1, మే 2012, మంగళవారం

నిండా ముసుగేసుకుని
ముడుచుకు పోయింది మనసు
ఆకాశం మబ్బు పట్టింది 
మూగనోము పట్టినట్టుగా...

రాత్రి నాలుగు వాన చినుకులు పడ్డాయేమో ..
చల్లదనం గిలిగింతలు చలి చలిగా
మనసు మరింతగా
బిగుసుకు పోయింది
ఏవో ,ఏవేవో భావాలు
ఎప్పటిలాగే ఘర్షణ లోంచి
బయటపడలేక ...
హృదయం మరింత
బరువెక్కింది
ఇక్కడి నుంచి వెయ్యు కిలోమీటర్ల
దూరంలో యుద్ద మేఘాలు
కమ్ముకోని వున్నై .
ప్రకృతి ప్రసవించిన పచ్చదనాన్ని
వేటాడుతూ ..
గ్రీన్ హంట్ ...
పచ్చి రక్తం  కారుతున్న
నాలుకలతో
నరలోకపు యములు
అడవి గుండెల్లోకి ..
అబుజ్ మాడ లోకి ..
వెళుతున్నారు
గిరిపుత్రుల జీవితాల్లో
ఇక రక్తపు చుక్కల వాన.
ఇది అనాగరికం ,అమానుషం కూడా
ఐనా -
పోరాటమే జీవితం ఐన వాడికి
ఓటమి ఉంటుందా ..
అతడు అడవి నే కాదు
తన ఆత్మను జయుంచాడు .
అందుకే అతనికి చావు భయం లేదు
వేట అతడికి సాంప్రదాయ క్రీడ
వెంట దిటవు గుండెల అండ ...
డేట్ :08-11-2009
ఆల్వాల్ .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి