ఆచరణ -మొదట
నా చిటికెన వేలు పట్టుకొని
బుడి బుడి అడుగులు వేస్తుంది
నా నుంచే నడక నేర్చుకుంటుంది
పడుతూ ,లేస్తూ
జ్ఞానాన్ని పెంచుకుంటూ ,పేర్చుకుంటూ
నాతో నడిచే నేస్తమౌతుంది
నాకు వివరిస్తుంది ,విశదపరుస్తుంది
ఆచరణ -మరింతగా విస్తరిస్తుంది
అప్పుడు -
అది నాలో వలపౌతుంది
ఒకరి కోసం ఒకరం జీవిస్తూ వుంటాం
ఒకరిని విడిచి ఒకరం ఉండలేని
ప్రేమ అవుతుంది -ఆచరణ
ఆ ఆచరణే ఆకాశమంత విశాలమౌతుంది
ఆచరణ -నాకు దారి చూపే చుక్కాని అవుతుంది
చివరాఖరికి -నా ఆచరణే నాకు గురువు అవుతుంది .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి