స్వఛ్ఛ భారత్
గదిలో పేరుకుపోయిన చెత్తనంతా
ఒంటి చేత్తో తొలగించినట్టే..
ప్రతి రోజూ మనలో
పోగయ్యే ఉన్మత్తను
ఒక మూలకు
నెట్టివేయక పోతే
బతుకు చెత్త కుండే !
ఇది మావో సూక్తి ..
తనని గుర్తు చేసుకోకుండా
రోజు గడవని స్థితి
ఎంత ప్రపంచీకరణ
యూస్ అండ్ త్రో చెత్తో !
ఏరి పారవేసే సత్తా లేక
మనిషన్నవాడే
మాయం అయిపోతున్నాడు
అన్నిటికీ ఎక్కడికక్కడ
అంతుకులు బొతుకులు
ఇదన్యాయమని అరిస్తే
వాతలు ..కవాతులు ..