా .. 




నేల ,నింగి ఐన వేళ-2

 నేల ,నింగి  ఐన వేళ-2




తేది 19. 12. 2018నాగపూర్ కి చేరుకునే ముందే ట్రైన్ లో .. 




సినిమా కథలు ,కర్ణా కర్ణిగా విన్న అనుభవాలు  ఎన్నో తెరలు తెరలు గా తిరుగుతున్నాయి  మైండ్ లో .. స్కార్పియో వేగంగా భండారా వేపు వెళుతోంది. 

డ్రైవర్ (పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ )కర్ణాటక దావా ణ గేర్ లో డాక్టరీ చదివానని చెప్పాడు .మా ఇద్దరి మధ్య మర్యాదపూర్వకంగా మాటలు నడుస్తున్నాయి .నా చదువు గురుంచి నా జాబ్  గురుంచి ప్రశ్నలు అడిగాడు .నేను సరదాగా సమాధానాలు చెబుతూనే జరగబోయే విపత్కరం గురుంచి మనుసు లో ఆలోచిస్తున్నాను . నన్ను భండారా తీసుకు వెళతారేమోనని అనుకున్నాను . 

1994 సంవత్సరం  లో నా  ఉద్యోగం లో భాగం గా భండారా (మహా రాష్ట్ర )ఎస్పీ ని ,కలకలెక్టర్ ని కలిశాను . కలవడమే కాదు ఒక నెలరోజులు వారి కాంటాక్ట్ లోనే ఉన్నాను భండారా లోని ప్రభుత్వ అతిధి గృహం లోనే ఉన్నాను. 

అప్పట్లో పోలీసులకి కలెక్టర్ కి ప్రచ్ఛన్న యుద్ధం జరిగేది. . భండారా పెద్ద నక్సలైట్ ఏరియా .. కల్లోలిత ప్రాంతం .. దానితో పోలీసులు చాలా సహజంగా తమ అధికారమే నడవాలని అనుకునేవారు . పరిపాలన అంత తన ఆఫీస్ నుంచే సాగాలని ఎస్పీ ఉబలాట పడేవాడు . 

పాపం ,కలెక్టర్ తానే నిజమైన అధికారినని ,దాన్నెలా నిలబెట్టుకోవాలో తెలియక సతమతమయ్యేవాడు . 

నాకైఎహె భలే సరదాగా నడిచింది అప్పుడు. ఇప్పుడు అవన్నీ ఒక్కటొక్కటిగా గుర్తు రాసాగాయి .

భండారా అప్పటి నుంచే ఒక పెద్ద పోలీస్ కేంద్రం .. 

సీక్రెట్ చిత్రహింసల కేంద్రం ఏదన్న అక్కడ ఉందేమోనననే ఊహ వచ్చింది . 

భండారా లో బంధించి టార్చర్ పెడతామేననే భయం లోపల తొలిచేసింది .. 

ఆ భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ అప్పటిదాకా ఆపుకున్న ఆకలి బాధ తోసుకొచ్చింది . 

మధ్యాహ్నం మిత్రుడ్ని కలిసిన తరవాత భోజనం చేద్దాంలే అని కడుపుతో నా ఒప్పందం .. 

వీళ్ళేమో వొట్టి మంచినీళ్లు మాత్రమే ఇస్తూ ఎత్తుకెళుతున్నారు . 

స్కార్పియో లో కూర్చోబెట్టి వెంటనే నా పర్సు ,క్రెడిట్ కార్డ్స్ ,మొబైల్ ఫోన్ తీసేసుకున్నారు . 

భండారా దాటి దట్టమైన  అడువుల్లోచి వాహనం హై వే పైనే వెళుతుంది . ఛత్తీస్గఢ్ (దుర్గ్) వైపు ప్రయాణం సాగుతుంది . 

ఒకప్పుడ్డు అందంగా ,ఆరాధనగా కనిపించిన అడవులు ఇప్పుడు ఒక భయాన్ని కలుగచేస్తున్నాయి .. దట్టమైన అడవులు కనిపించగానే ఇక ఇదే చివరి చూపు లాగ గుండె వేగం పెరిగింది  ఏ అడవి లో నిలబెట్టేస్తారో అనే భయం కూడా మొదలైంది. 

అంతిమ గడియలు అంటే ఇవే కాబోలు అనే పిచ్చి పిచ్చి ఊహలు వెంటాడాయి . 

ఛత్తీస్గఢ్ అంటే నాకు మొదటి గుర్తొచ్చే పేరు శంకర్ గుహ నియోగి .. పేరుతో పాటు అతని రూపు కళ్ళకు కడుతుంది . గళ్ళ లుంగీ మీద తెల్లని బనీను  వేసుకొని నులక మంచం లో కూర్చుని ,అమాయకంగా  ,నిబ్బరంగా వుండే అతని  ఫోటోయే గుర్తుకు వస్తుంది. 

కార్మిక నాయకుడికి అతను ఒక మోడల్ . 

ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారో కదా ఈ సమాజాన్ని మార్చాలని .. 

నిజంగా ఎన్కౌంటర్ చేసేస్తారా ?

ఎందుకో నా వెంట వున్నవాళ్లు అంతకు తెగేంచేలా లేరు అని అనిపించింది 

బహుశా ఎక్కడో వీళ్ళ మెయిన్ ఆఫీసర్ ఉంటాడేమోనని అనిపించింది 

ఎవరితోనో చాలా సేపు మాట్లాడారు 

ఒక కొత్త వ్వక్తి దారిలోకలిశాడు .సమోసాలు, నీళ్ల బాటిల్ తీసుకు వచ్చాడు 

దాంతో నా ఆకలి కొంత చల్లారింది 

ఆ తర్వాత టాయిలెట్ కి వెళ్లాలని అడిగాను 

ఒకటా ..రెండా అని వేళ్ళు చూపిస్తూ అడిగారు 

ఒకటే లే అన్నాను 

ఒక నిర్మానుష్య ప్రాంతంలో  బండి ఆపారు 

నా వెనకే వెనకే ఎస్కార్ట్ గా ఇద్దరు నిలబడ్డారు 

నేను ఎక్కడ తప్పించుకుపోతాననే ఏమో చాలా జాగ్రత్త గా కనిపెడుతూ ఉన్నారు 

ఒకో సారి ఎలాగైనా పారిపోవాలని అనిపించేది 

కానీ నా ఆరోగ్యం,మందులతో నడిచే జీవితం ... ఎంత దూరమో పరుగెత్తి తప్పించుకోవడం అసాధ్యమనిపించింది 

నాలో పీక మొండి ధైర్యం రాసాగింది 

భయాన్ని దూరం నెడుతూ ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నిచాను 

వారితో ఎదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాను 

ఇంతలో వాహనం భిలాయ్ టౌన్ లోకి ప్రవేశించింది 

ఒక పెద్ద ప్రభుత్వ ఆఫీసర్ ఇల్లు లాంటి ప్రాంతం లోకి తీసుకు వెళ్లారు 

నన్ను ఒక చిన్నగదిలో కూర్చోబెట్టారు 

అప్పటికి టైం సాయంత్రం 6 కావొస్తుంది . 

అంటే ఒంటిగంట కి నన్ను పట్టుకొని వేగంగా కేవలం 5 గంటల్లోనే నాగపూర్ నుంచి 

ఛత్తీస్గఢ్ లోని ఉక్కునగరం భిలాయ్ కి దాదాపు 260 కిలో మీటర్ల దూరం  తీసుకు వచ్చేసారు. 



నేనేల , నింగి ఐన వేళ ..1

 నేల , నింగి ఐన వేళ ..1 

నాగపూర్ కి వెళుతూ తేదీ 19-12-2018



నాగపూర్ ..సెంటర్ అఫ్ ఇండియా ..ఓరేంజ్ సిటీ ,ఆరెస్సెస్ కేంద్రం ,దీక్ష భూమి .. ఈ నగరానికి ఎన్నో ప్రత్యేకతలు .. 

డిసెంబర్ చలి రాత్రులు .. మధ్యాహన్నం పూట కూడా చలిగానే ఉంది .. స్వేట్టెర్ లాంటిదే వేసుకొని బయలు దేరాను మిత్రుడ్ని కలుద్దామని ,నీరి గెస్ట్ హోసే నుంచి .ఓలా  ఆటో బుక్ చేద్దామని ట్రై చేసాను. పాత బకాయిలు కడితేనే వొస్తాను అని చూపించింది .. వద్దులే అని వదిలేసి రోడ్డు పైకి వచ్చి లోకల్ ఆటో ఎక్కి కోల్ ఇండియా ఆఫీస్ కి అని  చెప్పాను . అప్పుడు 12 అవుతుంది . లంచ్ చేయలేదు . ఆటో దిగి టీ తాగా ను. తాపీగా నడుచుకుంటూ ఆఫీస్ మెయిన్ గేట్ నుంచి లోపలి వెళుతున్నాను . గేట్ దగ్గ ఎవ్వరు ఆపలేదు . కొద్దీ దూరం నడిచాక అనుమానం వచ్చి గేట్ వేపు చూసాను . పోలీస్ ల్లాంటి కురచ కట్టింగ్ తో ఓ నలుగురు మనుషులు నా వేపే నడుస్తూ వచ్చారు. వారి నడక ,చూపులను బట్టి వారు పోలీసులే అనుకున్నాను .కొంచెం భయం వేసింది .ఏమిటి చేయడం ?

ఎటు పరుగెత్తినా ,వాళ్ళు నలుగురు ..నేను ఒక్కడ్ని .. తప్పించుకోలేను ..వృథా ప్రయాస . లెట్స్ పేస్ ఇట్  అనే నిర్ణయానికి వచ్చేసాను . కొంచెం నిబ్బరం కూడా అరువు తెచ్చుకున్నాను . దగ్గరగా వచ్చి నా పేరు తో పిలిచారు .. ఊ అన్నాను భయంగా .. 

వాళ్లు నన్నెరగరు . నా పేరేదో తెలుసు .. అంతే. 

నలుగురు  నా చుట్టూ మూగి బయట జీపు దగ్గరికి నడవమని చెప్పారు . అది స్కార్పియో బండి .. మధ్య సీటు లో మధ్యన కూర్చో బెట్టి ,ఇరు పక్కలా ఇద్దరు కూర్చున్నారు .. డ్రైవర్ సీట్లో ఇన్స్పెక్టర్ రాంక్ పోలీస్ .. అతని పక్కన కూడా పోలీస్ .. అయితే వారు నన్నేమి భయపెట్టలేదు .. వారు కూడా ఎందుకో భయం భయం గానే ఉన్నారని అనిపించింది .  

అయితే అకస్మాత్తుగా అంతా తలకిందులుగా ఐంది అని అనిపించినా తరుణంలో .. ఒక భయం .. ఒక భాధ కలగలిసి వెన్నాడుతున్నట్టే వుంది . . 

వాతావరణాన్ని తేలీక చేయటం కోసం నేనే మొదట అన్నాను .. నా షుగర్ మందులు ,బ్యాగ్  నా గెస్ట్ హోసే లో ఉన్నాయ్ .. ఎలాగూ తీసుకెడుతున్నారు కాబట్టి అవి కూడా తెచ్చేయమని కాస్త కూల్ గానే చెప్పాను . 

అప్పటికే సమయం ఒంటి గంట దాటి ముప్పై నిముషాలు  ఐంది . ఒక పోలీస్ అధికారి నా దగ్గర గెస్ట్ హౌస్ అడ్రెస్ తీసికొని వెళ్ళిపోయాడు .. 

పోలీస్ వాహనం మాంచి స్పీడ్ లో వెళుతోంది . 

ఎటు తీసుకెళతారో .. ఎం చేస్తారో.. రకరకాల ఊహాలు ..భయాలు ... ఊహాలు ..వ్యూహాలు .. తప్పించుకొనే అవకాశం ఉంటుందా ?


అనాది ప్రవాహము

అనాది ప్రవాహము 


 తీరం మీది  ఇసుకలో

గొయ్యి తీసి  

ముఖం ఒకటి  

పాతిపెడతాను 

కన్నీటిని  అదిమి పట్టుకోలేక  

అది సముద్రమై మొలకెత్తడం 

కొత్త వింతేమీ కాదు 




దేన్నీ అడుక్కోవటం కాదు 

అభ్యర్థనా అలవాటు  లేదు 

అనాది ప్రవాహం ఇది 

ఎప్పుడు

వెనక్కి తగ్గింది లేదు

అలలై కమ్ము కోవటమే 

ఆటుపోట్లు లెక్కలోకి రావు 

అది రోజువారీ ఆటాపాటే !



మట్టిబుర్ర

మట్టిబుర్ర 

 అప్పటికే

వేడి పాలు తాగి 

నాలుక కాల్చుకున్నవాడిని 


ఇప్పుడు 

చల్లని మజ్జిగ ని కూడా 

ఊదుకుంటూ 

తాగడం 

ఒక అలవాటుగా మారింది 


అది కూడా 

ఒకలాంటి  భయం  అని 

తెలిసేలోగా 

చీకటి పడిపోయింది 

అంతే .. 

