9, మే 2012, బుధవారం

ఒక  అద్బుతమైన క్షణాల కోసమే కదా ,
రణమైనా,నిరంతర గమనమైనా
ఘడియ పురుసత్ వుండదు ,దమ్మిడి ఆదాయము లేదు
అయినా ఆగక సాగే ప్రయాణము
పర్వతాలు ,అఖాతాలు
నీళ్ళు ,నిప్పులు
అడ్డంకులు ఎన్నైనా
అధిగమిస్తూ ,అతిక్రమిస్తూ
 అనంతమైన చలనమే ....
దప్పిక తీర్చే చెలిమలైనా
కంటికి ఇంపు అయ్యే పూదోటలైన
మనుసును రంజింప చేసే పక్షుల పాటలైనా
చిన్నపిల్లలా ఆటలైన ,
ప్రేయసి ఊహాలైన ...
సేద తీర్చే నేస్తాలు


కమ్మటి కలలు వస్తాయి
ఆపుకోలేని దుక్కం
బళ్ళున వాంతి చేసుకుంటుంది
గుండె భేజార్ అయు పోతుంది
భయం కొరడా  ఝలిపిస్తుంది


అయినా-
ఏదో ఒక అద్బుతమైన క్షణాల కోసం
అన్వేషణ ఆగదు..ఆగదు..
27-12-11

6, మే 2012, ఆదివారం


ఆకాశం నా కు ఆదర్శం
ఉదయానికి ఎన్ని హంగుల రంగులో ,
సాయంకాలం వీడుకోలుకి
అన్ని కళా కాంతులు ..
08-06-08
కొండ మీది నుంచి
ఆకు పచ్చని  కళ్ళల్లోకి 
తల వంచి చూసాను
అడవి కొమ్మ వీచి  పిలిచింది 
బాండ రాయి కఠినం 
కొండ నా కాళ్ళను పట్టేసింది 
కొడైకెనాల్ శీతలం గాలి
నీ లాగే తల నిమిరింది 
15-06-08,ఉదయం 11
కొడైకెనాల్  
ఒక్కోసారి ఆకాశం కంటే
మేఘాలే ముద్దని పించును
నీ sms  ల్లాగే . 
13-06-08       
 


                 
కదిలే గాలి
నీలాగే
చెవి నిండా కబురులెన్నో
చెబుతుంది .
14-06-08
ఒక శూన్యం ఎప్పుడు
నీ ప్రేమతో పరిపూర్ణమౌతుంది .
12-06-08
నన్ను నెట్టేస్తూ ఈ గాలి
నీకేదో మర్యాద చేస్తున్నట్టు
గొప్ప హడావిడి చేస్తుంది .
14-06-08,అర్థరాత్రి 
నిన్నే వలచానో ,
ఈ వెన్నెలనే ప్రేమించానో
నీ విరహంలో వెన్నెల
నన్నొక కవిగా మలచింది .
16-06-08,అర్థరాత్రి .

1, మే 2012, మంగళవారం

నిండా ముసుగేసుకుని
ముడుచుకు పోయింది మనసు
ఆకాశం మబ్బు పట్టింది 
మూగనోము పట్టినట్టుగా...

రాత్రి నాలుగు వాన చినుకులు పడ్డాయేమో ..
చల్లదనం గిలిగింతలు చలి చలిగా
మనసు మరింతగా
బిగుసుకు పోయింది
ఏవో ,ఏవేవో భావాలు
ఎప్పటిలాగే ఘర్షణ లోంచి
బయటపడలేక ...
హృదయం మరింత
బరువెక్కింది
ఇక్కడి నుంచి వెయ్యు కిలోమీటర్ల
దూరంలో యుద్ద మేఘాలు
కమ్ముకోని వున్నై .
ప్రకృతి ప్రసవించిన పచ్చదనాన్ని
వేటాడుతూ ..
గ్రీన్ హంట్ ...
పచ్చి రక్తం  కారుతున్న
నాలుకలతో
నరలోకపు యములు
అడవి గుండెల్లోకి ..
అబుజ్ మాడ లోకి ..
వెళుతున్నారు
గిరిపుత్రుల జీవితాల్లో
ఇక రక్తపు చుక్కల వాన.
ఇది అనాగరికం ,అమానుషం కూడా
ఐనా -
పోరాటమే జీవితం ఐన వాడికి
ఓటమి ఉంటుందా ..
అతడు అడవి నే కాదు
తన ఆత్మను జయుంచాడు .
అందుకే అతనికి చావు భయం లేదు
వేట అతడికి సాంప్రదాయ క్రీడ
వెంట దిటవు గుండెల అండ ...
డేట్ :08-11-2009
ఆల్వాల్ .

మౌనం గానే ఉంటాను
కాని మనసు ఎడతెగక 
మాట్లాడుతునేవుంటుంది
అన్ని పాత్రలు తనే అయ్యు ..

నువ్వు రాలేనప్పటి కంటే
రాకుండా ఉన్నప్పటి బాధ
గుండెను మరింత బరువేక్కిస్తుంది

ఏదో అన్నింటింకి అతీతంగా
ఉండగలమని అనుకుంటాము బింకంగా ..
కాని నిజంగా నీరై పోయే హృదయానికి
వేరే దారేముంది ?
నీరు పల్లమెరుగు ...

నీ కోపానికి అర్థం లేదని
అనే హక్కు నాకు ఉందనుకోను.
కాని నీ పోరాటాన్ని మనస్పూర్తిగా
సమర్ధించ గలనో లేదో ననే
అనుమానమైతే ఉంది
దానికి -నన్ను మలిచిన
ఎంత పితృస్వామ్య మకిలిని
వదిలించు కోవాలో కదా !
మరి -నేను వలచిన
ప్రేమేక హృదయాన్ని
నిలుపు కో వాల్సి వుంది .
ఎంత కష్టం ..ఎంత కష్టం ...
తనెంత ఇష్టమో తెలియని బుద్డుకి ...
డేట్ :05-10-2010 ,23.30
హైదరాబాద్ .
రాత్రి  ఆకాసంలో 
నీ కంటి వెలుగు ల్లా 
విరబూసిన చుక్కల్నిచూస్తె 
కవిత్వం జల జలా ...                

    
paalavaagu chenthana..,.   

paalavaagu pilichindi...

           

           

cheekati velugula jeevitham...

chethilo cheyyesi...