"పాలవాగు"ఆత్మీయ కథ
"పాలవాగు" అని నా బ్లాగు పేరు.మీతో మాటలు పంచుకునే ప్రవాహం.నన్ను మీలో ఒక్కడిని చేసే గవాక్షం .పాలవాగు; ఎంత అందమైన పేరు కదా !నను పెంచిన ఊరు పొలిమేరల్లో మెలికలు తిరుగుతూ పారే నీటి అందమే ఇది.దీన్ని దాటితేనే అడవిలోకి వెళ్ళగలిగే వాళ్ళం .జానపద కథలే తోడుగా గడిచిన జీవితంలో వాగులు , వంకలు, వనాలే అద్బుతాలు . ఎంత గమ్మత్తుగా తోచేదో !ఇప్పుడు తలచు కుంటేనే నవ్వొస్తుంది .ఒకవైపు దయ్యాలు అంటే అమిత భయ్యం.మరోవైపు అడవిలో అందమైన వనకన్యలువుంటారని ఎన్ని రొమాంటిక్ ఊహలో !అమాయకత్వం లో ఉండే అపరిమితమైన ఆనందం అదేనేమో!
నా కలల నడకల సవ్వడి పాలవాగు.శ్రీ మహా విష్ణువు శయనించే పాల సముద్రం కాదిది.పాల చెట్టుమీలో ఎంతమందికి తెలుసో? పాలపిట్ట,పాలచెట్టు తెలంగాణ గట్టు మీది చందమామలు .
పాలపిట్ట చాల శుభప్రదమైన పక్షి అని అంటారు..దసరా పండుగ రోజు దాన్ని చూడడం; అదో వేడుక .
ఇక పాలచెట్టు, ప్రసస్తమైనదే !పెళ్లిపందిరి ఫై పాలచెట్టు రెమ్మలే వేస్తారు .పాల పొరక నీడలో పెళ్లి జరుగుతుంది .అలాంటి పాలచెట్లకు ప్రాణం పోసిన జలదేవత ఈ పాలవాగు.
ఇది ఎక్కడో ఇప్పుడే చెపుతాను.కాజీపేట -డిల్లి రైల్ మార్గంలో, గోదావరి నదీ ప్రవాహం దాటిన తర్వాత మంచిర్యాల్ అనే ఊరు. దాని కి పక్కనే మందమర్రి అని చిన్న ఊరు .చిన్న ఊరే కావచ్చు , కాని కడుపు లో ఎన్నిదాచుకుందో !బొగ్గు గుట్టలు. రాక్షసబొగ్గే కాదు రగులుకున్న విప్లవాల ఊసులు ఉన్నాయ్!
మందమర్రి ;ఊడలు దిగిన జ్యాపకాలు ఆకాశానికి ఊయలలేయడమే కాదు బొగ్గు పొరల్లో మా తండ్రుల,మా అన్నల పోరాట వారసత్వాన్ని భద్రంగా ఎత్తిపట్టే జమ్మిచెట్టు కూడా ! మందమర్రి ఊరే కాదు , ఒక కాలేరు కూడా !ఊర్లల్ల బ్రతకలేని జనం బ్రతకొచ్చిన బొగ్గు గనుల కాలరీ ఇది.కుప్పలుకుప్పలుగా జనం భూగర్భం లోకి వెళ్లి ,తల్లికడుపులోకి వెళ్లి మల్లి తిరుగొచ్చినట్లు ...ఎత కష్టం..ఎంత కష్టం .ఊర్లల్ల " దొరా బాంచెన్" .గనుల మీద "బాయి దొరా బాంచెన్".
"ఈ ఊరు మనదిరా ,ఈ వాడ మనదిరా ,దొర ఏందిరో ,వాని పీకుడు ఏందిరో ! "అనే పాట కాలేరు లో ప్రతిధ్వనించింది .చీకటి మూసిన జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరించినై .కొత్త విలువలు మొగ్గతొ డిగినై .కులం లేదు, మతం లేదు .కార్మికవర్గం ఒక్కటిగా నిలబడి,కలబడి "కదం కదం ఫర్ లడనా సీకో,జీనా హాయ్ తో మర్నా సీకో" అనే విముక్తి గీతాన్ని ఆలపించింది.