9, జనవరి 2013, బుధవారం



బాధ 
వాన వస్తుంది
వెలిసిపోతుంది
ఆ విషయం  తెలిసిపోతుంది

బాధ అలా కాదు
బరువెక్కిన గుండె
తేలిపోతుంది మత్తులో
ఏదో గమ్మతులో ...
 మౌనం 

మౌనం బలహీనతే అనుకున్నాను
కానీ అది బలవంతమైనది
గుండెను రాయిని చేస్తుంది .
గురిని మరింతగా నిశితం చేస్తుంది .