బుద్దు
నన్నేక్కడో కోల్పోయునట్లు
నీ గుండెల్లో ముఖం దాచుకున్నాను
నీ హృదయం విశాలం
నన్ను పసిపాప ను చేసి
నీ చిటికన వేలుతో నడిపించావు
నడిచినంతమేరా నీ వెలుగులే
నువ్వలా వెనుదిరుగకుండా సాగి పోతూ నే వున్నావు
నేను ఒక ఇంద్రధనస్సు చూస్తూ అలా నిలబడిపోయాను
ఆ తర్వాత నడక తప్ప నాకు ఇంకేమి గుర్తు లేదు .
అదే స్ఫూర్తి
ఈ రోజు నీ మీద దిగులుతో కూడా నడుస్తున్నాను
అయితే నీలా చందమామ కబుర్లు చెబుతూ
అమ్మలా ప్రయాణ బడలిక పోగెట్టే వారేరి ?
ఎప్పటికీ బుద్దు లానే నీ వెంటే నడవాలనే
ఒక ఎడతెగని కల ఒకటి నావెనక వెనకే ....