5, అక్టోబర్ 2012, శుక్రవారం

మోనోలాగ్  
చల్లగాలికి కూడా నుదిటి మీది చెమట తడి ఆరదు
గుండె నిండా ఎడతెగని ఆరాటం
ఎడారిలో ఒంటె నడకలా  నలుగుతునేవుంటుంది
ఒక వేపు నా ప్రేమ
కొందరికి నచ్చని అంశమే
మరోవేపు ఆశయలబాటలో కలిసి నడిచే మైత్రి
విచిత్రంగా రెంటినీ
వదులుకోలేని మనః స్తితి నాది
ఎప్పుడు ప్రేమ వేపే మొగ్గాను
ప్రేమ లేకుండా బ్రతకలేని హృదయవేదన
దేన్నీ లెక్కచెయ్యలేదు
నేస్తాలు నన్ను నడిపించాలని
మాయమోహాల నుండి విడిపించాలనే విశ్వప్రయత్నం
ప్రతిసారి విఫలం అవుతునేవుంది
నా ప్రేమని అర్థం చేయుంచే
ప్రయత్నాలు ఎప్పుడు నిష్పలమే
ఒంటరినయ్యేవాడిని
విపరీతమైన బాధా సముద్రం
సునామిలా విరుచుకుపడేది
కొట్టుకుపోయునట్టే తిరిగి ప్రేమలోకే వెళ్ళేవాడిని
గడియరంలా ఘర్షణ  టక్ టక్ మని కొట్టుకోవడం ఆగేదికాదు
నిజం నిలకడ మీద తెలుస్తుందిలే
అని భయం భయంగా నే  క్షణాలను
దిగమింగుకుంటూ , దిగమింగుకుంటూ
కాంతిసంవత్సరాలు దొర్లిపోతుంటై
ఏ వెలుగురేఖా తొంగిచూడదు
అదే చీకటి ,అదే నలుపు
నా హృదయ గవాక్షం నిండా
..................................

అంతరంగమే కాదు
సర్వంగాలు చచ్చు పడిపోతాయి
'తీపి' బాద మనుసును
తొ లిచేస్తుంటుంది
తోలిపోద్దులోను  అస్తమయమే అల్లలాడుతుంది
ఔను ,
నిన్నలేని కొత్త బాధ ఒకటి
నేడు తోడవుతుంది
అయినా  తొవ్వ సాగదు
తన్లాట ఆగదు
ఎప్పటిలాగే
సంధ్య కేసి చూస్తుంటాను
ఎవరామె అంటారు యధాలాపంగా
చలాన్ని స్మరించుకుంటూ
తలతిప్పకుండానే మనసు నిండా నవ్వుకుంటాను .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి