9, మే 2012, బుధవారం

ఒక  అద్బుతమైన క్షణాల కోసమే కదా ,
రణమైనా,నిరంతర గమనమైనా
ఘడియ పురుసత్ వుండదు ,దమ్మిడి ఆదాయము లేదు
అయినా ఆగక సాగే ప్రయాణము
పర్వతాలు ,అఖాతాలు
నీళ్ళు ,నిప్పులు
అడ్డంకులు ఎన్నైనా
అధిగమిస్తూ ,అతిక్రమిస్తూ
 అనంతమైన చలనమే ....
దప్పిక తీర్చే చెలిమలైనా
కంటికి ఇంపు అయ్యే పూదోటలైన
మనుసును రంజింప చేసే పక్షుల పాటలైనా
చిన్నపిల్లలా ఆటలైన ,
ప్రేయసి ఊహాలైన ...
సేద తీర్చే నేస్తాలు


కమ్మటి కలలు వస్తాయి
ఆపుకోలేని దుక్కం
బళ్ళున వాంతి చేసుకుంటుంది
గుండె భేజార్ అయు పోతుంది
భయం కొరడా  ఝలిపిస్తుంది


అయినా-
ఏదో ఒక అద్బుతమైన క్షణాల కోసం
అన్వేషణ ఆగదు..ఆగదు..
27-12-11

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి