31, డిసెంబర్ 2011, శనివారం

పిచ్చి

 పిచ్చి 


ఏమిటి  కవిత్వం   గోల
ఈ వేళ  ?
                                                                   
మనసు,
 తన మాటే
తను వినకపోవడం.


  




5, ఫిబ్రవరి 2011, శనివారం

నీ యాది




ఇంతటి విశ్రాంతి లోను ఏదో అలజడి
మళ్లీ అలాగే
తన ప్రేమ గుర్తుకు రావటం
మళ్లీ మూగనయు పోవటం
ఎలా బయటపడేది
ఎలా బ్రతికి సచ్చేది




1, ఫిబ్రవరి 2011, మంగళవారం

నా బాధ నాదే

నేను ఒక ప్రకృతి ప్రేమికుడిని
నేను ఒక చెట్టు లాగే
లేదా ఈ వెర్రి గాలి లానే
మొద్దు లాగ పని చెయ్యడం
లేదా శికార్ల్ కొట్టడం
ఏటో! లోతయన జీవితం ఏదీ
ఒక అవగాహన కి రాలేదు
వస్తుందన్న ఆశా లేదు 
ఎటు చూసినా కొండా కోనలు
విశాలమైన మైదానాలు
విరబూసిన పువ్వుల్లాగా
పక్షుల గుంపులు
ఏమి అనుభంధమో ఇది
కళ్ళు కాళ్ళు అలా నిలబదిపోతై
నీ ప్రేమ లాగే....















21, జనవరి 2011, శుక్రవారం

నా ప్రశ్న నాకే



నన్ను నేను తెలుసుకోనేలోగానే
నిన్ను మరిచి పోతానేమో
నీ ప్రేమ లోన మునిగినపుడు
ఈ లోకమే లేదుగా
నీవు లేని ప్రపంచం
నా గురుంచి ఏమి చెబుతుంది?