14, జులై 2012, శనివారం

 విరక్తి ?

నీ గతమంతా   మంచు శికరాలై
కరిగిపోతుంటే ,
వర్తమానం తలవంచుకొని వెళ్లిపోతుంటే
భవిష్యతు  గురుంచి ఇంకా గొప్పగా
 ఏమి ఆలోచనలు మిగులుతాయి
వెలుగు చీకట్ల మధ్య రేఖ లాంటి జీవితమంతా  తెల్లారిపోతుంటే !


 

9, జులై 2012, సోమవారం

మథనము 

తన గురుంచి ఆలోచన తరగదు
తన ప్రేమ జ్యాపకాల తడి ఆరదు
తన మీద షికాయత్ మెల్లమెల్లగా మెత్తబడుతుంది
మళ్లీ  మమకారం మొగ్గలు వేస్తుంది
తాను ఎదురైతే  ఎద లో రగిలే ఊహల
 కెవరు సంకెళ్ళు వేస్తారు ?
తన కన్నీటి బాష్పాల వేడి ని
తట్టుకునే  ఉక్కు గుండె నీకుందా ?