8, డిసెంబర్ 2010, బుధవారం

చలి యాది లో ...
చలిగాడు వచ్చాడు అంటే
నీలి కురులు తో వాన ముసురు

ఎక్కడా నిలబడ నీయదు
అన్నీవెచ్చని కోరికలే

పచ్చని కోయిల పాట
చెట్ల పైన స్నానమాడుతుంది 

నీ వెచ్చని ఊపిరి ఏదో
గాలిపటం లా నా గుండెల ఫై
అడ్డం పడుతుంది

నీ తడి తడి  కనురెప్పల మాటున
తల దాచుకోవాలనే 
ఒక తపన శీతలం గా
తరుముకొస్తుంది

తేనీరు తో సేద తీరే
సగటు మనిషి హృదయం
సముద్రమంత విశాలం అవుతుంది

17, నవంబర్ 2010, బుధవారం

తామరాకు మీద నీటిబొట్టు

తామరాకు మీద నీటిబొట్టు
పాపం లేదు
పాచ్చాత్హాపం  లేదు
ప్రాయచ్చితం లేదు.....

ఐతే నీ మీద ప్రేమ లేదని చెప్పలేను
నీను ప్రేమ లో పడలేదని చెప్పలేను
 కాని తామరాకు మీద నీటిబొట్టు లా
నీ మాయ లో కొట్టుమిట్టాడాను
అంతే నేమో !     

26, అక్టోబర్ 2010, మంగళవారం

నదికి ఆవలి వైపు



మేము నదికి చెరో వైపు జీవిస్తాం
ఆమె పగటిపూట సూరీడు వెలుగులో కూర్చుంటుంది
అదంతా ఆమె చుట్టూ ఒక వలయంలా వుంటుంది
ఆమె పాదాలు గడ్డివలె మెత్తనివి
రాత్రిపూట నేను మైదానంలో ఒత్తిగిలుతాను
చుక్కలు నన్ను వణికిస్తాయి
నా కళ్ళు నిండు చందమామలవుతాయి
కొన్ని రోజులు ఆమె, ఎత్తైన గడ్డి మైదానాల్లో తిరుగాడుతుంది
ఆమె చేతులు బయటకు విస్తరించేవి
ఆమె కురులు గాలికి ఎగిరేవి
ఆమె ఒక చిరు తుఫాను
కొన్ని రోజులు నేను చాలా నిశ్చలంగా నిలబడతాను
ప్రపంచం బద్దలై విచ్చుకుంటుంది
ఆకాశం తన ఒంపుల్ని నా ముందు కదలాడిస్తుంది
ఆకుపచ్చని వర్ణాలన్నీ నాట్యమాడుతాయి
నేను పరవశించి పోతాను
కొన్ని సార్లు నాతో ఆమె మాట్లాడుతున్నట్టు అనిపించేది
ఆ పదాలు నన్ను చేరకముందే నీటిలో జారిపడి
చిన్ననీటి మడుగులుగా సుడులు తిరుగుతాయి
ఎంతో చెప్పాల్సి వుండగా అక్కడ నేను మాట్లాడాలని ప్రయత్నించినపుడు
అదంతా సుదీర్ఘ వాక్యంలో ఇమిడిపోతుంది
కానీ అది గాలిలోనే కొట్టుకుపోతుంది
ఆమె చూస్తున్నట్టుగా తన కనుల్ని ఆకాశం నుండి మెరుగుదిద్దుకుంటుంది
ఆమె ఈత కొడుతూంటే నా పాదాలను నీటిలో వుంచుతాను
నా చేతులు చిన్న కొమ్మల్లా తేలియాడుతాయి
కొన్ని సార్లు ఆమె నా దగ్గరకు వస్తుందని అనుకుంటాను
రాత్రిపూట చంద్రుడు నీటిపై వంతెన ఏర్పాటు చేస్తాడు
కొన్ని సార్లు నేను ఆమె దగ్గరకు వెళదామనుకుంటాను
అప్పుడు రివ్వున వీచే గాలిలో పక్షిలా చేతులు చాచి తీరం ఒడ్డుపై జారగిలపడతాను
మేము నదికి చెరో వైపూ జీవిస్తున్నాం………………..

ఇంగ్లీషు మూలం: GLENN COLQUHOUN
తెలుగు సేత: నక్కా వెంకట్రావ్
ఏప్రిల్ ,2009,ప్రాణహిత లో ప్రచురితము 

19, ఆగస్టు 2010, గురువారం

vaana

 వాన
నీటిజాడ ఎప్పటికి అద్బుతమే
నిగూఢ మైన   మనిషి లాగే!

ఎంత ముద్దో స్తుందో వాన
తడిసి ముద్దై పోఎటంత!
 
కాగితం పడవలా మనసు,
చినుకు పాదాల సందుల్లోంచి 
జారిపోతుంది

ముసురు లాంటి వాన
చాలా ముచ్చట!

మరి ఈ వాన వేళ,

రావా నా గొడుగు లోకి  

వేడి కాఫీ సగం నీది.