నువ్వు నేను
నన్ను మనిషే అంటావు
అయ్యో ఏదైనా కష్టమొస్తే
నన్ను మనిషే అంటావు
అయ్యో ఏదైనా కష్టమొస్తే
కానీ నాకే.. ఎప్పుడూ ఒక సందేహం
పుట్టక లో నీతో సమానం కాదు
నీ తెలివి లోను ,నీ అభివృద్ధి లోను
నేను మట్టి బుర్ర నే
నా చావూ నాదే .. నా ఖర్మే !
నువ్వు చావు ఊబి లో కూరుకుపోయి కూడా
నా మీదే అరుస్తావు
నేనెప్పుడూ
నీలా మాటలు మార్చే మనిషి ని కాను
నీలా మాటలు మార్చే మనిషి ని కాను
నా మీద అరుస్తూనే ,కరుస్తూనో
కర్రతో చావ బాదుతోనో
చివరికి
కనిపిస్తే కాల్చివేతతోనో తప్ప
మనుగడ లేని బక్క పల్చని మూగ మనిషిని నేను !
నువ్వే ..అవును నువ్వే
నీలా .. కరుణ లేని కరోనా లకి
ప్రాణం పొసే మనిషివి నువ్వు
నీ అనేకానేక అరాచకాల వైరస్ లకు
బలయ్యే మొదటి మనిషిని నేనే !