నా కండ్లు 

ఆ చీకటికి 

కావలి కుక్కలా 

అతుక్కు పోయాయి 


అవునూ .. నువ్వు 

పండు వెన్నెలలా 

పరుచుకున్నావు 

కొండ వెలుగులా 

విచ్చుకున్నావు 

నిన్ను 

పోల్చుకోలేక పోయాను 

అనేది ఒక  అందమైన అబద్దం 

నిన్ను 

తెల్సుకోలేకపోవటం 

నేను ఎక్కాల్సిన రైలు 

ఒక జీవిత కాలం లేటు 


మాట వరసకి

 మాట వరసకి


రోజూ లాగే ఫోన్ చేసే మిత్రుడే.. మాటల్లో పడి  సీరియస్ విషయాల్ని కూడా పిచ్చాపాటిగా తీసుకునే వాడే .. 

ఒక అధర్మ సందేహం గురుంచి ఇంకో మిత్రుడితో మాట్లాడానని చెప్పాను  

ఎందుకు అందరి సలహా అడుగుతావు ?మనకు ఎమన్నా తెలివి తక్కువా ?.. అని తనతో పాటు నన్ను పైకి లేపేశాడు 

నా తెలివి గురుంచి నాకు కించిత్ గర్వమే !

ఈ తెలివి అనే భావ పదార్థం గురుంచి ఎన్ని తగవులో!ఈ మిత్రుడే ఒకసారి మాటల్లోనే .. నీదంతా 

పు స్తకాల తెలివి .. మీ లాంటోళ్ళు అంతా కలల్లో లేదా పుస్తకాల్లోమాత్రమే  ఉంటారని కొందరితో కలిపి నన్ను అవతలికి విసిరి పారేశాడు. 

ప్రాక్టికల్ గా ఉండాలి ..గ్రౌండ్ మీద మనిషి అనుభవాలు వేరు . అవి సిద్ధాంతాలకు లొంగవు .అలా హితబోధ చేస్తూ కమ్యూనిజం కూడా అందుకే ఫెయిల్ అయిందని తేల్చేసాడు 

అతనలా గ్రౌండ్ మీద నిలబడి గట్టిగా  మాట్లాడేసరికి  కాస్త గాభరా పడిపోయాను . 

నా కలలు ,పుస్తకాలు గాల్లో ఎగిరిపోతున్నట్టే అనిపించింది 

అయితే నా వంతు పోరాటాన్ని నేనూ  వదల్లేదు

అతనితో వాదానికి తల పడ్డాను 

అయితే ఏమిటి ?ప్రేమ వివాహాలు తప్పంటావు 

అవి నిలబడవు .చివరికి కుటుంబాలే వారిని  కాపాడుతాయి . కుటుంబాలే దిక్కు ..అన్నాడు 

ఎర్రజెండా కప్పుకున్న మనువును మీరెప్పుడైనా చూసారా ?

చూసే వుంటారు .కానీ రంగుల ప్రపంచీకరణ లో గుర్తుపట్టడం చాలా కష్టమైన పని .. 

ఇందులో తప్పు ఎవరిదెంత అని అప్పు ఆలోచనల్లో పడ్డాను 

అయితే మొదట్లో ఒక విషయాన్ని లేవనెత్తి నేను ,మీరు ఎటో కొట్టుకు పోయాం 

విష్యం ఏంటి అసలు 

మనకు తెలివి ఉందా లేదా 

వుంది ..బోల్డంత ..పుస్తకాలు పుస్తకాలుగా ఉంది 

కానీ అవతలవాళ్ళ తెలివి పర్వతాలు పర్వతాలుగా ,సాంప్రదాయాల పొరలు పొరలుగా పేరుకు పోయి ఉంది 

దాన్నే అనుభవంగా బెదరగొడుతున్నారు

 

ముల్లుని ముల్లుతోనే తీయాలనేది పాత సామెతే కాదు, పనికి రాదనీ కూడా రుజువు అవుతూనే ఉంది 

అయితే ఏమి చేయాలి 

ఎప్పటికి వాడుకోగలిగే  శేషప్రశ్న..  

మనకు తెలివి వున్నా మాట వాస్తవమే గావచ్చు గాక .. 

కానీ అడ్డగోలు తెలివి ని బద్దలుగొట్టగలిగే గుండె ధైర్యాన్ని అలవర్చుకోవడం 

నేటి  అవసరం .. 

దాన్ని మరీ అంత తేలికగా తీసిపారవేయలేము అనే సంగతిని కూడా గుర్తు పెట్టుకొని మెలగాలి .. 





12, మార్చి 2021, శుక్రవారం