జీవిత భయం
ని న్ను భయపెట్టగలిగేది ఏది నీ అన్వేషణలో ..
శ్రీ శ్రీ అంటాడు .. బహుళ పంచమి జోత్స్నా భయపెట్టు నన్ను ,,అని
కానీ అంత కంటే మిన్నగా మనల్ని గందరగోళ పరిచేది ఇంకేముంది అంటే ..
అది మన వెంటే నడిచివచ్చిన మన జీవితమే ..
ఉరకలు వేసిన ఉత్సాహం
ఊరకే అలా కూలబడిపోయినప్పుడు
వరదలా మనల్ని ముంచెత్తుతుంది
ఉలిక్కిపడి కళ్ళు కన్నీటి పర్యంతం అవు తాయి
ఒక్క ధైర్య వచనం కోసం దిక్కులు పిక్కటిల్లేలా
అరిచి ఘీ పెడతాం
మన నిస్సహాయతే నిసిగ్గుగా ప్రతిధ్వనిస్తుంది
గుండె దిటవు నిచ్చే నిలువెత్తు కొండ సాయం అది
అయినా నాలాంటి నీ కోసం ఎదురు చూపే కడదాకా ..