గాలికి వల వేస్తూ
(మిత్రుడు మాదాసి రామ మూర్తి కి ప్రేమ తో )
ఏమో ..ఏదేదో రాసేయాలని
దేన్నో భద్రంగా నిక్షిప్తం చెయ్యాలని
ఏమో .. ఏమేమో కలలాగా అనిపిస్తే
హమ్మయ్య
ఎదో గుండె గొంతుక తన్లాడితే
కాలాన్ని మీటుతూ
ఒక అడుగు ముందుకే వేస్తూ
కనిపించని ఈ గాలిలో దేన్నో
ప్రతి క్షణం తడుముతూ వుంటాను
నన్ను నేను సాక్షాత్కారం చేసుకోవాలని ఉంటుందేమో !
ఒక తల్లి బాహువుల్లో ఒదిగిపోవాలని ఉంటుంది ..
ఒక నదీ తీరాన కూలబడిపోయి ఒక కునుకు తీయాలని ఉంటుంది
అయితే
ఒక అర్థం కాని తనం ఎప్పుడూ ఉంటుంది
ఎదో వెదుకులాట ఇప్పుడూ ఉంది
కొన్ని సార్లు ఆనందం అశ్రువులై పొంగి పొర్లుతుంది
కొన్నిసార్లు దుఃఖం కాలాన్ని ఘనీభవింప చేస్తుంది
అవును ..
రాలిపోయే ఆకునే . .
శిధిలమయ్యే జ్ఞాపకాన్నే ..