24, మే 2021, సోమవారం

 "నామ్ సే  నఫ్రత్ "

ఆ పేరు వింటేనే చిరాకు ..అని తెలుగు లో సర్ది చెప్పుకోవచ్చు నెమో!

ఆయుర్వేదం ఆనందయ్య కరోనా మందు నేఫథ్యం లో ప్రగతిశీల వ్యక్తుల్లోనూ డ్రైనేజీ లా పొంగిపొర్లతున్న అశాస్త్రీయత పెద్ద చర్చకి దారితీసింది . చర్చ మంచిదే కదా!

అయితే ఈ సందర్భంగా నా అనుభవం ఒకటి మీతో పంచుకుంటాను . 

సంవత్సరం  బహుశా 2016 అనుకుంటాను. బాబా రామ్ దేవ్ గారి ఆధ్యాత్మిక ,ఆయుర్వేద సామ్రాజ్యం 

యోగా పేరు మీద పతంజలి పేరుతో దేశం నాలు మూలల విస్తరిస్తున్న కాలం అది . 

ఒక మిత్రుడ్ని కలవటానికి ఛత్తీస్గఢ్ వెళ్లాను . వాళ్ళ కుటుంబం ప్రజా సంఘం లో పని చేస్తుంది . వాళ్ళ అబ్బాయి (20 ఏండ్లు ఉండొచ్చు ) పొద్దున్నే నా దగ్గరికి వచ్చి ,అంకుల్ బ్రష్ చేసుకోండి అన్నాడు . అయ్యో పేస్ట్ మర్చి పోయాను అన్నాను . ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాడే sensodyne  పేస్ట్ ని చేతిలో పట్టుకొని ,మీరు పతంజలి దంతకాంతి  వాడుతారేమో కదా .. చిన్నగా నవ్వుతూ  అన్నాడు.

ఆయుర్వేదం అనంగానే ఇక అదేదో ప్రకృతి సహజం అనుకుంటూ వేలంవెర్రిగా దాని వెనకాల పరుగెడుతున్న 'మధ్యతరగతి మందబుద్ధిని' నాలో కనిపెట్టాడేమోనని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. 

  కాస్త ఉక్రోషం తో ఒక్క మాట కక్కేసాను 

నామ్ సే  నఫ్రత్ .. 

పతంజలి .. నేను అస్సలు వాడను అని చెప్పాను 


 

22, మే 2021, శనివారం

దుఃఖం

దుఃఖం  

 కండ్లు రెండు నిండుగా ఉండగా 

ఓ కంట కన్నీటి  ఖర్చుకేల చింత  ?


నా కంటి తడే  కదా నిన్ను తాకేది 

కంగారు ఏమీ లేదు 

కోపం తాలూకు వేడి అంతా 

మళ్ళీ నాలోకే  కుదురు కుంటుంది 

 

అవును .. నా అక్షరాలు 

 వరద  కాల్వల్లో  కాగితం పడవలై 

కవిత్వం వాసన వేస్తాయి 

 



4, మే 2021, మంగళవారం

 నేను..  అనే అనాది అన్వేషణకు 

ఏదైనా సాధన మార్గం దొరికేనో ..  లేదో 

ఒక ప్రయత్నం అసంకల్పితంగా 

జర జరా జరిగిపోతూ ఉంటుంది 

అయినా సరే ,

నాకేమి తెలియకుండానే ఈ  దారి 

ఎదో నడిచిపోని 

అలిసిపోయిన వేళా 

నీ ఒడిలో నిదురపోని 

ఏమో !నాకేమీ తేటతెల్లం కాకనే 

నీ కంటి వెలుగులోకి 

తొంగి చూస్తాను 

గాఢాంధకారం లో ఓ రేఖ 

నీ చంద్రహాసం 

నాతో వెలుగు నీడల ఆటలాడుకుంటూ 

నన్నుచీకటి లా  అల్లుకుంటూ అల్లుకుంటూ

 పడిలేచే కెరటాలలా కదలాడుతూ 

ఒక సముద్రం నన్ను తట్టి లేపుతూ .. 

*

ఒక ప్రశ్నకు సమాధానం దొరకదు 

రెండో ప్రశ్న తయారు .. 

నువ్వెక్కడ కలిశావు ?

ఆ సంధ్య ఎప్పుడు అంతే !

నా కళ్ళు రెండు మూసి 

తాను ఒక్కతే  గుండెల నిండుగా 

నవ్వుకుంటుంది 

సముద్రపు అంచుల్లో 

నువ్వెక్కడ నడిచావు 

అలలే నా అడుగులయితే ..