15, జనవరి 2012, ఆదివారం

మోహం

 ప్రేమే మరీ

 ఏ తాపత్రయాలు లేవు

ఏ  ప్రతాప ప్రదర్శనా ఇచ్ఛా లేదు

భిక్షం  అడిగే ఫకీరు మల్లె

నీ ప్రేమ ముంగిలి లో

నిలబడ్డాను  అంతే

అలసట     నిదుర లోంచి

లేచి  వస్తావో   లేదో ...

నిర్దయగా తలుపే  మూసి వేస్తావో ....

అయినా  సరే మోడల్లె ఎండిపోను

నీ మోహంలో చిగురిస్తాను

మల్లి మళ్ళీ ...








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి