నీటి బుడగ
సముద్రం అలల్లా
జీవితం ఎప్పుడు
ఒక తీరం దగ్గర ఘర్షణ పడుతుంది
అది తీరం తోనా ,సముద్రంతోనా అని
ఎప్పటికీ తేల్చు కోలేకపోతుంది
సముద్రంలోంచి పరుగెత్తుకొచ్చి అల
తీరం మీద తల బద్దలు కొట్టు కుంటుంది
అది ఆత్మ హత్యా సదృశ్యమే!
సముద్రం మీద చచ్చిన శవం లా
ఒక అల ఎప్పుడూ
తేలియాడుతునే వుంటుంది
చావు బ్రతుకుల మధ్య
ఒక జీవితం వేలాడినట్టు...