1, ఏప్రిల్ 2016, శుక్రవారం

అవును .. ఆమె

అవును .. ఆమె 
ఇప్పటికీ
ఇంకా
కలగానే ఉంటుంది
నిజంగా
ఏమీ   కాని
ఈ జీవితం లో
ఆ  ఊహే
ఒక బలము అవుతుంది


దాని నడకే
నా బ్రతుకు అవుతుంది

చీకటి వేళ
ఆ ఊహే
నా మనుసుని చిధ్రం  చేస్తుంది
అయినా
చీకటి నన్నేమి భయ పెట్టదు




తన్లాట

తన్లాట 
ఏ "ఎమోషన్" అయినా
ఒక నిముష కాలమైనా
పోరాటం లేకుండా
అనుభవం లోకి రాదు


అనుకరణ

అనుకరణ
బహుశా ఈ రాత
ఇక్కడే ఆగిపోవచ్చు
ఈ వెలుగు
చీకటి రూపు దాల్చవచ్చు
అవునూ ... ఇక్కడే
మనం
ఒక్కరమే
 ఒంటరిగా
సమరమై  ..సముద్రమై ..
ఆకాశమై ..
విచ్చుకున్న పక్షి రెక్కలమై

ఎదో అలజడి ..
ఏదో ఆత్మానందం ..

ఎవరు నేర్పారు ఈ మాటలు
ఏవో అనుకరణలు
ఏవో భయాలు
ఏవో బంధాలు
ఏదో బాధ ...

నలిగిన దారే
ఇంతవింతగా వుంటే...
ఇంకా కొత్త పుంతలా ..?

అవును .. అది నా లోకం ..
నీ లోకం

అమ్మ లోకం
గోర్కీ అమ్మ లోకి
పరకాయ ప్రవేశం ..





ప్రేమచ్చాయ

 ప్రేమచ్చాయ
ఇంతకు మునుపులా కొత్త గా భయం ఏదీ లేదు
ఎప్పటి నుంచో నాలో భావాలు
వటవృక్ష మై ...
ఊడలు దిగిన ప్రశ్నలు
సమాధానం ఏమీ లేదని కాదు
సంతృప్తి  లేని డొల్లతనం
అయినా .. మళ్ళీ
ఆలోచనలు కొత్త గా
మెల్ల మెల్లగా
నా  వేపే  గురి పెట్టబడ్డ ప్రశ్న

నా  లోంచి విడివడి నన్నే అల్లుకుంటూ
నన్నే మై మరిపిస్తూ నా ప్రేమచ్చాయ .. 

నడక

నడక 

నేల మీద నడిచిన అడుగులకి అంటిన మట్టి
ఏదో గుసగుసలు పోయేది
అర్థం తెలిసేది  కాదు

తడి తడి నడక
ఆరిపోకముందే
 వడివడిగా సాగిపోవాలి .
అంతే ... అంతేనెమో !