కాలం మనతో కలిసి రావాలి
నేనేమి కావాలని కాలాన్ని
బలవంతంగా ముందుకు తొయ్యను
అదే బిరబిరా నడుచుకుంటూ
నన్ను చూసి చూడనట్టు *అంజాన్ గొట్టి
తోసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం
గట్టిగా దాని చెయ్యి పట్టుకొని
అరిచి మరీ కూర్చో బెట్టేస్తాను
ముఖం మీదే కడిగి పారేస్తాను
ఎందుకు నీకు అంత తొందర
నాకంటే ముందు నీకంటూ ఏముంది?
నిన్ను శిలువలా మోస్తున్న వాడ్ని కదా!
నీదైన అస్తిత్వం నీకేమైనా ఉందా?
ఎందుకంత ఉబలాటం?
నువ్వు కంగారు పడి నన్ను
కంగారు పెట్టడం తప్ప..
కుదురు లేని కాలం
ముదురు బెండకాయ ఎందుకు పనికి రావు
కాలం! ఎప్పుడూ నువ్వు నాకు కలిసి రావాలి..
ఇప్పటికైనా తెలిసిందా.. నాతో కలిసి నడవాలి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి