part -7
నాగపూర్ లో 20డిసెంబర్ న పట్టుకుని రెండు రోజులు వారి(ఛత్తీస్గఢ్ పోలీసులు ) ఆధీనం లో భిలాయ్ లో ఉంచుకొని ,విచారించి,విచారించి చివరికి నాలుగో రోజు అంటే 23 వ తేదీ న మహారాష్ట్ర బోర్డర్ పోలీస్టేషన్ బాగ్ నది పరిధి లో అడవుల్లో పట్టుకున్నట్టు అరెస్ట్ చూపించి ,సాయంకాలానికి భిలాయ్ లో ప్రెస్ ముందు నన్ను హాజరు పరిచారు . అంతా వాళ్ళే మాట్లాడారు . ఒక వింత మనిషిని చూపించినట్లు నన్ను వారి ముందు ఒక్కసారి ఆలా నిలబెట్టి వెంటనే దాచేసారు .
అయితే ఈ సర్కసు కు ఒక గంట ముందు విషయాలు చాలా ముఖ్యమైనవి ..
నన్ను మహారాష్ట్ర లో పట్టుకున్నది ఛత్తీస్గఢ్ పోలీసులే అయినా ఇప్పుడు ,ఇక్కడ కథ నడిపిస్తున్నది NIA వాళ్ళే ..
NIA అంటే మీకు ఏమైనా గుర్తుకు వస్తుందా ?
నిజానికి రావాలి ..కానీ ప్రపంచీకరణ మనిషిని ఒక పశువు కంటే హీనం చేసింది . ఒక జంతువు కు వుండే కనీస స్పందనలు లేకుండా చేసింది .
NIA అనంగానే మనకు గుర్తుకు రావాల్సింది CIA అనే అమెరికా పోలీస్ వ్యవస్థ . CIA -క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ . NIA -నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ .
అణిచివేత ,దోపిడీ వ్యవస్థలే గ్లోబలైజ్ అయ్యాయి .
మనిషి.. ఇవ్వాళ సీసీ కెమెరా కి తక్కువ ..ఆధార్ కార్డు కి ఎక్కువ ..అంతే !
పొద్దుటి నుంచే నా మీద పెట్టబోయే రాజద్రోహ కేసుల గురుంచి చర్చ జరిగింది . గత రాత్రి ఒక ప్రయత్నం జరిగింది . నాలో మొండి తనమో ,ఒక అమాయక ఆదర్శవాదమో కానీ వాళ్ళని భలే ఇబ్బంది పెట్టింది . ఏ కారణం చేతో కానీ వాళ్ళు నన్ను మరీ బలవంత పెట్టలేదు .
కానీ ఉదయం నుంచి చాలా తెలివిగా నన్ను అంటిపెట్టుకొని ,నా నుంచి ఎదో రాబట్టాలని ట్రై చేసి ,ట్రై చేసి అయినా అలిసిపోని NIA పోలీస్
(DSP రాంక్ అని చెప్పుకొన్నాడు)నేను ప్రెస్ ముందుకు వెళ్లే ముందు చాలా సేపు మాట్లాడాడు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి