30, మే 2020, శనివారం
29, మే 2020, శుక్రవారం
26, మే 2020, మంగళవారం
నక్సల్బరీ
నన్ను ఎక్కడో కోల్పోయునట్లు
నీ గుండెల్లో ముఖం దాచుకున్నాను
నీ హృదయం విశాలం
నన్ను ఉద్యమ నెలబాలుడ్ని చేసి
నీ చిటికన వేలుతో నడిపించావు
నడిచినంతమేరా నీ వెలుగులే
నువ్వలా వెనుదిరుగకుండా సాగిపోతూనే వున్నావు
నేను ఒక ఏడురంగుల వాన విల్లును చూస్తూ అలా నిలబడిపోయాను
ఆ తర్వాత నడక తప్ప నాకు ఇంకేమి గుర్తు లేదు .
అదే స్ఫూర్తి
ఈ రోజు నీ మీద దిగులుతో కూడా నడుస్తున్నాను
అయితే నీలా చందమామయ్య కబుర్లు చెబుతూ
గోర్కీ అమ్మలా ప్రయాణ బడలిక పోగెట్టే వారేరి ?
ఎప్పటికీ ఇలానే నీ వెంటే నడవాలనే
ఒక ఎడతెగని కల ఒకటి నావెనక వెనకే ....
నన్ను ఎక్కడో కోల్పోయునట్లు
నీ గుండెల్లో ముఖం దాచుకున్నాను
నీ హృదయం విశాలం
నన్ను ఉద్యమ నెలబాలుడ్ని చేసి
నీ చిటికన వేలుతో నడిపించావు
నడిచినంతమేరా నీ వెలుగులే
నువ్వలా వెనుదిరుగకుండా సాగిపోతూనే వున్నావు
నేను ఒక ఏడురంగుల వాన విల్లును చూస్తూ అలా నిలబడిపోయాను
ఆ తర్వాత నడక తప్ప నాకు ఇంకేమి గుర్తు లేదు .
అదే స్ఫూర్తి
ఈ రోజు నీ మీద దిగులుతో కూడా నడుస్తున్నాను
అయితే నీలా చందమామయ్య కబుర్లు చెబుతూ
గోర్కీ అమ్మలా ప్రయాణ బడలిక పోగెట్టే వారేరి ?
ఎప్పటికీ ఇలానే నీ వెంటే నడవాలనే
ఒక ఎడతెగని కల ఒకటి నావెనక వెనకే ....
నnnekkado కోల్పోయునట్లు
నీ గుండెల్లో ముఖం దాచుకున్నాను
నీ హృదయం విశాలం
నన్ను పసిపాప ను చేసి
నీ చిటికన వేలుతో నడిపించావు
నడిచినంతమేరా నీ వెలుగులే
నువ్వలా వెనుదిరుగకుండా సాగి పోతూ నే వున్నావు
నేను ఒక ఇంద్రధనస్సు చూస్తూ అలా నిలబడిపోయాను
ఆ తర్వాత నడక తప్ప నాకు ఇంకేమి గుర్తు లేదు .
అదే స్ఫూర్తి
ఈ రోజు నీ మీద దిగులుతో కూడా నడుస్తున్నాను
అయితే నీలా చందమామ కబుర్లు చెబుతూ
అమ్మలా ప్రయాణ బడలిక పోగెట్టే వారేరి ?
ఎప్పటికీ బుద్దు లానే నీ వెంటే నడవాలనే
ఒక ఎడతెగని కల ఒకటి నావెనక వెనకే ....
జనాంతర్గామి .. మంద మర్రి
జనాంతర్గామి .. మంద మర్రి
మందమర్రి ..
ఊడలు దిగిన జ్ఞాపకాల ఆశల ఊయల
ఆశయాల పాలపందిరి
నీడ నిచ్చే వేపచెట్టు ,పాలచెట్టు ..
నడుము చుట్టూ చేయు వేసే పాలవాగు
చల్ జంబల్మర్రి .. వెయ్యు కాళ్ళ జెర్రి
మందమర్రి ..
రగులుకొనే రాక్షస బొగ్గును వెలికి తీస్తూ
భూగర్భంలోనూ సంచరించే జనాంతర్గామి
పోరాట వారసత్వాన్ని భద్రంగా ఎత్తిపట్టే జమ్మిచెట్టు ..
తల్లికడుపులోకి వెళ్లి మళ్ళీ తిరిగొచ్చినట్లు ..
మసి మొహాల్లో మెరిసే తెల్లని నవ్వులు ..
చల్ జంబల్మర్రి .. వెయ్యు కాళ్ళ జెర్రి
మందమర్రి ..
" దొరా బాంచెన్"... ఊర్లల్ల వెట్టి బతుకులు
"బాయి దొరా బాంచెన్".. బండ కింద సచ్చి బతుకుడు
" ఎందాక చూద్దామురో ,ఎల్లన్నారో,మల్లానారో
ఇక ఎగబడదామురో ..
ఊరు మనదిరా ,ఈ వాడ మనదిరా
దొర ఏందిరో ,వాని పీకుడు ఏందిరో ! "
పోరాట తూటాలై న పల్లె పాటల చరణాలు
చల్ జంబల్మర్రి .. వెయ్యు కాళ్ళ జెర్రి
మందమర్రి ..
చీకటి మూసిన జీవితాల్లో కొత్త వెలుగులు...
మొగ్గ తొడిగిన కొత్త విలువలు
కులం లేదు, మతం లేదు
కాలేరు మీదికి బతకొచ్చిన కష్టజీవులం మేము..
గని కార్మికులం మేము
చల్ జంబల్మర్రి .. వెయ్యు కాళ్ళ జెర్రి.
( కాజీపేట -డిల్లి రైల్ మార్గంలో, గోదావరి నదీ ప్రవాహం దాటిన తర్వాత మంచిర్యాల్ అనే ఊరు. దాని కి పక్కనే మందమర్రి .చిన్న ఊరే కావచ్చు , కాని కడుపు లో ఎన్నిదాచుకుందో ! రాక్షసబొగ్గే కాదు రగులుకున్న విప్లవాల ఊసులు ఎన్నో ఉన్నాయ్!)
"పాలా గు" అని నా బ్లాగు. అదొక మాటల ప్రవాహం.నన్ను మీలో ఒక్కడిని చేసే గవాక్షం .పాలవాగు; ఎంత అందమైన పేరు కదా !నను పెంచిన ఊరు పొలిమేరల్లో మెలికలు తిరుగుతూ పారే నీటి అందమే ఇది.దీన్ని దాటితేనే అడవిలోకి వెళ్ళగలిగే వాళ్ళం .జానపద కథలే తోడుగా గడిచిన జీవితంలో వాగులు , వంకలు, వనాలే అద్బుతాలు . ఎంత గమ్మత్తుగా తోచేదో !ఇప్పుడు తలచు కుంటేనే నవ్వొస్తుంది .ఒకవైపు దయ్యాలు అంటే అమిత భయ్యం.మరోవైపు అడవిలో అందమైన వనకన్యలువుంటారని ఎన్ని రొమాంటిక్ ఊహలో !అమాయకత్వం లో ఉండే అపరిమితమైన ఆనందం అదేనేమో!
నా కలల నడకల సవ్వడి పాలవాగు.శ్రీ మహా విష్ణువు శయనించే పాల సముద్రం కాదిది.పాల చెట్టుమీలో ఎంతమందికి తెలుసో? పాలపిట్ట,పాలచెట్టు తెలంగాణ గట్టు మీది చందమామలు .
పాలపిట్ట చాల శుభప్రదమైన పక్షి అని అంటారు..దసరా పండుగ రోజు దాన్ని చూడడం; అదో వేడుక .
ఇక పాలచెట్టు, ప్రసస్తమైనదే !పెళ్లిపందిరి ఫై పాలచెట్టు రెమ్మలే వేస్తారు .పాల పొరక నీడలో పెళ్లి జరుగుతుంది .అలాంటి పాలచెట్లకు ప్రాణం పోసిన జలదేవత ఈ పాలవాగు.
కవితే
కవితే
ఈ చీకటి గదిలోనే లోకం
మూసిన తలుపుల్లోనే తన్లాట
మనసు కిటికీ తెరిచి
అనoతమైన ఆకాశాన్ని
ఎప్పుడు చూసినా అబ్బురమే
ఆ అద్బుతాలను తాకి చూడాలనే
మనుసు పడే ఆరాటాన్ని ఆపుకోలేని
పరుగు లో జీవితం ఎన్ని వర్ణాల్ని కలబెట్టిందో !
కలత చెందినా కవితే
కల చెదిరినా కవితే
బ్రతుకు పండినా కవిత్వమే
ఈ చీకటి గదిలోనే లోకం
మూసిన తలుపుల్లోనే తన్లాట
మనసు కిటికీ తెరిచి
అనoతమైన ఆకాశాన్ని
ఎప్పుడు చూసినా అబ్బురమే
ఆ అద్బుతాలను తాకి చూడాలనే
మనుసు పడే ఆరాటాన్ని ఆపుకోలేని
పరుగు లో జీవితం ఎన్ని వర్ణాల్ని కలబెట్టిందో !
కలత చెందినా కవితే
కల చెదిరినా కవితే
బ్రతుకు పండినా కవిత్వమే
25, మే 2020, సోమవారం
ఆకలి
ఆకలి
గంజి మెతుకు పెదవుల్ని విడదీసుకుంటూ
తన సారాన్ని ఒంపుకుని కడుపు నిండా మాట్లాడింది
గంజి మెతుకు పెదవుల్ని విడదీసుకుంటూ
తన సారాన్ని ఒంపుకుని కడుపు నిండా మాట్లాడింది
దూరం
దూరం
ఈ దూరం
నీకైనా ,నాకైనా ఒకటేలే
నేను నీలో వుంటాను
నువ్వు నాలో ..
మనసు గది నీ చుట్టే అల్లుకొని ఉంటుంది
నీ భుజం మీద చెయ్యి వేసి
నీ మనుసులోన ముఖం దాచి
నిన్నే చూస్తాను
ఈ దూరం
నీకైనా ,నాకైనా ఒకటేలే
నేను నీలో వుంటాను
నువ్వు నాలో ..
మనసు గది నీ చుట్టే అల్లుకొని ఉంటుంది
నీ భుజం మీద చెయ్యి వేసి
నీ మనుసులోన ముఖం దాచి
నిన్నే చూస్తాను
ధైర్యం
ధైర్యం
నువ్వు వెళ్ళిపోయినందుకు
పితూరీ ఏమీ లేదు
అలాగే నిలబడి పోవటానికి
నా నీడ కైనా కాస్త ధైర్యం
చెప్పి ఉంటే బాగుండేది
నువ్వు వెళ్ళిపోయినందుకు
పితూరీ ఏమీ లేదు
అలాగే నిలబడి పోవటానికి
నా నీడ కైనా కాస్త ధైర్యం
చెప్పి ఉంటే బాగుండేది
8, మే 2020, శుక్రవారం
భయ్యం
భయ్యం
అద్భుతాల జడి బాల్యం
అబ్బురపడటం ఆలస్యం
భయాలు పీడకలల్లోకి లాక్కెళ్ళేవి
భయం జీవితపు క్రీడ అయిపోయింది
అందరు నన్ను ఆడుకుంటున్నట్టే తోచేది
అలవాటైన ఆటగా భయం
నాలో చోటు చేసుకుంది
అమ్మా దయ్యం.. అంటూ
అమ్మనే ఆట పట్టించేవాడిని
భయాన్ని జయించటానికి
కళ్ళు మూసుకొని ఎందరి దేవుళ్ళని ఆశ్రయించానో
ఎందరి జాతీయ నాయకుల్ని నిలబెట్టుకున్నానో
కాని ఫలితం శూన్యం
ఆ సంఘర్షణ లో
నిస్పృహ లాంటి నా కోట లోకి
పాట ఒకటి వచ్చింది
కొంగు నడుము కు చుట్టవే చెల్లెమ్మా
కొడవళ్లు చేపట్టవే చెల్లెమ్మా..
అమ్మ దుః ఖానికి
అక్క కష్టానికి
పోరాటం ఒక్కటే మార్గమని తోచింది
దొర ఏందిరో వాడి పీకుడేందిరో ..
ఊరు మనదిరా వాడ మనదిరా..
పాటలు ..
నాకు కర్ణ కుండలాలు అయినాయి
కత్తుల కోలాటమే
కలల సాకారానికి
కొండంత ధైర్యాన్ని ఇచ్చింది
ఈ లోగా పగబట్టినట్టుగా ప్రపంచీకరణ
దేశాల్ని ప్రజల్ని వలస కూలీలను చేసింది
ప్రతి ప్రకృతి వనరు
ఒక యుద్ధక్షేత్రమయింది
ప్రతి మనిషి బ్రతుకు
కరోనా భయంతో లాక్ డౌన్ అయింది
భయ్యం ఇప్పుడు అంతర్జాతీయ క్రీడ ..
అద్భుతాల జడి బాల్యం
అబ్బురపడటం ఆలస్యం
భయాలు పీడకలల్లోకి లాక్కెళ్ళేవి
భయం జీవితపు క్రీడ అయిపోయింది
అందరు నన్ను ఆడుకుంటున్నట్టే తోచేది
అలవాటైన ఆటగా భయం
నాలో చోటు చేసుకుంది
అమ్మా దయ్యం.. అంటూ
అమ్మనే ఆట పట్టించేవాడిని
భయాన్ని జయించటానికి
కళ్ళు మూసుకొని ఎందరి దేవుళ్ళని ఆశ్రయించానో
ఎందరి జాతీయ నాయకుల్ని నిలబెట్టుకున్నానో
కాని ఫలితం శూన్యం
ఆ సంఘర్షణ లో
నిస్పృహ లాంటి నా కోట లోకి
పాట ఒకటి వచ్చింది
కొంగు నడుము కు చుట్టవే చెల్లెమ్మా
కొడవళ్లు చేపట్టవే చెల్లెమ్మా..
అమ్మ దుః ఖానికి
అక్క కష్టానికి
పోరాటం ఒక్కటే మార్గమని తోచింది
దొర ఏందిరో వాడి పీకుడేందిరో ..
ఊరు మనదిరా వాడ మనదిరా..
పాటలు ..
నాకు కర్ణ కుండలాలు అయినాయి
కత్తుల కోలాటమే
కలల సాకారానికి
కొండంత ధైర్యాన్ని ఇచ్చింది
ఈ లోగా పగబట్టినట్టుగా ప్రపంచీకరణ
దేశాల్ని ప్రజల్ని వలస కూలీలను చేసింది
ప్రతి ప్రకృతి వనరు
ఒక యుద్ధక్షేత్రమయింది
ప్రతి మనిషి బ్రతుకు
కరోనా భయంతో లాక్ డౌన్ అయింది
భయ్యం ఇప్పుడు అంతర్జాతీయ క్రీడ ..
3, మే 2020, ఆదివారం
నగరం మీద వలసకూలీ ప్రేమగీతం
నగరం మీద వలసకూలీ ప్రేమగీతం
("అమృతం కురిసిన రాత్రి" తిలక్ కి క్షమాపణలతో)
కాలే కడుపే కాదు
తరతరాల మోహం నీపైన
అందుకే నా కండలు
నా గుండెలు నీ పాదాల చెంత పెట్టాను
నువ్వు ఆడుకొనే రైలు బొమ్మలు
చక్రాల కారు బొమ్మలు
మా ఊరి పక్క నుండే వెళ్ళేవి
నువ్వు ఎగరేసే రెక్కల విమానాలు
మా చెరువు ను దాటుకుంటూ వెళ్ళేవి
నీ వింతలు గురుంచి ఎన్ని కథలో
అందుకే మరి ఒక్కసారైనా
నిన్ను దగ్గరగా..
