మిత్రుడా
నడుస్తూ నడుస్తూ
ఆకాశాన్ని చుట్టబెట్టే వాళ్ళం
కాలం తెలిసేది కాదు
చీకటి నీ కంటి పాప లో
పసిపాప లా నిదురపోయేది
చుక్కల వెలుగుల్లో
కవిత్వం
వెన్నల చాపలు పరిచేది
ఒన్ బై టు చాయ్ లా
సగం సగం పూర్తిగా నిండిపోయేవాడివి
వీడ్కోలు కన్నీటి తడి
ఆరక మునుపే
నువ్వే నాలో కవిత గా రూపు కట్టేవాడివి
వెలుగు.. వెన్నెలనే కాదు
చిమ్మ చీకట్లను
నీ కొంటె నవ్వు తో ముట్టించిన వాడా
విప్లవం వర్దిల్లాలి!
విప్లవం వర్దిల్లాలి!
నినాదాల హోరు లో
నువ్వేరా
నీ నవ్వే రా ..