5, అక్టోబర్ 2012, శుక్రవారం

నను వీడని నీడవు

 నను వీడని నీడవు 

తెలుసు ,
జీవితం   ఒక గాజు పలక 

ఎంత ఓడిసిపట్టుకున్నా జారిపోయే క్షణాలే ఎక్కువేమో !

బద్దలైన ప్రతిసారి గుండె పగిలి పోయిన సవ్వడి 

పొగిలి పొగిలి ఏడ్చినా కన్నీటి ఊట ఆగదు 

నడుస్తున్న కాలం వెనక్కి తిరిగి చూడదు 

పగిలిన గాజు పెంకులు  

ఇంకా నీ ప్రతిబింబాలనే ప్రతిఫలిస్తుంటై

నా ప్రశ్నలు నన్నే వెక్కిరిస్తున్నట్లు ...

 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి