మదర్స్ డే
ఈ మతలబ్ కీ దునియాలో అమ్మే కదా
కష్టం లో కడుపులో కదిలేది
కన్నుల్లో కన్నీరై మెరిసేది
అమ్మ కూడా
ఈ ప్రపంచం తోనే పోరాడి
గెలిచింది
ఎంతో వేదనని
పంటి కింద తొక్కిపెట్టింది
అమ్మ ఎంతగా
బాధ ని దిగమింగేదో!
అమ్మ దేనికోసం ఆరాట పడింది ?
తనొక తల్లిగా ..
నే నొక పసిబిడ్డగా గుర్తింపు కోసమే ...
అయినా అమ్మ
భిన్నమైన ది ఏమి కాదు
కాని నాకోసం ప్రత్యేకం
నిర్మలమైన మనుసుతో నా కోసం ఒక ప్రపంచాన్ని నిలిపేది
నాకు ఊహ తెలిసి
అమ్మ ప్రపంచం లోంచి బయటికి వచ్చి
నాకు తెలిసిన ప్రపంచాన్ని
నా విజయాల్ని
అమ్మకి చూపించాలని
పరిచయం చెయ్యాలని
తాపత్రయ పడేవాడిని
కాని
అనారోగ్యం ,అలసట అమ్మని ఓ మూలకి విసిరేసాయి
ఇక్కడ ఎ అమ్మ సుఖ పడిందని ..
ఆ మాట కొస్తే ఏ మనిషి ...
అందుకేనేమో ఇప్పటికి
చల్లగాలి వీచినా ,వాన చినుకు తగిలినా
అమ్మే గుర్తొస్తుంది
అమ్మ తో కలిసి పంచుకున్న ఆనందాలే వేరు కదా !
అమ్మా ... నీకొక రోజు కాదమ్మా ...
ఈ జీవితమే నీది ... నా ప్రపంచమే నీది .
ఈ మతలబ్ కీ దునియాలో అమ్మే కదా
కష్టం లో కడుపులో కదిలేది
కన్నుల్లో కన్నీరై మెరిసేది
అమ్మ కూడా
ఈ ప్రపంచం తోనే పోరాడి
గెలిచింది
ఎంతో వేదనని
పంటి కింద తొక్కిపెట్టింది
అమ్మ ఎంతగా
బాధ ని దిగమింగేదో!
అమ్మ దేనికోసం ఆరాట పడింది ?
తనొక తల్లిగా ..
నే నొక పసిబిడ్డగా గుర్తింపు కోసమే ...
అయినా అమ్మ
భిన్నమైన ది ఏమి కాదు
కాని నాకోసం ప్రత్యేకం
నిర్మలమైన మనుసుతో నా కోసం ఒక ప్రపంచాన్ని నిలిపేది
నాకు ఊహ తెలిసి
అమ్మ ప్రపంచం లోంచి బయటికి వచ్చి
నాకు తెలిసిన ప్రపంచాన్ని
నా విజయాల్ని
అమ్మకి చూపించాలని
పరిచయం చెయ్యాలని
తాపత్రయ పడేవాడిని
కాని
అనారోగ్యం ,అలసట అమ్మని ఓ మూలకి విసిరేసాయి
ఇక్కడ ఎ అమ్మ సుఖ పడిందని ..
ఆ మాట కొస్తే ఏ మనిషి ...
అందుకేనేమో ఇప్పటికి
చల్లగాలి వీచినా ,వాన చినుకు తగిలినా
అమ్మే గుర్తొస్తుంది
అమ్మ తో కలిసి పంచుకున్న ఆనందాలే వేరు కదా !
అమ్మా ... నీకొక రోజు కాదమ్మా ...
ఈ జీవితమే నీది ... నా ప్రపంచమే నీది .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి