వసుదేంద్ర *తేజో తుంగభద్ర
ఈ నవలలో కథానాయిక బెల్లా .. పోర్చుగల్ లో ని తేజో నదీ తీరం లో మనతో ప్రేమలో పడుతుంది .
బెల్లాకి అతడ్ని ఎలా ఓదార్చాలో తోచలేదు .
"మాటలు విఫలమైనప్పుడు మౌనమే మన శక్తి కావాలి "
మృదువుగా తన రెండు అర చేతులను రుద్ది అతని కళ్ళ మీద పెట్టింది . గేబ్రియల్ (హీరో )దీర్ఘంగా ఊపిరి పీల్చాడు . తర్వాత అతని రెండు చేతులను తానే తీసుకొని , వాటిని రుద్ది తన కళ్ళకు ఒత్తుకుంది . అతని ఆ అరచేతుల వెచ్చదనం లో జగత్తులోని సమస్త ప్రశ్నలకు జవాబులు ఉన్నాయనిపించింది ..
ఇవి.. పుస్తకం లోని వాక్యాలే .
ఇదే రచయిత చేసిన మేజిక్ .
బెల్లా తండ్రి మాట కోసం మనమూ భారత్ కు సముద్ర ప్రయాణం చేస్తాం .
తుంగభద్రా నదీ తీరం లో సతీ సహగమనం దాకా వెళ్లిన హంపక్క జీవితం తో కలిసి నడుస్తాం .
మనిషి బ్రతుకు లో అధికారం తో అంట కాగే మతం ,ఆర్థికం రేపే ' చిచ్చు' ని అద్భుతంగా చరిత్రలో భాగంగా చెప్పగలగడం ఈ నవల ప్రత్యేకత .