కాలాంతకురాలు
బహు దూరం..
నీ దగ్గరున్నంతగా
ఈ దూరం లో
ఎప్పటికి.. ఆ హాయి ఉండే వీలే లేదు
కాని
కాలం ఉంది చూసావు !
అచ్చం గా నీ లానే
మౌనం గానే
మరణ మృదంగాన్ని మోగిస్తుంది
కాలం ..
నీ కంటిచూపుల ముల్లులతో
చేసే గాయాలకు
ప్రతి క్షణం విలవిలలాడుతుంది
నీ సమక్షంలో కాలం తెలిసేది కాదు
ఇప్పుడు ఆ కాలమే
కాలనాగై
కాటేస్తున్న విషపు కోరల్లో ..
ఎంత దూరభారాన్నైనా
అధిగ మించగలిగాను
కాని
ఈ కాలాంతకు రాలితో
ఎలా వేగేదో !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి