కోనసీమ..
అది ఆకుపచ్చని పైట
దీన్ని వలచని వాడు చవట
అలాగని
ఎడారి లో అందం లేదని చెప్పలేను
అదొక అద్బుతం అంతే !
కాని
ఈ సీమ ,
అమృతం కురిసిన రాత్రి
ఒక కవి తలపోత.
ఈ కోనలో వెన్నెల అమృతమే మరి!
అనకొండల్లా మెరిసే నీటి కాలవలు
అనంతమైన ఆకాశాన్ని కమ్మేసే
కొబ్బరాకుల అతిశయం
భూ గోళాన్ని పచ్చని చాపలా చుట్టేసే
వరి పొలాల వెర్రి
అక్కడి ప్రజల యాస
'ఆయ్ '
అంతే ఇది గా వెటకారం
నవ్వుల పువ్వులు పూయా ల్సిందే
పగిలిన గుండెలు అతకాల్సిందే
అది మరీ కోనసీమంటే !
ఎప్పుడూ ఉతికి ఆరేసిన కొత్త చీర లాంటి మెరుపు
ఆ ప్రకృతిలో ,ఆ పలుకుల్లో
స్వర్గానికి ఇక ఇంకో మెట్టే లే అని మురిపించే
కాలవ గట్లు
కడలిని చేరుకొనే హడావిడి లో
గోదారి చిట్ట చివరి అడుగు
ఈ కోనసీమ .
అది ఆకుపచ్చని పైట
దీన్ని వలచని వాడు చవట
అలాగని
ఎడారి లో అందం లేదని చెప్పలేను
అదొక అద్బుతం అంతే !
కాని
ఈ సీమ ,
అమృతం కురిసిన రాత్రి
ఒక కవి తలపోత.
ఈ కోనలో వెన్నెల అమృతమే మరి!
అనకొండల్లా మెరిసే నీటి కాలవలు
అనంతమైన ఆకాశాన్ని కమ్మేసే
కొబ్బరాకుల అతిశయం
భూ గోళాన్ని పచ్చని చాపలా చుట్టేసే
వరి పొలాల వెర్రి
అక్కడి ప్రజల యాస
'ఆయ్ '
అంతే ఇది గా వెటకారం
నవ్వుల పువ్వులు పూయా ల్సిందే
పగిలిన గుండెలు అతకాల్సిందే
అది మరీ కోనసీమంటే !
ఎప్పుడూ ఉతికి ఆరేసిన కొత్త చీర లాంటి మెరుపు
ఆ ప్రకృతిలో ,ఆ పలుకుల్లో
స్వర్గానికి ఇక ఇంకో మెట్టే లే అని మురిపించే
కాలవ గట్లు
కడలిని చేరుకొనే హడావిడి లో
గోదారి చిట్ట చివరి అడుగు
ఈ కోనసీమ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి