అల మాటున ..
కోరికల కొక్కానికి
జీవితాన్నెప్పుడూ
అలా వేలాడ దీసింది లేదు
వీస్తున్న గాలికి
తలుపులు మూసిందీ లేదు
లేదు.. లేదు అంటూనే ..
తోసుకొచ్చేసిన కలల అల జడి
తనివి తీరని వలపు తీరం
ప్రతి ఇసుక రేణువు
మూగపోయిన హృదయ వేణువు
యుద్దాల పాద ముద్రల పై
రాటుదేలే కాలం హోరు
గెలుపోటముల లెక్క తేలదు ఎప్పటికీ ..
తడియారని సముద్ర సౌందర్యం
తల నిమిరే దూరం ఒక్క అడుగే ..
తీరం మెడ మీద కడలి కి
చివరి మజిలీ .. అల
ఒక కల్లోలం ..
తీరని కోరిక -ఒక కల
అదీ .. అల్లకల్లోలం ..
అల విసురు గాలికి
ఊగిసలాట అలవాటు
కడలి మనసుకి ..
కన్నీటి సుఖాని కీ ..
------------------------------
22.01. 2021