14, ఆగస్టు 2014, గురువారం

వందే మాతరం
 ఓ నా ప్రియమైన మాతృదేశమాCherabanda raju.jpg
 తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
 దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది 
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టుపెట్టిన అందం నీది
 సంపన్నుల చేతుల్లో మైమరిచి నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తిపోసినా చలనంలేని మైకం నీది
 కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న 'భారతి' వమ్మా
 నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
 వందే మాతరం వందే మాతరం
ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి వివస్త్రవై ఊరేగుతున్న దైన్యం నీది
 అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
 ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని ఓదార్చలేని శోకం నీది 
ఆకలికి ఎండి ఎండి ఎరువు సొమ్ములతో వీధినబడ్డ సింగారం నీది
 అమ్మా భారతీ
 నీ గమ్యం ఏమిటి తల్లీ 
వందే మాతరం వందే మాతరం

-చెరబండరాజు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి