3, ఏప్రిల్ 2021, శనివారం

part..5

 బిలాస్పూర్  .. ఇండియా లో ఏ ఊరు పేరు చెప్పిన వెంటనే ఎదో జ్యాపకం తట్టి లేపుతుంది ..బహుహా ఉద్యోగధర్మమా అని ఎన్నో ఊర్లు తిరిగాను

. ఎందరినో కలిశాను . ఎదో లింక్ లో చాలావరకు గుర్తుండిపోతాయి . ప్రతిదాంట్లో మనిషి యొక్క శ్రమని ,అతని అద్భుతమైన ప్రతిభా పాటవాలను చూసి ముగ్ధుడనయిపోతానేమో అన్నీ అలా కనుల ముందు తెరలుగా కదులాడుతుంటాయి . 

బిలాస్పూర్ చిన్నాచితకా ఊరు ఏమి కాదు . ఛత్తీస్గఢ్ లో కేపిటల్ సిటీ రాయపూర్ తర్వాత పెద్ద పట్టణం ఇదే .. హై కోర్ట్  ఇక్కడే ఉంది. 

మా ఆఫీస్ (NGRI ) వర్క్ విషయమై షాడోల్ (మధ్యప్రదేశ్ ) లో ఉన్నప్పుడు హైదరాబాద్ కి రాకపోకలు ఈ రూట్ లోనే జరిగేవి . పెద్ద రైల్వే జంక్షన్ ఇది . తెలుగు పత్రికలు దొరికేవి

 ఇది ఐదో రోజు ..తేదీ 24. 12. 2018. 

నన్నురడీ కమ్మని  చెప్పారు. ఫుల్ బందోబస్తు తో సాయుధులైన పోలీసులు వెంట రాగా  వాహనం లో బయలు దేరాం . మధ్యలో ఎక్కడో చిన్న హాస్పిటల్ లో నన్ను డాక్టర్ కి చూపించి మెడికల్ సర్టిఫికెట్ తీసుకున్నారు,బహుశా దాన్ని కోర్ట్ లో సబ్మిట్ చెయ్యాల్సి ఉంటుంది . 

కోర్ట్ సమయానికి 11. 00 గంటలకు చేరుకున్నాం .  న్యాయ మూర్తి ముందు హాజరు పర్చారు .

హేమ కాస్త లేటుగా వచ్చింది . అడ్వకేట్  అమరనాథ్ పాండే  కూడా లేట్ గా వచ్చాడు 

పోలీసుకస్టిడీ 10 రోజులు అడిగారు. కోర్ట్ వారు వారం రోజులు ఇచ్చారు . 

 నన్ను తిరిగి పోలీసులు తీసుకు పోతున్నప్పుడు తర్జని కనిపించింది,పరుగెత్తుకెళ్లి తనని పట్టుకొని ఏడ్చాను . శ్రీదేవి, విమల సంపత్ ,కుమారస్వామి కూడా వచ్చారు .కాసేపు మాట్లాడాను వారితో . 

పోలీసులు నన్ను తిరిగి వారి వెంట నన్ను అరెస్ట్ చేసినట్టు చూపించిన పోలీస్ స్టేషన్ baagnadi కి తీసుకుపోయారు . బాగనది  చిన్న ఊరే అయినా నక్సలైట్ సమస్య వల్ల  పోలీస్ స్టేషన్ చాలా పెద్దది .నన్ను పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఒక గది  లో  ఉంచారు. నాతో ఇద్దరు సాయుధ పోలీసులు .. నన్ను అరెస్ట్ చేసిన మొదటి రోజు నుండి రాత్రి పూట ఒక చేతికి ,నేను పడుకునే మంచానికి కలిపి బేడీలు వేస్తూనే ఉన్నారు . చాలా ఇబ్బందిగా అనిపించేది . 

నాతో పాటు నా బాగ్ లో అరుంధతి రాయ్ రాసిన Utmost Happiness  అనే పుస్తకం ఉండేది . పడుకునే ముందు కాస్త ఆ పుస్తకం చదివి పడుకునేవాడిని . 

 పోలీసులు  మంచిగా మాట్లాడేవారు . నా భాధలు తెలుసుకొనే వారు . వారి ఇబ్బందులు పంచుకునే వారు . 

డిసెంబర్ చలిరాత్రులు .. ఛత్తీస్గఢ్ లో అడవుల వల్ల కాబోలు చలి ఎక్కువే . ఎన్నో బాధల  ఆలోచనలతో ,అలసట తో నిదురపోయాను . 


ఛత్తీస్గఢ్ పోలీస్ స్టేషన్ లో మొదటి రాత్రి గడిచిపోయింది .. 

పోలీస్ కస్టడీ అంటే పోలీస్ ఇంటరాగేషన్ .. బహుశా ఈ రోజు నుంచి ఆ హింస ఉంటుంది 

పొద్దునే లేచాను కానీ బయట విపరీతమైన చలి . ఆ చలి లో చన్నీళ్లతో స్నానం .. శిక్ష లో భాగమే అనిపించేది 

 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి