26, మే 2020, మంగళవారం
కవితే
కవితే
ఈ చీకటి గదిలోనే లోకం
మూసిన తలుపుల్లోనే తన్లాట
మనసు కిటికీ తెరిచి
అనoతమైన ఆకాశాన్ని
ఎప్పుడు చూసినా అబ్బురమే
ఆ అద్బుతాలను తాకి చూడాలనే
మనుసు పడే ఆరాటాన్ని ఆపుకోలేని
పరుగు లో జీవితం ఎన్ని వర్ణాల్ని కలబెట్టిందో !
కలత చెందినా కవితే
కల చెదిరినా కవితే
బ్రతుకు పండినా కవిత్వమే
ఈ చీకటి గదిలోనే లోకం
మూసిన తలుపుల్లోనే తన్లాట
మనసు కిటికీ తెరిచి
అనoతమైన ఆకాశాన్ని
ఎప్పుడు చూసినా అబ్బురమే
ఆ అద్బుతాలను తాకి చూడాలనే
మనుసు పడే ఆరాటాన్ని ఆపుకోలేని
పరుగు లో జీవితం ఎన్ని వర్ణాల్ని కలబెట్టిందో !
కలత చెందినా కవితే
కల చెదిరినా కవితే
బ్రతుకు పండినా కవిత్వమే
25, మే 2020, సోమవారం
ఆకలి
ఆకలి
గంజి మెతుకు పెదవుల్ని విడదీసుకుంటూ
తన సారాన్ని ఒంపుకుని కడుపు నిండా మాట్లాడింది
గంజి మెతుకు పెదవుల్ని విడదీసుకుంటూ
తన సారాన్ని ఒంపుకుని కడుపు నిండా మాట్లాడింది
దూరం
దూరం
ఈ దూరం
నీకైనా ,నాకైనా ఒకటేలే
నేను నీలో వుంటాను
నువ్వు నాలో ..
మనసు గది నీ చుట్టే అల్లుకొని ఉంటుంది
నీ భుజం మీద చెయ్యి వేసి
నీ మనుసులోన ముఖం దాచి
నిన్నే చూస్తాను
ఈ దూరం
నీకైనా ,నాకైనా ఒకటేలే
నేను నీలో వుంటాను
నువ్వు నాలో ..
మనసు గది నీ చుట్టే అల్లుకొని ఉంటుంది
నీ భుజం మీద చెయ్యి వేసి
నీ మనుసులోన ముఖం దాచి
నిన్నే చూస్తాను
ధైర్యం
ధైర్యం
నువ్వు వెళ్ళిపోయినందుకు
పితూరీ ఏమీ లేదు
అలాగే నిలబడి పోవటానికి
నా నీడ కైనా కాస్త ధైర్యం
చెప్పి ఉంటే బాగుండేది
నువ్వు వెళ్ళిపోయినందుకు
పితూరీ ఏమీ లేదు
అలాగే నిలబడి పోవటానికి
నా నీడ కైనా కాస్త ధైర్యం
చెప్పి ఉంటే బాగుండేది
8, మే 2020, శుక్రవారం
భయ్యం
భయ్యం
అద్భుతాల జడి బాల్యం
అబ్బురపడటం ఆలస్యం
భయాలు పీడకలల్లోకి లాక్కెళ్ళేవి
భయం జీవితపు క్రీడ అయిపోయింది
అందరు నన్ను ఆడుకుంటున్నట్టే తోచేది
అలవాటైన ఆటగా భయం
నాలో చోటు చేసుకుంది
అమ్మా దయ్యం.. అంటూ
అమ్మనే ఆట పట్టించేవాడిని
భయాన్ని జయించటానికి
కళ్ళు మూసుకొని ఎందరి దేవుళ్ళని ఆశ్రయించానో
ఎందరి జాతీయ నాయకుల్ని నిలబెట్టుకున్నానో
కాని ఫలితం శూన్యం
ఆ సంఘర్షణ లో
నిస్పృహ లాంటి నా కోట లోకి
పాట ఒకటి వచ్చింది
కొంగు నడుము కు చుట్టవే చెల్లెమ్మా
కొడవళ్లు చేపట్టవే చెల్లెమ్మా..
అమ్మ దుః ఖానికి
అక్క కష్టానికి
పోరాటం ఒక్కటే మార్గమని తోచింది
దొర ఏందిరో వాడి పీకుడేందిరో ..
ఊరు మనదిరా వాడ మనదిరా..
పాటలు ..
నాకు కర్ణ కుండలాలు అయినాయి
కత్తుల కోలాటమే
కలల సాకారానికి
కొండంత ధైర్యాన్ని ఇచ్చింది
ఈ లోగా పగబట్టినట్టుగా ప్రపంచీకరణ
దేశాల్ని ప్రజల్ని వలస కూలీలను చేసింది
ప్రతి ప్రకృతి వనరు
ఒక యుద్ధక్షేత్రమయింది
ప్రతి మనిషి బ్రతుకు
కరోనా భయంతో లాక్ డౌన్ అయింది
భయ్యం ఇప్పుడు అంతర్జాతీయ క్రీడ ..
అద్భుతాల జడి బాల్యం
అబ్బురపడటం ఆలస్యం
భయాలు పీడకలల్లోకి లాక్కెళ్ళేవి
భయం జీవితపు క్రీడ అయిపోయింది
అందరు నన్ను ఆడుకుంటున్నట్టే తోచేది
అలవాటైన ఆటగా భయం
నాలో చోటు చేసుకుంది
అమ్మా దయ్యం.. అంటూ
అమ్మనే ఆట పట్టించేవాడిని
భయాన్ని జయించటానికి
కళ్ళు మూసుకొని ఎందరి దేవుళ్ళని ఆశ్రయించానో
ఎందరి జాతీయ నాయకుల్ని నిలబెట్టుకున్నానో
కాని ఫలితం శూన్యం
ఆ సంఘర్షణ లో
నిస్పృహ లాంటి నా కోట లోకి
పాట ఒకటి వచ్చింది
కొంగు నడుము కు చుట్టవే చెల్లెమ్మా
కొడవళ్లు చేపట్టవే చెల్లెమ్మా..
అమ్మ దుః ఖానికి
అక్క కష్టానికి
పోరాటం ఒక్కటే మార్గమని తోచింది
దొర ఏందిరో వాడి పీకుడేందిరో ..
ఊరు మనదిరా వాడ మనదిరా..
పాటలు ..
నాకు కర్ణ కుండలాలు అయినాయి
కత్తుల కోలాటమే
కలల సాకారానికి
కొండంత ధైర్యాన్ని ఇచ్చింది
ఈ లోగా పగబట్టినట్టుగా ప్రపంచీకరణ
దేశాల్ని ప్రజల్ని వలస కూలీలను చేసింది
ప్రతి ప్రకృతి వనరు
ఒక యుద్ధక్షేత్రమయింది
ప్రతి మనిషి బ్రతుకు
కరోనా భయంతో లాక్ డౌన్ అయింది
భయ్యం ఇప్పుడు అంతర్జాతీయ క్రీడ ..
3, మే 2020, ఆదివారం
నగరం మీద వలసకూలీ ప్రేమగీతం
నగరం మీద వలసకూలీ ప్రేమగీతం
("అమృతం కురిసిన రాత్రి" తిలక్ కి క్షమాపణలతో)
కాలే కడుపే కాదు
తరతరాల మోహం నీపైన
అందుకే నా కండలు
నా గుండెలు నీ పాదాల చెంత పెట్టాను
నువ్వు ఆడుకొనే రైలు బొమ్మలు
చక్రాల కారు బొమ్మలు
మా ఊరి పక్క నుండే వెళ్ళేవి
నువ్వు ఎగరేసే రెక్కల విమానాలు
మా చెరువు ను దాటుకుంటూ వెళ్ళేవి
నీ వింతలు గురుంచి ఎన్ని కథలో
అందుకే మరి ఒక్కసారైనా
నిన్ను దగ్గరగా..
దూరం నుంచి ఐనా చూసి
తరించాలని అనిపించేది
కానీ నీ మాయా లోకం లోకి వచ్చాక
తిరిగి వెళ్లడం నా వల్ల కాలేదు
ఇక నీ సేవ కే ఈ జన్మ అనుకొంటూ
అలా నిలబడిపోయాను
ఇప్పుడు ఈ కరోనా భయం వచ్చి పడింది
ఎన్నో విద్యలొచ్చిన నువ్వే అలా వణికి పోతే
నీ వెనక లోకాలు గెలవాలనుకునే
ఫాగల్ గాన్ని,.. నేనేం అయిపోవాలా
నీ నవ్వు ముఖం చూసుకుంటూ
కడుపు నింపుకునే నేను
కరోనా చావుకళ తో బెదిరిపోయిన
నిన్ను చూసి తట్టుకోలేక పోతున్నాను
అందుకే నిన్ను విడిచి వెళుతున్నా
ప్రియా..
నిన్నిలా పిలిచి కూడా
ఎన్ని రోజులయ్యిందో !
అప్పుడెప్పుడో స్కైలాబ్ పడుతుంది
అందరం చచ్చిపోతాం అంటే
లాస్ట్ సప్పర్ లా నువ్వు ఇచ్చిన విందు లో
చీకట్లో ప్రేమగా
ప్రియా.. అని పిలిచి నట్టు గుర్తు
మళ్లీ ఇన్నాళ్ళకి నీ మీద
అవ్యాజ్యమైన ప్రేమ పుట్టుకొస్తుంది
కానీ ఏమి చేయను
నీ ప్రేమ బలం తో నేను
ఎక్కడైనా ఎలాగైనా బతికేస్తాను
నిన్ను కాపాడుకోవటానికే
ఇప్పుడు ఇలా నిన్ను విడిచి వెళుతున్నా
నా తల్లి పల్లె ను కలిసి తిరిగొస్తా
ఏ కష్టానికైనా నా తల్లి దగ్గర
అద్భుతమైన తాయెత్తులు వుండేవి
ఒక్క ఆకలికి తప్ప
నన్ను అలాగే నిన్ను చేరేలా పెంచింది
అందుకేనేమో నీ ప్రేమ మత్తు లో పడ్డాను
నువ్వూ ఒక అద్భుతమైన అల్లాఉద్దీన్ దీపానివే కదా
అద్భుతాల వెంట పడటం
మా పేదరాశి పెద్దమ్మ కథలు కథలు గా నేర్పింది
ఒకసారి నువ్వే చూ పించినట్టు గుర్తు
మున్నాభాయ్ ఎం బి బి ఎస్
తెలుగు లో శంకర్ దాదా ఎం బి బి యెస్
ఎంత హాయిగా నవ్వుకున్నాం అప్పుడు
కానీ దానికి అసలు కాపీ మా అమ్మే తెలుసా!
కడుపులో తలకాయ పెట్టి
నా గుండె లో ఏమి బాధ దాగి ఉందో ఇట్టే చెప్పేది
ఎంత పెద్ద కష్టాన్ని అయినా
చిన్న చిట్కా తో దాని పని పట్టేది
కరోనా ని కూడా
తన కంటిచూపు తోనే చంపెసేదే!
కానీ కరోనా
కంటికి కనిపించకుండా కదా
నిన్ను భయ పెడుతుంది
అమ్మో !
అది నీ లాగే గడుసరి మరి..
("అమృతం కురిసిన రాత్రి" తిలక్ కి క్షమాపణలతో)
కాలే కడుపే కాదు
తరతరాల మోహం నీపైన
అందుకే నా కండలు
నా గుండెలు నీ పాదాల చెంత పెట్టాను
నువ్వు ఆడుకొనే రైలు బొమ్మలు
చక్రాల కారు బొమ్మలు
మా ఊరి పక్క నుండే వెళ్ళేవి
నువ్వు ఎగరేసే రెక్కల విమానాలు
మా చెరువు ను దాటుకుంటూ వెళ్ళేవి
నీ వింతలు గురుంచి ఎన్ని కథలో
అందుకే మరి ఒక్కసారైనా
నిన్ను దగ్గరగా..
దూరం నుంచి ఐనా చూసి
తరించాలని అనిపించేది
కానీ నీ మాయా లోకం లోకి వచ్చాక
తిరిగి వెళ్లడం నా వల్ల కాలేదు
ఇక నీ సేవ కే ఈ జన్మ అనుకొంటూ
అలా నిలబడిపోయాను
ఇప్పుడు ఈ కరోనా భయం వచ్చి పడింది
ఎన్నో విద్యలొచ్చిన నువ్వే అలా వణికి పోతే
నీ వెనక లోకాలు గెలవాలనుకునే
ఫాగల్ గాన్ని,.. నేనేం అయిపోవాలా
నీ నవ్వు ముఖం చూసుకుంటూ
కడుపు నింపుకునే నేను
కరోనా చావుకళ తో బెదిరిపోయిన
నిన్ను చూసి తట్టుకోలేక పోతున్నాను
అందుకే నిన్ను విడిచి వెళుతున్నా
ప్రియా..
నిన్నిలా పిలిచి కూడా
ఎన్ని రోజులయ్యిందో !
అప్పుడెప్పుడో స్కైలాబ్ పడుతుంది
అందరం చచ్చిపోతాం అంటే
లాస్ట్ సప్పర్ లా నువ్వు ఇచ్చిన విందు లో
చీకట్లో ప్రేమగా
ప్రియా.. అని పిలిచి నట్టు గుర్తు
మళ్లీ ఇన్నాళ్ళకి నీ మీద
అవ్యాజ్యమైన ప్రేమ పుట్టుకొస్తుంది
కానీ ఏమి చేయను
నీ ప్రేమ బలం తో నేను
ఎక్కడైనా ఎలాగైనా బతికేస్తాను
నిన్ను కాపాడుకోవటానికే
ఇప్పుడు ఇలా నిన్ను విడిచి వెళుతున్నా
నా తల్లి పల్లె ను కలిసి తిరిగొస్తా
ఏ కష్టానికైనా నా తల్లి దగ్గర
అద్భుతమైన తాయెత్తులు వుండేవి
ఒక్క ఆకలికి తప్ప
నన్ను అలాగే నిన్ను చేరేలా పెంచింది
అందుకేనేమో నీ ప్రేమ మత్తు లో పడ్డాను
నువ్వూ ఒక అద్భుతమైన అల్లాఉద్దీన్ దీపానివే కదా
అద్భుతాల వెంట పడటం
మా పేదరాశి పెద్దమ్మ కథలు కథలు గా నేర్పింది
ఒకసారి నువ్వే చూ పించినట్టు గుర్తు
మున్నాభాయ్ ఎం బి బి ఎస్
తెలుగు లో శంకర్ దాదా ఎం బి బి యెస్
ఎంత హాయిగా నవ్వుకున్నాం అప్పుడు
కానీ దానికి అసలు కాపీ మా అమ్మే తెలుసా!
కడుపులో తలకాయ పెట్టి
నా గుండె లో ఏమి బాధ దాగి ఉందో ఇట్టే చెప్పేది
ఎంత పెద్ద కష్టాన్ని అయినా
చిన్న చిట్కా తో దాని పని పట్టేది
కరోనా ని కూడా
తన కంటిచూపు తోనే చంపెసేదే!
కానీ కరోనా
కంటికి కనిపించకుండా కదా
నిన్ను భయ పెడుతుంది
అమ్మో !
అది నీ లాగే గడుసరి మరి..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)