దూరం నుంచి ఐనా చూసి
తరించాలని అనిపించేది
కానీ నీ మాయా లోకం లోకి వచ్చాక
తిరిగి వెళ్లడం నా వల్ల కాలేదు
ఇక నీ సేవ కే ఈ జన్మ అనుకొంటూ
అలా నిలబడిపోయాను
ఇప్పుడు ఈ కరోనా భయం వచ్చి పడింది
ఎన్నో విద్యలొచ్చిన నువ్వే అలా వణికి పోతే
నీ వెనక లోకాలు గెలవాలనుకునే
ఫాగల్ గాన్ని,.. నేనేం అయిపోవాలా
నీ నవ్వు ముఖం చూసుకుంటూ
కడుపు నింపుకునే నేను
కరోనా చావుకళ తో బెదిరిపోయిన
నిన్ను చూసి తట్టుకోలేక పోతున్నాను
అందుకే నిన్ను విడిచి వెళుతున్నా
ప్రియా..
నిన్నిలా పిలిచి కూడా
ఎన్ని రోజులయ్యిందో !
అప్పుడెప్పుడో స్కైలాబ్ పడుతుంది
అందరం చచ్చిపోతాం అంటే
లాస్ట్ సప్పర్ లా నువ్వు ఇచ్చిన విందు లో
చీకట్లో ప్రేమగా
ప్రియా.. అని పిలిచి నట్టు గుర్తు
మళ్లీ ఇన్నాళ్ళకి నీ మీద
అవ్యాజ్యమైన ప్రేమ పుట్టుకొస్తుంది
కానీ ఏమి చేయను
నీ ప్రేమ బలం తో నేను
ఎక్కడైనా ఎలాగైనా బతికేస్తాను
నిన్ను కాపాడుకోవటానికే
ఇప్పుడు ఇలా నిన్ను విడిచి వెళుతున్నా
నా తల్లి పల్లె ను కలిసి తిరిగొస్తా
ఏ కష్టానికైనా నా తల్లి దగ్గర
అద్భుతమైన తాయెత్తులు వుండేవి
ఒక్క ఆకలికి తప్ప
నన్ను అలాగే నిన్ను చేరేలా పెంచింది
అందుకేనేమో నీ ప్రేమ మత్తు లో పడ్డాను
నువ్వూ ఒక అద్భుతమైన అల్లాఉద్దీన్ దీపానివే కదా
అద్భుతాల వెంట పడటం
మా పేదరాశి పెద్దమ్మ కథలు కథలు గా నేర్పింది
ఒకసారి నువ్వే చూ పించినట్టు గుర్తు
మున్నాభాయ్ ఎం బి బి ఎస్
తెలుగు లో శంకర్ దాదా ఎం బి బి యెస్
ఎంత హాయిగా నవ్వుకున్నాం అప్పుడు
కానీ దానికి అసలు కాపీ మా అమ్మే తెలుసా!
కడుపులో తలకాయ పెట్టి
నా గుండె లో ఏమి బాధ దాగి ఉందో ఇట్టే చెప్పేది
ఎంత పెద్ద కష్టాన్ని అయినా
చిన్న చిట్కా తో దాని పని పట్టేది
కరోనా ని కూడా
తన కంటిచూపు తోనే చంపెసేదే!
కానీ కరోనా
కంటికి కనిపించకుండా కదా
నిన్ను భయ పెడుతుంది
అమ్మో !
అది నీ లాగే గడుసరి మరి..
("అమృతం కురిసిన రాత్రి" తిలక్ కి క్షమాపణలతో)
కాలే కడుపే కాదు
తరతరాల మోహం నీపైన
అందుకే నా కండలు
నా గుండెలు నీ పాదాల చెంత పెట్టాను
నువ్వు ఆడుకొనే రైలు బొమ్మలు
చక్రాల కారు బొమ్మలు
మా ఊరి పక్క నుండే వెళ్ళేవి
నువ్వు ఎగరేసే రెక్కల విమానాలు
మా చెరువు ను దాటుకుంటూ వెళ్ళేవి
నీ వింతలు గురుంచి ఎన్ని కథలో
అందుకే మరి ఒక్కసారైనా
నిన్ను దగ్గరగా..
దూరం నుంచి ఐనా చూసి
తరించాలని అనిపించేది
కానీ నీ మాయా లోకం లోకి వచ్చాక
తిరిగి వెళ్లడం నా వల్ల కాలేదు
ఇక నీ సేవ కే ఈ జన్మ అనుకొంటూ
అలా నిలబడిపోయాను
ఇప్పుడు ఈ కరోనా భయం వచ్చి పడింది
ఎన్నో విద్యలొచ్చిన నువ్వే అలా వణికి పోతే
నీ వెనక లోకాలు గెలవాలనుకునే
ఫాగల్ గాన్ని,.. నేనేం అయిపోవాలా
నీ నవ్వు ముఖం చూసుకుంటూ
కడుపు నింపుకునే నేను
కరోనా చావుకళ తో బెదిరిపోయిన
నిన్ను చూసి తట్టుకోలేక పోతున్నాను
అందుకే నిన్ను విడిచి వెళుతున్నా
ప్రియా..
నిన్నిలా పిలిచి కూడా
ఎన్ని రోజులయ్యిందో !
అప్పుడెప్పుడో స్కైలాబ్ పడుతుంది
అందరం చచ్చిపోతాం అంటే
లాస్ట్ సప్పర్ లా నువ్వు ఇచ్చిన విందు లో
చీకట్లో ప్రేమగా
ప్రియా.. అని పిలిచి నట్టు గుర్తు
మళ్లీ ఇన్నాళ్ళకి నీ మీద
అవ్యాజ్యమైన ప్రేమ పుట్టుకొస్తుంది
కానీ ఏమి చేయను
నీ ప్రేమ బలం తో నేను
ఎక్కడైనా ఎలాగైనా బతికేస్తాను
నిన్ను కాపాడుకోవటానికే
ఇప్పుడు ఇలా నిన్ను విడిచి వెళుతున్నా
నా తల్లి పల్లె ను కలిసి తిరిగొస్తా
ఏ కష్టానికైనా నా తల్లి దగ్గర
అద్భుతమైన తాయెత్తులు వుండేవి
ఒక్క ఆకలికి తప్ప
నన్ను అలాగే నిన్ను చేరేలా పెంచింది
అందుకేనేమో నీ ప్రేమ మత్తు లో పడ్డాను
నువ్వూ ఒక అద్భుతమైన అల్లాఉద్దీన్ దీపానివే కదా
అద్భుతాల వెంట పడటం
మా పేదరాశి పెద్దమ్మ కథలు కథలు గా నేర్పింది
ఒకసారి నువ్వే చూ పించినట్టు గుర్తు
మున్నాభాయ్ ఎం బి బి ఎస్
తెలుగు లో శంకర్ దాదా ఎం బి బి యెస్
ఎంత హాయిగా నవ్వుకున్నాం అప్పుడు
కానీ దానికి అసలు కాపీ మా అమ్మే తెలుసా!
కడుపులో తలకాయ పెట్టి
నా గుండె లో ఏమి బాధ దాగి ఉందో ఇట్టే చెప్పేది
ఎంత పెద్ద కష్టాన్ని అయినా
చిన్న చిట్కా తో దాని పని పట్టేది
కరోనా ని కూడా
తన కంటిచూపు తోనే చంపెసేదే!
కానీ కరోనా
కంటికి కనిపించకుండా కదా
నిన్ను భయ పెడుతుంది
అమ్మో !
అది నీ లాగే గడుసరి మరి..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)