అధ్యక్షా !కెనడీ ఉత్త పనికిమాలిన మనిషి
ప్రకాశం జిల్లా ,గిద్దలూరు తాలూకా ... కొమరోలు మండలం ..అల్లీనగరం గ్రామం ...
మనిషి పేరు .. జాన్ కెనెడీ ... పేరుకు మాత్రమే అమెరికా అధ్యక్షుడు ... వాస్తవం లో అల్లీనగరం మచ్చర్ పహిల్వాన్ ..ఊరవతల దళితవాడ తనది.. జానెడు ..అంటే జానెడె పొట్ట చేత్తో పట్టుకొని హైదరాబాద్ పట్నం వచ్చాడు 1989 లో .చిన్న చిన్న పనులు చేస్తూ దేశం అంతా తిరిగాడు . ఈ సమాజం ఆతనికి ఏమి నేర్పించ లేకపోయింది . అతనే అందరికి ఎదో చెప్పాలనే తాపత్రయం లో ఉండే వాడు . భయపడకూడదని చెప్పేవాడు .. అలానే జీవించాడు . మరణాన్ని ఎప్పుడూ కోరుకోలేదు . మృత్యువే అతన్ని వరించి వచ్చింది,రోగాల ఉరి తాడు పేనుకొని .
కెనెడీ గురుంచి ఏమి రాస్తాం .. ఉత్త పనికి మాలిన మనిషి .
పని కోసం పాపం దేశాలు తిరిగేవాడు ..కాని అవీ ఉత్త పనికి మాలిన దేశాలని అతని అర్థాంతరపు చావు.. డప్పు కొట్టి మరీ చెప్పింది .
కెనడీ కి ఎంత బాధ వున్నా హాయిగా నవ్వడం ఒకటే బాగా తెలుసు . ఈ స్పీడ్ యుగం లో ఏ పనైనా ఫటా ఫట్ చేసే వాడు . అప్పుడే కెనెడీ ఈ కాలం మనిషి అనిపించే వాడు . కానీ ఎవ్వరు అతన్ని తన మనిషిగా చూడలేకపోయారు .
తల్లితండ్రులు మోసిన సిలువను మెడలో వేసుకొన్నాడు.కాని పెద్దవాళ్ళ దగ్గర పనికోసం ఆ సిలువను మాసిన చొక్కా చాటున దాచేవాడు. దేవుడ్ని ఎప్పుడు ఏదీ అడిగినట్టు కనిపించేవాడు కాదు . దేవుడి బిడ్డల్ని కాపాడాలని తనే మాటి మాటికీ ఒక సిలువు ను మోసేవాడు .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి