తలాష్
నన్ను నేను
వెదుక్కుంటూ వెదుక్కుంటూ
రాత్రి లోకి పగలును
బలవంతంగానే దొర్లించేసి
నిజంగానే అలిసిపోతాను
నేను జైలుగాడి
కనుసన్నల్లోనే ఉంటాను
అయినా వాడికి
వాడిమీదే అనుమానం
పొద్దుపొద్దున్నే
తలాష్ తలాష్ అంటూ
నా రెండు దుప్పట్లను
చిందర వందర చేస్తాడు
పాపం వాడికేమి దొరకదు
ఉద్యోగ ధర్మం తప్పా
నా రాత్రి వెన్నెల స్వప్నాల మీద
వాడి మొరటు దాడే .. తలాష్
(జనవరి,2019 నుండి మూడు నెలలు జైలు కాలం .. బిలాస్పూర్ (ఛత్తీస్ ఘడ్ )
నన్ను నేను
వెదుక్కుంటూ వెదుక్కుంటూ
రాత్రి లోకి పగలును
బలవంతంగానే దొర్లించేసి
నిజంగానే అలిసిపోతాను
నేను జైలుగాడి
కనుసన్నల్లోనే ఉంటాను
అయినా వాడికి
వాడిమీదే అనుమానం
పొద్దుపొద్దున్నే
తలాష్ తలాష్ అంటూ
నా రెండు దుప్పట్లను
చిందర వందర చేస్తాడు
పాపం వాడికేమి దొరకదు
ఉద్యోగ ధర్మం తప్పా
నా రాత్రి వెన్నెల స్వప్నాల మీద
వాడి మొరటు దాడే .. తలాష్
(జనవరి,2019 నుండి మూడు నెలలు జైలు కాలం .. బిలాస్పూర్ (ఛత్తీస్ ఘడ్ )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి