కనక రాజు .. చర్చ్ చుట్టూ అల్లుకున్న జీవితాల్లో అదే పేరు .. జనం లోకి వచ్చి జనార్దన్ అయ్యాడు .. సాహిత్యం లోకి వచ్చి సముద్రుడు అయ్యాడు .
నువ్వు ఆడమనిషివి అయితే నిన్నే పెండ్లి చేసుకునేవాడిని .. అన్నాడు సాహిత్యం మీద పిచ్చితో .. ఒకసారి నగరం లోని ఒక కేఫ్ లో కూర్చున్నప్పుడు .. ఇక అది విడిపోయేవేళ .. నన్ను చూసి కవి కావాలని ప్రయత్నించానని అనేవాడు . ఆ పట్టుదల అతన్ని అడవిగా నిలిపింది .. సముద్రానికి కవిత్వాన్ని వినిపించటం అతనికే సాధ్యమైంది. కవితా చరణాలను గుండె మీది జేబులో పెట్టుకొని తిరిగేవాడు చాయ్ తాగుతూనే దానికి నడక నేర్పేవాడు అయినా ఆ కవిత ని ఒక కలల సిలువగా మోసుకుని తిరిగేవాడు ఒక సారి ఎంత ప్రేమగా అడిగాడో .. నేను చనిపోయిన తర్వాత నా మీద ఒక కవిత రాస్తావా అని.. అతని మరణ వార్త తెలిసి ఎడారుల నుంచి దుః ఖ మై వచ్చాను . వాడు నాలో సముద్రమై నిండిపోయాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి