29, అక్టోబర్ 2021, శుక్రవారం
10, అక్టోబర్ 2021, ఆదివారం
కన్నీటి కాలం
కన్నీటి కాలం
కాలాన్ని ఎంత పిండుకున్నానో
నా కన్నీటి ధారనడుగు ..
జారిపడ్డ ప్రతి కన్నీటి బొట్టు
కాలం ఒడిలోకే చేరిందని చెప్పలేను
తొక్కిపెట్టిన కన్నీరే
మాటిమాటికి తన్నుకుంటూ వస్తుంది
కన్నీటి ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోలేదు
అందుకేనేమో అది అప్పుడప్పుడు
కాలం తో కలిసి దొంగదెబ్బ తీస్తుంది
నేలచూపుల కన్నీటికి ఎదురుచూపులే
నేర్పానని అనుకున్నాను
కానీ అది అప్పుడప్పుడు చాటుగా తల తిప్పి
పక్క చూపులు చూస్తుంది
కాలం వేపు ఆర్తిగా ..
బందీ
బందీ
కాలం నీడ నా మీద
గద్ద లా కదలాడుతుంది
నన్నుతన కాళ్ళ గోళ్ళ మధ్య
ఇరికించుకుని..
నా ప్రయాణం మొత్తం
తనే పూర్తి చేస్తుంది
విహంగ వీక్షణంలా ..
లోకమంతా ఒక్క తీరుగా
పచ్చ పచ్చ గా ఉంది
అంతా పకడ్ బందీగాను తోస్తుంది
కాలానికి చిక్కిన బందీకి ..
9, అక్టోబర్ 2021, శనివారం
ఇట్లు ఒక కల
ఇట్లు ఒక కల
ఏ కల చెదిరి
నిదుర లేచినా
కనుకొనల్లో చెమ్మ తగిలి
రెండు చేతి వేళ్ళు
తల్లడిల్లిపోతాయి
నా తనువును నువ్వేదో నిమిరినట్లు ..
యాది ..
యాది ..
సముద్రం నీ నవ్వు
తీరం నువ్వు కట్టుకున్న చీర
తిరగబడ్డ గాలి నీ కొంగు
మొత్తంగా నువ్వలా నిలబడి పోతే
చివరికి నీలోనూ నేనే కనిపించాను
నీకు గుర్తుందో లేదో కానీ
సిగ్గుపడటం నీకే కాదు
నాకూ వచ్చని తెలిసిన రోజు
మనం కలిసాం
సిగ్గులు ముగ్గులుగానే సమయం
తెల్లారిపోవటమూ నీకూ అనుభవమే
సముద్రాన్ని కవిత్వ కౌగిలి లోకి లాక్కోవడం
నిన్ను నిద్రలోనే పక్క మీద నుంచి తోసేయటం
అలవోకగా జరిగిపోయిందని చెప్పలేను
అలలు అలలుగా నీ కలలు చెలరేగినప్పుడు
నీకంటే కవిత్వమే ముద్దొచ్చోదేమో కన్నుగీటి ..