5, అక్టోబర్ 2012, శుక్రవారం

గీతల మధ్య నువ్వు నేను


గీతల మధ్య  నువ్వు నేను 

ఎంతసేపు చదువుతూ  కూర్చుంటావ్ ,ఏదో ఒకటి రాయాలి  కాని ;
.............................................
మనకేం  తెలుసు  రాయటానికి ......
 ............................................
బుర్ర లో నింపటం కాదు ఎప్పుడూ  , అప్పుడప్పుడు ఖాళీ చేస్తూ వుండాలి.

..............................................
ఏమో యుగాల నీ ప్రేమనంతా   భద్రంగా దాచుకోవాలనే నేమో !

మౌనంగా మిగిలిపోయేవాడిని .
.........................................
బుద్దు ! అని  ఒక విసురు ..
.........................................
చిరునవ్వు  సమాధనం  కాదు కాని

మాట తడబాటు నుంచి  తప్పుకోవడం ....
..........................................................
ఇప్పుడు నీమీద కోపం ఒక వాస్తవం

కాని , పంచుకున్న అనుభూతులకు పంచభూతాలు సాక్షి కదా !
........................................................................................
నువ్వన్నట్లు ఇప్పుడు మొత్తం ఖాళీ చేసే ప్రయత్నం చేస్తాను

అక్షరమై రావా ...క్షణబంగురమైన  ఈ జీవితం లోకి ...

..........................................
      హైదరాబాద్ :5-10-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి