సమస్య అనేది ఓ సమస్య గా మొదలయినా కొన్ని సార్లు అది తన స్వరూపం
మార్చుకుంటూ ఉంటుంది. నిన్నటి సమస్య తీరింది అనుకుంటే అది కొత్తసమస్యని
తెచ్చిపెట్టవచ్చు. అది మొదటిదానికంటే బలమైనది ఉండవచ్చు. తీరిపోయిందిలే
అనుకున్న సమస్య మరో రూపంలో ఎదురుపడవచ్చు. అన్నీ మన అంచనాలకీ..ఆక్షన్స్ కీ
అందకుండా ఉంటాయి. ఎందుకంటే..మనమే కాదు సమస్యకి అవతలి వైపు కూడా
మనుషులున్నప్పుడు ఆ ఉమ్మడి సమస్యకి ఇరువైపులా ఉండే ఆక్షన్ ..రియాక్షన్ ల
వలన ఈ సమస్య చావదు.. అన్నింటినీ మించి టైం ఒకటుంది..దాన్నిమించి మన
వ్యక్తిత్వం అనేది ఒకటుంటుంది కదా వీటివల్లే సమస్య సమసిపోక కొత్తసమస్యలు
తెస్తుంది.
31, డిసెంబర్ 2013, మంగళవారం
30, డిసెంబర్ 2013, సోమవారం
'కల' తల
అలసిపోయిన సముద్రం
ఆఖరి అడుగు ... తీరం
ఎరుక తెలిసిన జీవితం
మొదటిమెట్టు ... ప్రేమ
'అల 'జడులతో వేగలేక
తీరంకేసి తల బాదుకుంటుంది .. సముద్రం
'కల'తల తో దిక్కు తోచక
ప్రేమ కేసి ఆశ గా చూస్తుంది ... జీవితం
28, డిసెంబర్ 2013, శనివారం
తెలంగాణా దే తెలుగు
తెలంగాణా దే తెలుగు
తెలుగు భాష అంటే త్రిలింగ దేశంలో అంటే ప్రస్తుత తెలంగాణా లో మాట్లాడే భాష అనీ ,ఆంధ్ర బాష అంటే కోస్తా జిల్లాల్లో మాట్లాడే భాష అనీ ,కోస్తా లో ఆంధ్ర భాష మాట్లాడే వాళ్ళు ఆంధ్రులని ,తెలంగాణా లోతెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగు వాళ్ళు అని ఒక అవగాహన కూడా ఉంది .
-ముదునూరు భారతి ( "అభివృద్దిని ఇలా చూద్దాం " )
24, డిసెంబర్ 2013, మంగళవారం
22, డిసెంబర్ 2013, ఆదివారం
17, డిసెంబర్ 2013, మంగళవారం
' ది గ్రేట్ వాల్ ఆఫ్ లవ్ '
' ది గ్రేట్ వాల్ ఆఫ్ లవ్ '
ఎన్నో వేదనా తీరాలను తట్టుకున్న నావకి
ఈ జీవన సముద్రంలో
నిరంతరం అలుపెరగని ప్రయాణమే తెరచాప
అలల సయ్యాటలో ఇంకా ఆద మరిచే ఎన్ని కలలో !
గోడలే లేని ఈ ప్రవాహ ప్రపంచంలో
నీ తలపు.. ' ది గ్రేట్ వాల్ ఆఫ్ లవ్ '
అది మంచు శిఖరమై
కరిగి పోకముందే
నీ ప్రేమలో సేద తీరాలని ఉంది నేస్తం ..
14, డిసెంబర్ 2013, శనివారం
బాధ రాచపుండు
బాధ రాచపుండు
బాధను చూడకుబాధను వినకు
బాధ ను మాట్లాడకు
అయినా
మనసు లో బాధ
వాన ముసురు
విసిగి ,విసిగి వేసారిన
బాధ..
పడే బాధని
మనసు ఒక్కటే
దిగమింగుకోలేదు
అప్పుడే
బాధే సౌఖ్య మనే
భావన రానీవోయు ..
అయినా
గాయపడ్డ మనసు
పచ్చి పుండు
ఊపిరి సలపని బాధల్లో
మానని గాయం
రాచపుండు (గ్యాగ్రీన్ )
మనసును
సమూలంగా పెకిలిస్తే మాత్రం
బాధ మూలం పోతుందా ?!
కాలాంతకురాలు
కాలాంతకురాలు
బహు దూరం..
నీ దగ్గరున్నంతగా
ఈ దూరం లో
ఎప్పటికి.. ఆ హాయి ఉండే వీలే లేదు
కాని
కాలం ఉంది చూసావు !
అచ్చం గా నీ లానే
మౌనం గానే
మరణ మృదంగాన్ని మోగిస్తుంది
కాలం ..
నీ కంటిచూపుల ముల్లులతో
చేసే గాయాలకు
ప్రతి క్షణం విలవిలలాడుతుంది
నీ సమక్షంలో కాలం తెలిసేది కాదు
ఇప్పుడు ఆ కాలమే
కాలనాగై
కాటేస్తున్న విషపు కోరల్లో ..
ఎంత దూరభారాన్నైనా
అధిగ మించగలిగాను
కాని
ఈ కాలాంతకు రాలితో
ఎలా వేగేదో !
12, డిసెంబర్ 2013, గురువారం
సౌoదర్య భావన
ఒక అనతమైన సౌoదర్య భావనను కల్పనలో దర్శించటమే ఒక విలక్షణమైన అనుభవం ..
To see a world in a Grain of Sand,And a Heaven in a Wild Flower,Hold Infinity in the palm of your hand,And eternity in an hour.William Blake
నువ్వొక స్త్రీతో ప్రేమలో పడితే
అంతు చూసే మనిషి ఆమె కాదు ,నువ్వే కావాలి .
-మొహమ్మద్ దర్వేష్
ఈ మధ్యనే ఎవరో మిత్రుడు అడిగాడు పేస్ బుక్ లో ,కొత్త పుస్తకం ఏమైనా చదివావా అని . టక్కున సమాధానం చెప్పలేకపోయా . ఎందుకిలా అయుంది అని ఆలోచిస్తే ,ఒక చిలిపి ఐడియా వచ్చింది . పేస్ బుక్కే చదవటానికి టైం చాలట్లేదని చెప్పాల్సింది కదా !
10, డిసెంబర్ 2013, మంగళవారం
దిల్ దరియా
దిల్ దరియా..
మనసు లోతుల్ని కొలవాలనే
విశ్వప్రయత్నం ..
విశ్వప్రయత్నం ..
ఎన్ని చెలియలికట్టల్ని దాటి వచ్చిందో ఈ మనసు ..
నాగరికతలకే తన పేరు అరువిచ్చిన
ఎన్ని నదీమ తల్లుల ఉసురు తలపోసుకుందో ..
లోకం చుట్టిన వీరులేందరినో వీపున మోసిన
సప్త సముద్రాల స్నేహ బంధమేమో ..
ఎన్ని గల గలల తీరాల్ని
తన మెడ చుట్టూ హారాలుగా పెనవేసుకుందో ..
ఇంకా..
ముసురు వానకి .. కొసరు అడిగే
ఈ పిచ్చి మనసు కన్నీటి సాక్షిగా .
వెన్నెల్లో నింగిని ముద్దాడే సముద్రం సవ్వడి విన్నారా ?
..
మనసు లోతుల్ని కొలవాలనే విఫల ప్రయత్నం..
మార్నింగ్ వాక్
మార్నింగ్ వాక్
ఉదయాన్ని అచ్చంగా
ముద్దేట్టుకోవాలనే
బయలుదేరినట్లు
చాలా శుభ్రంగా బయట పడతాను .
అది నా ఊరు కాని ఊరు
మనకెవరు తెలీదు
తిని కూర్చుంటే ఉన్న కాస్త ఆరోగ్యం
సంక నాకిపోతుందని ఈ మార్నింగ్ వాక్ మరి !
ఎ మాటకి ఆమాటే చెప్పుకోవాలి
ఈ వాక్ అంటే నాకు మిలటరీ యే గుర్తుకొస్తుంది .
అందుకే ఆ ఫోబియా ని వదిలిన్చుకోనేందుకు
మొదట్లోనే టీ కొట్టు దగ్గర నిలబడిపోతాను
ఒక వితౌట్ షుగర్ టీ చెప్పేస్తాను
మీకు తెలియక పోవచ్చు గానీ ..
అలా ప్రత్యేకం టీ చేయున్చుకోవడం లో
వుండే ఆనందం చాలా ప్రత్యేకం సుమీ !
చలికాలంలో మన ఇంజిన్ వేడి కోసం
వేడివేడి టీ ని మించింది ఏముంటుంది చెప్పండి మీరే !
ఈ టీ పేరు మీద మిలటరీ జీవిత కాలంలో
ఒక పావు గంట ఆట విడుపు
గత వారం గా అలవాటైన
టీ బంకు అన్నయ్య
మనల్ని అల్లంత దూరంలోనే గుర్తు పట్టి
గిన్నెలో ఫ్రెష్ గా ఓ చిన్ని గ్లాసెడు పాలు పోసేస్తాడు
మన నెత్తి మీదే కుండెడు పాలు గుమ్మరించిన
ఆనందం మనకు ఫ్రీ
అలా మనకోసమే షుగర్ లేకుండా టీ పెట్టీ
తనకు తెలియకుండానే మన ఆరోగ్యం లో పాలుపంచుకుంటాడు
అరవింద్ కేజ్రివాల్ గురుంచి అతను కంగారు పడతాడు
ఫక్కా ఆమ్ ఆద్మీ లా
మళ్ళీ ఎలక్షన్ అంటే ఖర్చే కదా అని
తన గల్లా పెట్టె ను జాలిగా చూస్తాడు
టీ ప్రత్యేకంగా పెట్టినా అదే రేట్
అతని మానవత్వానికి మనుసులోనే ముచ్చట పడి
ప్రధాని అభ్యర్థి గా ఇతన్ని ఎందుకు నిలబెట్ట కూడదోననిపించి
నాలో నేనే నవ్వుకుంటూ నడకలోకి ప్రవహిస్తాను
పడవ లాగ రోడ్డు నన్ను తనలోకి లాక్కుంటుంది
మంచు తెరచాపల్ని తొలగించుకుంటూ సూర్యకిరణాలు
నా వంటి మీదే వాలిపోతాయి ,వల్ల మాలిన ప్రేమ తో
గీతాంజలి సినిమాలో నాగార్జున లా వెలుగు కౌగిలి లో బందీ అవుతాను...
రోజూ ఉదయం ఇదే కథ ..
ఇంకేముంటుంది ?
కథ కంచి కి
మనమింటికీ ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)