4, ఏప్రిల్ 2021, ఆదివారం

సార్థ్క్యం

 సార్థ్క్యం 


సార్థ్క్యం..  

ఆధ్యాత్మిక వాదం లోంచి పుట్టిన పదం 

 అని చాలా సార్లు తికమిక పడ్డ  మాట వాస్తవం 

సార్థ్క్యం! 

ఏముంది త్యాగానికి పర్యాయ పదమే కదా 

సార్థ్క్యం !

మోక్షానికి దగ్గర దారి .. 

కాదు ...కాదు ..కాదు . 

అవును 

ఇంకా చాలా సార్లు అనాలి .. కాదు అని 


విచిత్రంగా అందరిదీ ఇదే ప్రశ్న 

ఈ జీవితానికి అర్థం ,పరమార్థం 

సార్త్క్యం  ఏమిటి 


ఉత్పత్తి ,పునరుత్పత్తి 

నిర్మాణం ,పునర్నిర్మాణం లో 

నిమగ్నమైన మనిషే 

సార్త్క్యం సాధించాడు 

అందుకే అమ్మ ధన్యజీవి ఐంది 

దారి చూపే గురువొక్కడే 

పూజలందుకున్నాడు 


రెక్క విప్పిన రెవల్యూషన్

ప్రపంచ కార్మికుల ఐక్యత కోరుకుంది 

నువ్వు నన్ను కోరుకుంటావు   

నేనూ  నిన్ను చేరుకుంటాను 

కానీ 

నిన్నే కాదు 

నీ మొక్కవోని ప్రేమను 

నిలబెట్టే కర్తవ్యం లో 

ఎదో స్వార్థం ,ఒక సార్త్క్యం 

 నీ లాగే నన్ను పెనవేసుకొని ఉంటాయి 













































kkkk  








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి