15, జనవరి 2012, ఆదివారం

ఆకుపచ్చ లోయ

ఆకుపచ్చ  లోయ
   
ఈ ఆకుపచ్చ లోయలో 
నీ అడుగులన్ని 
నీటిజాడలై

నాకోసం నిరీక్షిస్తున్నట్లు ...
అడవి గాలి ఆర్ద్రంగా పిలుస్తుంది 
      
వాన జడిలో తడిసి 
మొలకెత్తే  అడవి 

ఎండా పొడ  లో 
ఎంత ఎత్తు ఎదిగి పోతుందో !
        

జారుడు బండ లాగ 
ఈ లోయలోకి 
నా హృదయం జారి  పోతుంది  
          



ఎండలను ఒక చెంప 
నీడలను ఒక చెంప 
రాసుకుంటూ ,పూసుకుంటూ 
అడవి పులకరించిపోతుంది 

నీ ఆత్మలోకం ఇక్కడే అంటూ
నా మనసు పరవశించి పోతుంది  
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి