9, జులై 2025, బుధవారం

శ్రమజీవి-3


(జులై 2,చెర సంస్మరణ)
శ్రమజీవి అంతర్జాతీయ గీతం
చెరబండరాజు
**************
'ప్రపంచ పురోగతి సాంతం క్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఇమిడివుంది' అని..
ప్రకటించిన చెరబండరాజు ప్రపంచ పురోగమనంలో శ్రమజీవి నిర్వహించిన పాత్రను చారిత్రకంగానూ, శాస్త్రీయంగానూ అర్థం చేసుకున్నాడు. ఎన్నో కవితల్లో పాటల్లో ఆ అవగాహనను ఎలుగెత్తిచాటాడు.
భూగోళం మీద జీవరాశి ఏర్పడినప్పటినుంచి ఆహారాన్వేషణ సాగుతున్నది. ఆహారాన్వేషణలో శ్రమ పాత్రయే మిగిలిన ప్రాణి కోటినుంచి మనుషులకు ఆకృతినిచ్చింది. మనిషి తొలిరూపమయిన గొరిల్లా తన ముందటి కాళ్లను ఆహారాన్వేషణలో ఉపయోగించే నైపుణ్యం పెంచుకున్న క్రమంతో తొలిమానవాకృతి ఏర్పడింది. పనిలో కరచరణాదుల ఉపయోగం, అవయవాల నిర్మాణానికి, ప్రత్యేక పనులకు ఎట్లా పరిణితి చెందిందో అట్లే మనిషి మెదడు అభివృద్ధి చెంది , బుద్ధి వికసించింది. ఊహించే, సృజించే శక్తి వచ్చింది.
చాలామంది భ్రమపడేట్లు బుద్ధి, ఊహాలు శ్రమను నిర్దేశించవు. శ్రమయే బుద్ధి. ఊహ, సృజన శక్తి వికసించడానికి తోడ్పడుతుంది. కనుక ప్రపంచ పురోగమనం అనేది బానిస సమాజం నుంచి పెట్టుబడిదారీ (ఒక స్వప్నం ఫలించి ఒక విశాల భూ ఖండంలో కొన్ని దశాబ్దాల పాటు) సమాజం ఏర్పడే వరకు కూడా శ్రమజీవి నెత్తురు చెమటలో, ఎక్కువ సార్లు నెత్తురే చింది ఏర్పడిన నాగరికతయే సాధించిన అభివృద్ధియే, సహజవనర్లు, భూమి, నీళ్లు, ఖనిజాలు వంటివి ప్రకృతిలో ఉన్నవనరు ఒక గింజ ఎన్నో గింజలకాయగా, ఒక పిడికెడు ధాన్యం-పుట్టెడు ధాన్యంగా పండే రహస్యం-మినహాయిస్తే ఈ వనర్లన్నింటినీ సమకూర్చుకుని ఎన్నోరెట్ల సంపదలను సృష్టించే శక్తి మాత్రం మానవ శ్రమకే ఉంది.
శ్రమజీవి నెత్తుటి బొట్టు ఏమేమి సాధించి ప్రపంచ పురోగమనానికి బాటలు వేసిందో చెరబండరాజు ఎల్లకులాలకు క్రమజీవి అంతర్జాతీయ గీతమనదగిన పాటలో స్పష్టంగా చెప్పాడు.
కొండలు పగలేసినం
బండలను పిండినం
మానెత్తురు కంకరగా
ప్రాజెక్టులు కట్టినం
శ్రమ ఎవడిదిరో
సిరి ఎవడిదిరో
బంజర్లను నరికినం
పొలాలను దున్నినం
మా చెమటలు ఏరులుగా
పంటలు పండించినం
గింజెవడిదిరో
గంజెవడిదిరో
మగ్గాలను పెట్టినం
పోగు పోగు వడికినం
మా నరాలె దారాలుగా
గుడ్డలెన్నో నేసినం
ఉడుకెవడిదిరో
వణుకెవడిదిరో
యంత్రాలను తిప్పినం
ఉత్పత్తులను పెంచినం
మా శక్తే విద్యుత్తుగా
ఫ్యాక్టరీలు నడిపినం
మేడ ఎవడిదిరో
గుడిసెవడిదిరో
కారణాలు తెలుసుకుంటే శ్రమనుంచే సిరి వచ్చిందనీ, నెత్తురే కంకరుగా ప్రాజెక్టులు నిర్మాణమయ్యాయని, చెమటలే ఏరులుగా బంజర్లు పొలాలై పంటలు పండాయని, గంజితాగి, అదికూడ దొరకక పేగులెండిపోగా, కష్టం చేసినవాళ్లే గింజలు పండించారని, శ్రమశక్తియే విద్యుచ్చక్తియని అర్ధమవుతోంది. ఒక్కసారి కారణాలు తెలిసి శ్రమజీవికి ఈ అవగాహన ఏర్పడితే ఆ పనిముట్లే ఆయుధాలవుతాయి. శ్రమజీవులు పరాయికరణ పొందిన తమ శ్రమనేకాదు, శ్రమఫలితాన్ని, అధికారాన్ని కూడా హస్తగతం చేసుకుంటారు. ఆ విశ్వాసాన్ని ఇచ్చే గొప్ప గీతాన్ని చెరబండరాజు ఇచ్చాడు.
శ్రమజీవి గురించి ఇంత శాస్త్రీయమైన అవగాహనతో రాసిన చెరబండరాజు నలగొండ జిల్లా, అంకుశాపురం గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టాడు. తల్లి పదినెలలు మోసి ఎంతో కష్టంతో కన్నబిడ్డ గనుక తండ్రి ఆయనను శెరాబందిరాజుతో పోల్చాడు. బక్కయ్య, బక్కరెడ్డి అని పేరుపెట్టాడు. స్కూల్లో చేర్చేప్పుడు టీచర్ భాస్కరరెడ్డిగా మార్చాడు. అంకుశాపురంలో, ఘటుకేసరులో చదువుకొని, హైదరాబాదులో నల్లకుంట కళాశాలలో తెలుగు ఎంఒఎల్ చేసి 1965లో దిగంబర కవితా ఉద్యమం ప్రారంభించినపుడు ఆయన తండ్రి పోల్చిన పేరుకు దగ్గరగా చెరబండరాజు అని తన కలంపేరు ఎంచుకున్నాడు. ఆశ్చర్యంగా ఆయన 1971 నుంచి 77 దాకా చెరబండరాజు కింగ్ ఆఫ్ ప్రిజన్ స్టోన్( ఈ శీర్షికతో అమెరికానుంచి వెలువడే గార్డియన్ పత్రికలో ఆయన గురించి ఒక పరిచయవ్యాసం1982లోవచ్చింది) గానే రాజీలేకుండా పోరాడిన జగమొండిగా జీవించాడు.
ఈ బక్కయ్యను చిన్నతనంలో తన వెంటపెట్టుకొని తండ్రి పొలం దగ్గరికి తీసుకువెళ్ళేవాడు. మోటకడుతూ..
ఏటికేతంబెత్తి వెయిపుట్లు పండించి
గంజిలో మెతుకెరుగరన్నా..
అని గొంతెత్తి పాడుకునేవాడు. ఆ పసి మనసులో ఆ రైతు జీవితం అట్లా ఒక దృశ్యమైంది. అందుకే కవిగా చెరబండరాజు.. ఈ మట్టి నాకు పట్టెడన్నం పెట్టి పాలు తాపిందని , రాక్షస భూస్వామ్య రంపపు కోతనుంచి ఈ మట్టిరుణం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసాడు.
ఇవ్వాళ మనం విద్యుత్ చార్జీల పెంపుదలతో, ఆ పుదలకు వ్యతిరేకంగా జరిగిన విశాల ప్రజా ఐక్య ఉద్యమంపై దారుణమైన అణచివేతలో చాలా స్పష్టంగా ప్రపంచ బ్యాంకు ఆదేశాలను, సామ్రాజ్యవాద కుట్రను పోల్చుకుంటున్నాం. ఈ  సామ్రాజ్యవాద స్వభావం గురించి చెరబండరాజు 1968లోనే  వందేమాతరమ్' గీతం రాసాడు. ఈ దేశాన్ని పాలిస్తున్న దళారీపాలకులు  మాతృభూమి, తల్లి భారతి అంటూనే అంతర్జాతీయ విపణిలో (ఆమె) అంగాంగం తాకట్టు పెట్టారని..
'ఒంటిమీద గుడ్డలతో జెండాలు కుట్టించి వివస్త్రగా ఊరేగిస్తున్నారని
'అప్పుతెచ్చి వేసినమిద్దెల్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది,
ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని
ఓదార్చలేని శోకం నీది
అమ్మా భారతీ ! నీ గమ్యం ఏమిటి తల్లీ!
అని ప్రశ్నించాడు. ఈ దళారీల పాలనలో ఆమె గమ్యం ఏమిటో స్పష్టమే అయింది. కారణాలు తెలిసిన శ్రమజీవులేం చేయాలో కూడ చెరబండరాజే చెప్పాడు.
తరతరాల దోపిడీని తలవంచక ఎదిరించిన
ప్రాణమెవడు త్రాణఎవడు
అని 'కార్మికుడు' గీతంలో రాసాడు
యీపు మీద బియ్యం సంచి
కడుపేమో ఖాళీ సంచి
అని హమాలీ గురించి
గింజ గింజ లెక్కగట్టి
సేటుగాడు కాటేస్తడు
కిలోల్లెక్క కూలడిగితే
వాడు బతుకు కాజేస్తడు ..
అని కూలీ గురించి పాట రాసాడు.
ఒక్కమాటలో చెప్పాలంటే చెరబండరాజు సాహిత్యమంతా శ్రమజీవి గురించిరాసిందే. శ్రమజీవి నెత్తుటి బొట్టు లొనే ప్రపంచ పురోగమనం ఉందనే అవగాహనతో రాసాడు గనుకనే నెత్తుటి బొట్టును కూడా ప్రజల విముక్తి కోసం ఏళ్లతరబడి జైలు నిర్బంధాన్ని, తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్ అనారోగ్యాన్ని కూడ లెక్కచేయకుండా కవిత్వం,కథలు, నవలలు, నాటికలు రాసాడు.
చెరబండరాజు.. రాజుల సంస్కృతిని కాదని ప్రజల సంస్కృతి గురించి పాడాడు . రాసాడు. ఏది నమ్మాడో అదే రాసాడు. ఏది రాసాడో ఆ ఆదర్శానికి అనుగుణంగా ఆచరించాడు . జీవించాడు. ఆ క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలిచాడు. తన విశ్వాసాల కోసం, రచన కోసం జైలు పాలయ్యాడు. ఎమర్జెన్సీ చీకటి నిర్బంధాన్ని అనుభవించాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే గాంధీ 'రోగ నిలయం'లో (గాంధీ ఆసుపత్రి) కేన్సర్తో బాధపడుతూ నెలల తరబడి గడిపాడు. కోమాలోకి వెళ్లి కన్నుమూసాడు. సికింద్రాబాద్ - కుట్ర కేసులో ముద్దాయిగా జైలు సంకెళ్ళనే లయ బద్ధంగా మోగిస్తూ..
ఈ మట్టిని తొలచుకొని విప్లవాలు లేస్తున్నాయి
ఎరుపెక్కిన మట్టికి మానెత్తుటి లాల్ సలామ్'
అని కటకటాలనుంచి గొంతెత్తి పాడాడు.
జైలు, కోర్టు, ఆసుపత్రి-ఎక్కడయినా ప్రజల గురించి ఆలపిస్తూనే ఆఖరి శ్వాసదాకా బతికాడు.
ఆగస్టు పదిహేను ద్రోహాన్ని చెప్పకపోతే
అన్నం సహించదునాకు
ఏరోజైనా
ప్రజా పోరాటాల విషయాన్ని రచించకపోతే
ఆరోజు జీవించి నట్టుండదు
అని రాసిన చెరబండరాజు పీడిత పోరాట ప్రజలకు చిరస్మరణీయుడు.
- వరవర రావు
(శ్రమజీవి,జులై-సెప్టెంబర్,2001 లో ప్రచురితం)

శ్ర మజీవి -2


(జులై 2,చెర సంస్మరణ)
శ్రమజీవి అంతర్జాతీయ గీతం
చెరబండరాజు
**************
'ప్రపంచ పురోగతి సాంతం క్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఇమిడివుంది' అని..
ప్రకటించిన చెరబండరాజు ప్రపంచ పురోగమనంలో శ్రమజీవి నిర్వహించిన పాత్రను చారిత్రకంగానూ, శాస్త్రీయంగానూ అర్థం చేసుకున్నాడు. ఎన్నో కవితల్లో పాటల్లో ఆ అవగాహనను ఎలుగెత్తిచాటాడు.
భూగోళం మీద జీవరాశి ఏర్పడినప్పటినుంచి ఆహారాన్వేషణ సాగుతున్నది. ఆహారాన్వేషణలో శ్రమ పాత్రయే మిగిలిన ప్రాణి కోటినుంచి మనుషులకు ఆకృతినిచ్చింది. మనిషి తొలిరూపమయిన గొరిల్లా తన ముందటి కాళ్లను ఆహారాన్వేషణలో ఉపయోగించే నైపుణ్యం పెంచుకున్న క్రమంతో తొలిమానవాకృతి ఏర్పడింది. పనిలో కరచరణాదుల ఉపయోగం, అవయవాల నిర్మాణానికి, ప్రత్యేక పనులకు ఎట్లా పరిణితి చెందిందో అట్లే మనిషి మెదడు అభివృద్ధి చెంది , బుద్ధి వికసించింది. ఊహించే, సృజించే శక్తి వచ్చింది.
చాలామంది భ్రమపడేట్లు బుద్ధి, ఊహాలు శ్రమను నిర్దేశించవు. శ్రమయే బుద్ధి. ఊహ, సృజన శక్తి వికసించడానికి తోడ్పడుతుంది. కనుక ప్రపంచ పురోగమనం అనేది బానిస సమాజం నుంచి పెట్టుబడిదారీ (ఒక స్వప్నం ఫలించి ఒక విశాల భూ ఖండంలో కొన్ని దశాబ్దాల పాటు) సమాజం ఏర్పడే వరకు కూడా శ్రమజీవి నెత్తురు చెమటలో, ఎక్కువ సార్లు నెత్తురే చింది ఏర్పడిన నాగరికతయే సాధించిన అభివృద్ధియే, సహజవనర్లు, భూమి, నీళ్లు, ఖనిజాలు వంటివి ప్రకృతిలో ఉన్నవనరు ఒక గింజ ఎన్నో గింజలకాయగా, ఒక పిడికెడు ధాన్యం-పుట్టెడు ధాన్యంగా పండే రహస్యం-మినహాయిస్తే ఈ వనర్లన్నింటినీ సమకూర్చుకుని ఎన్నోరెట్ల సంపదలను సృష్టించే శక్తి మాత్రం మానవ శ్రమకే ఉంది.
శ్రమజీవి నెత్తుటి బొట్టు ఏమేమి సాధించి ప్రపంచ పురోగమనానికి బాటలు వేసిందో చెరబండరాజు ఎల్లకులాలకు క్రమజీవి అంతర్జాతీయ గీతమనదగిన పాటలో స్పష్టంగా చెప్పాడు.
కొండలు పగలేసినం
బండలను పిండినం
మానెత్తురు కంకరగా
ప్రాజెక్టులు కట్టినం
శ్రమ ఎవడిదిరో
సిరి ఎవడిదిరో
బంజర్లను నరికినం
పొలాలను దున్నినం
మా చెమటలు ఏరులుగా
పంటలు పండించినం
గింజెవడిదిరో
గంజెవడిదిరో
మగ్గాలను పెట్టినం
పోగు పోగు వడికినం
మా నరాలె దారాలుగా
గుడ్డలెన్నో నేసినం
ఉడుకెవడిదిరో
వణుకెవడిదిరో
యంత్రాలను తిప్పినం
ఉత్పత్తులను పెంచినం
మా శక్తే విద్యుత్తుగా
ఫ్యాక్టరీలు నడిపినం
మేడ ఎవడిదిరో
గుడిసెవడిదిరో
కారణాలు తెలుసుకుంటే శ్రమనుంచే సిరి వచ్చిందనీ, నెత్తురే కంకరుగా ప్రాజెక్టులు నిర్మాణమయ్యాయని, చెమటలే ఏరులుగా బంజర్లు పొలాలై పంటలు పండాయని, గంజితాగి, అదికూడ దొరకక పేగులెండిపోగా, కష్టం చేసినవాళ్లే గింజలు పండించారని, శ్రమశక్తియే విద్యుచ్చక్తియని అర్ధమవుతోంది. ఒక్కసారి కారణాలు తెలిసి శ్రమజీవికి ఈ అవగాహన ఏర్పడితే ఆ పనిముట్లే ఆయుధాలవుతాయి. శ్రమజీవులు పరాయికరణ పొందిన తమ శ్రమనేకాదు, శ్రమఫలితాన్ని, అధికారాన్ని కూడా హస్తగతం చేసుకుంటారు. ఆ విశ్వాసాన్ని ఇచ్చే గొప్ప గీతాన్ని చెరబండరాజు ఇచ్చాడు.
శ్రమజీవి గురించి ఇంత శాస్త్రీయమైన అవగాహనతో రాసిన చెరబండరాజు నలగొండ జిల్లా, అంకుశాపురం గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టాడు. తల్లి పదినెలలు మోసి ఎంతో కష్టంతో కన్నబిడ్డ గనుక తండ్రి ఆయనను శెరాబందిరాజుతో పోల్చాడు. బక్కయ్య, బక్కరెడ్డి అని పేరుపెట్టాడు. స్కూల్లో చేర్చేప్పుడు టీచర్ భాస్కరరెడ్డిగా మార్చాడు. అంకుశాపురంలో, ఘటుకేసరులో చదువుకొని, హైదరాబాదులో నల్లకుంట కళాశాలలో తెలుగు ఎంఒఎల్ చేసి 1965లో దిగంబర కవితా ఉద్యమం ప్రారంభించినపుడు ఆయన తండ్రి పోల్చిన పేరుకు దగ్గరగా చెరబండరాజు అని తన కలంపేరు ఎంచుకున్నాడు. ఆశ్చర్యంగా ఆయన 1971 నుంచి 77 దాకా చెరబండరాజు కింగ్ ఆఫ్ ప్రిజన్ స్టోన్( ఈ శీర్షికతో అమెరికానుంచి వెలువడే గార్డియన్ పత్రికలో ఆయన గురించి ఒక పరిచయవ్యాసం1982లోవచ్చింది) గానే రాజీలేకుండా పోరాడిన జగమొండిగా జీవించాడు.
ఈ బక్కయ్యను చిన్నతనంలో తన వెంటపెట్టుకొని తండ్రి పొలం దగ్గరికి తీసుకువెళ్ళేవాడు. మోటకడుతూ..
ఏటికేతంబెత్తి వెయిపుట్లు పండించి
గంజిలో మెతుకెరుగరన్నా..
అని గొంతెత్తి పాడుకునేవాడు. ఆ పసి మనసులో ఆ రైతు జీవితం అట్లా ఒక దృశ్యమైంది. అందుకే కవిగా చెరబండరాజు.. ఈ మట్టి నాకు పట్టెడన్నం పెట్టి పాలు తాపిందని , రాక్షస భూస్వామ్య రంపపు కోతనుంచి ఈ మట్టిరుణం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసాడు.
ఇవ్వాళ మనం విద్యుత్ చార్జీల పెంపుదలతో, ఆ పుదలకు వ్యతిరేకంగా జరిగిన విశాల ప్రజా ఐక్య ఉద్యమంపై దారుణమైన అణచివేతలో చాలా స్పష్టంగా ప్రపంచ బ్యాంకు ఆదేశాలను, సామ్రాజ్యవాద కుట్రను పోల్చుకుంటున్నాం. ఈ  సామ్రాజ్యవాద స్వభావం గురించి చెరబండరాజు 1968లోనే  వందేమాతరమ్' గీతం రాసాడు. ఈ దేశాన్ని పాలిస్తున్న దళారీపాలకులు  మాతృభూమి, తల్లి భారతి అంటూనే అంతర్జాతీయ విపణిలో (ఆమె) అంగాంగం తాకట్టు పెట్టారని..
'ఒంటిమీద గుడ్డలతో జెండాలు కుట్టించి వివస్త్రగా ఊరేగిస్తున్నారని
'అప్పుతెచ్చి వేసినమిద్దెల్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది,
ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని
ఓదార్చలేని శోకం నీది
అమ్మా భారతీ ! నీ గమ్యం ఏమిటి తల్లీ!
అని ప్రశ్నించాడు. ఈ దళారీల పాలనలో ఆమె గమ్యం ఏమిటో స్పష్టమే అయింది. కారణాలు తెలిసిన శ్రమజీవులేం చేయాలో కూడ చెరబండరాజే చెప్పాడు.
తరతరాల దోపిడీని తలవంచక ఎదిరించిన
ప్రాణమెవడు త్రాణఎవడు
అని 'కార్మికుడు' గీతంలో రాసాడు
యీపు మీద బియ్యం సంచి
కడుపేమో ఖాళీ సంచి
అని హమాలీ గురించి
గింజ గింజ లెక్కగట్టి
సేటుగాడు కాటేస్తడు
కిలోల్లెక్క కూలడిగితే
వాడు బతుకు కాజేస్తడు ..
అని కూలీ గురించి పాట రాసాడు.
ఒక్కమాటలో చెప్పాలంటే చెరబండరాజు సాహిత్యమంతా శ్రమజీవి గురించిరాసిందే. శ్రమజీవి నెత్తుటి బొట్టు లొనే ప్రపంచ పురోగమనం ఉందనే అవగాహనతో రాసాడు గనుకనే నెత్తుటి బొట్టును కూడా ప్రజల విముక్తి కోసం ఏళ్లతరబడి జైలు నిర్బంధాన్ని, తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్ అనారోగ్యాన్ని కూడ లెక్కచేయకుండా కవిత్వం,కథలు, నవలలు, నాటికలు రాసాడు.
చెరబండరాజు.. రాజుల సంస్కృతిని కాదని ప్రజల సంస్కృతి గురించి పాడాడు . రాసాడు. ఏది నమ్మాడో అదే రాసాడు. ఏది రాసాడో ఆ ఆదర్శానికి అనుగుణంగా ఆచరించాడు . జీవించాడు. ఆ క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలిచాడు. తన విశ్వాసాల కోసం, రచన కోసం జైలు పాలయ్యాడు. ఎమర్జెన్సీ చీకటి నిర్బంధాన్ని అనుభవించాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే గాంధీ 'రోగ నిలయం'లో (గాంధీ ఆసుపత్రి) కేన్సర్తో బాధపడుతూ నెలల తరబడి గడిపాడు. కోమాలోకి వెళ్లి కన్నుమూసాడు. సికింద్రాబాద్ - కుట్ర కేసులో ముద్దాయిగా జైలు సంకెళ్ళనే లయ బద్ధంగా మోగిస్తూ..
ఈ మట్టిని తొలచుకొని విప్లవాలు లేస్తున్నాయి
ఎరుపెక్కిన మట్టికి మానెత్తుటి లాల్ సలామ్'
అని కటకటాలనుంచి గొంతెత్తి పాడాడు.
జైలు, కోర్టు, ఆసుపత్రి-ఎక్కడయినా ప్రజల గురించి ఆలపిస్తూనే ఆఖరి శ్వాసదాకా బతికాడు.
ఆగస్టు పదిహేను ద్రోహాన్ని చెప్పకపోతే
అన్నం సహించదునాకు
ఏరోజైనా
ప్రజా పోరాటాల విషయాన్ని రచించకపోతే
ఆరోజు జీవించి నట్టుండదు
అని రాసిన చెరబండరాజు పీడిత పోరాట ప్రజలకు చిరస్మరణీయుడు.
- వరవర రావు
(శ్రమజీవి,జులై-సెప్టెంబర్,2001 లో ప్రచురితం)

శ్ర మ జీవి


(జులై 2,చెర సంస్మరణ)
శ్రమజీవి అంతర్జాతీయ గీతం
చెరబండరాజు
**************
'ప్రపంచ పురోగతి సాంతం క్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఇమిడివుంది' అని..
ప్రకటించిన చెరబండరాజు ప్రపంచ పురోగమనంలో శ్రమజీవి నిర్వహించిన పాత్రను చారిత్రకంగానూ, శాస్త్రీయంగానూ అర్థం చేసుకున్నాడు. ఎన్నో కవితల్లో పాటల్లో ఆ అవగాహనను ఎలుగెత్తిచాటాడు.
భూగోళం మీద జీవరాశి ఏర్పడినప్పటినుంచి ఆహారాన్వేషణ సాగుతున్నది. ఆహారాన్వేషణలో శ్రమ పాత్రయే మిగిలిన ప్రాణి కోటినుంచి మనుషులకు ఆకృతినిచ్చింది. మనిషి తొలిరూపమయిన గొరిల్లా తన ముందటి కాళ్లను ఆహారాన్వేషణలో ఉపయోగించే నైపుణ్యం పెంచుకున్న క్రమంతో తొలిమానవాకృతి ఏర్పడింది. పనిలో కరచరణాదుల ఉపయోగం, అవయవాల నిర్మాణానికి, ప్రత్యేక పనులకు ఎట్లా పరిణితి చెందిందో అట్లే మనిషి మెదడు అభివృద్ధి చెంది , బుద్ధి వికసించింది. ఊహించే, సృజించే శక్తి వచ్చింది.
చాలామంది భ్రమపడేట్లు బుద్ధి, ఊహాలు శ్రమను నిర్దేశించవు. శ్రమయే బుద్ధి. ఊహ, సృజన శక్తి వికసించడానికి తోడ్పడుతుంది. కనుక ప్రపంచ పురోగమనం అనేది బానిస సమాజం నుంచి పెట్టుబడిదారీ (ఒక స్వప్నం ఫలించి ఒక విశాల భూ ఖండంలో కొన్ని దశాబ్దాల పాటు) సమాజం ఏర్పడే వరకు కూడా శ్రమజీవి నెత్తురు చెమటలో, ఎక్కువ సార్లు నెత్తురే చింది ఏర్పడిన నాగరికతయే సాధించిన అభివృద్ధియే, సహజవనర్లు, భూమి, నీళ్లు, ఖనిజాలు వంటివి ప్రకృతిలో ఉన్నవనరు ఒక గింజ ఎన్నో గింజలకాయగా, ఒక పిడికెడు ధాన్యం-పుట్టెడు ధాన్యంగా పండే రహస్యం-మినహాయిస్తే ఈ వనర్లన్నింటినీ సమకూర్చుకుని ఎన్నోరెట్ల సంపదలను సృష్టించే శక్తి మాత్రం మానవ శ్రమకే ఉంది.
శ్రమజీవి నెత్తుటి బొట్టు ఏమేమి సాధించి ప్రపంచ పురోగమనానికి బాటలు వేసిందో చెరబండరాజు ఎల్లకులాలకు క్రమజీవి అంతర్జాతీయ గీతమనదగిన పాటలో స్పష్టంగా చెప్పాడు.
కొండలు పగలేసినం
బండలను పిండినం
మానెత్తురు కంకరగా
ప్రాజెక్టులు కట్టినం
శ్రమ ఎవడిదిరో
సిరి ఎవడిదిరో
బంజర్లను నరికినం
పొలాలను దున్నినం
మా చెమటలు ఏరులుగా
పంటలు పండించినం
గింజెవడిదిరో
గంజెవడిదిరో
మగ్గాలను పెట్టినం
పోగు పోగు వడికినం
మా నరాలె దారాలుగా
గుడ్డలెన్నో నేసినం
ఉడుకెవడిదిరో
వణుకెవడిదిరో
యంత్రాలను తిప్పినం
ఉత్పత్తులను పెంచినం
మా శక్తే విద్యుత్తుగా
ఫ్యాక్టరీలు నడిపినం
మేడ ఎవడిదిరో
గుడిసెవడిదిరో
కారణాలు తెలుసుకుంటే శ్రమనుంచే సిరి వచ్చిందనీ, నెత్తురే కంకరుగా ప్రాజెక్టులు నిర్మాణమయ్యాయని, చెమటలే ఏరులుగా బంజర్లు పొలాలై పంటలు పండాయని, గంజితాగి, అదికూడ దొరకక పేగులెండిపోగా, కష్టం చేసినవాళ్లే గింజలు పండించారని, శ్రమశక్తియే విద్యుచ్చక్తియని అర్ధమవుతోంది. ఒక్కసారి కారణాలు తెలిసి శ్రమజీవికి ఈ అవగాహన ఏర్పడితే ఆ పనిముట్లే ఆయుధాలవుతాయి. శ్రమజీవులు పరాయికరణ పొందిన తమ శ్రమనేకాదు, శ్రమఫలితాన్ని, అధికారాన్ని కూడా హస్తగతం చేసుకుంటారు. ఆ విశ్వాసాన్ని ఇచ్చే గొప్ప గీతాన్ని చెరబండరాజు ఇచ్చాడు.
శ్రమజీవి గురించి ఇంత శాస్త్రీయమైన అవగాహనతో రాసిన చెరబండరాజు నలగొండ జిల్లా, అంకుశాపురం గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టాడు. తల్లి పదినెలలు మోసి ఎంతో కష్టంతో కన్నబిడ్డ గనుక తండ్రి ఆయనను శెరాబందిరాజుతో పోల్చాడు. బక్కయ్య, బక్కరెడ్డి అని పేరుపెట్టాడు. స్కూల్లో చేర్చేప్పుడు టీచర్ భాస్కరరెడ్డిగా మార్చాడు. అంకుశాపురంలో, ఘటుకేసరులో చదువుకొని, హైదరాబాదులో నల్లకుంట కళాశాలలో తెలుగు ఎంఒఎల్ చేసి 1965లో దిగంబర కవితా ఉద్యమం ప్రారంభించినపుడు ఆయన తండ్రి పోల్చిన పేరుకు దగ్గరగా చెరబండరాజు అని తన కలంపేరు ఎంచుకున్నాడు. ఆశ్చర్యంగా ఆయన 1971 నుంచి 77 దాకా చెరబండరాజు కింగ్ ఆఫ్ ప్రిజన్ స్టోన్( ఈ శీర్షికతో అమెరికానుంచి వెలువడే గార్డియన్ పత్రికలో ఆయన గురించి ఒక పరిచయవ్యాసం1982లోవచ్చింది) గానే రాజీలేకుండా పోరాడిన జగమొండిగా జీవించాడు.
ఈ బక్కయ్యను చిన్నతనంలో తన వెంటపెట్టుకొని తండ్రి పొలం దగ్గరికి తీసుకువెళ్ళేవాడు. మోటకడుతూ..
ఏటికేతంబెత్తి వెయిపుట్లు పండించి
గంజిలో మెతుకెరుగరన్నా..
అని గొంతెత్తి పాడుకునేవాడు. ఆ పసి మనసులో ఆ రైతు జీవితం అట్లా ఒక దృశ్యమైంది. అందుకే కవిగా చెరబండరాజు.. ఈ మట్టి నాకు పట్టెడన్నం పెట్టి పాలు తాపిందని , రాక్షస భూస్వామ్య రంపపు కోతనుంచి ఈ మట్టిరుణం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసాడు.
ఇవ్వాళ మనం విద్యుత్ చార్జీల పెంపుదలతో, ఆ పుదలకు వ్యతిరేకంగా జరిగిన విశాల ప్రజా ఐక్య ఉద్యమంపై దారుణమైన అణచివేతలో చాలా స్పష్టంగా ప్రపంచ బ్యాంకు ఆదేశాలను, సామ్రాజ్యవాద కుట్రను పోల్చుకుంటున్నాం. ఈ  సామ్రాజ్యవాద స్వభావం గురించి చెరబండరాజు 1968లోనే  వందేమాతరమ్' గీతం రాసాడు. ఈ దేశాన్ని పాలిస్తున్న దళారీపాలకులు  మాతృభూమి, తల్లి భారతి అంటూనే అంతర్జాతీయ విపణిలో (ఆమె) అంగాంగం తాకట్టు పెట్టారని..
'ఒంటిమీద గుడ్డలతో జెండాలు కుట్టించి వివస్త్రగా ఊరేగిస్తున్నారని
'అప్పుతెచ్చి వేసినమిద్దెల్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది,
ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని
ఓదార్చలేని శోకం నీది
అమ్మా భారతీ ! నీ గమ్యం ఏమిటి తల్లీ!
అని ప్రశ్నించాడు. ఈ దళారీల పాలనలో ఆమె గమ్యం ఏమిటో స్పష్టమే అయింది. కారణాలు తెలిసిన శ్రమజీవులేం చేయాలో కూడ చెరబండరాజే చెప్పాడు.
తరతరాల దోపిడీని తలవంచక ఎదిరించిన
ప్రాణమెవడు త్రాణఎవడు
అని 'కార్మికుడు' గీతంలో రాసాడు
యీపు మీద బియ్యం సంచి
కడుపేమో ఖాళీ సంచి
అని హమాలీ గురించి
గింజ గింజ లెక్కగట్టి
సేటుగాడు కాటేస్తడు
కిలోల్లెక్క కూలడిగితే
వాడు బతుకు కాజేస్తడు ..
అని కూలీ గురించి పాట రాసాడు.
ఒక్కమాటలో చెప్పాలంటే చెరబండరాజు సాహిత్యమంతా శ్రమజీవి గురించిరాసిందే. శ్రమజీవి నెత్తుటి బొట్టు లొనే ప్రపంచ పురోగమనం ఉందనే అవగాహనతో రాసాడు గనుకనే నెత్తుటి బొట్టును కూడా ప్రజల విముక్తి కోసం ఏళ్లతరబడి జైలు నిర్బంధాన్ని, తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్ అనారోగ్యాన్ని కూడ లెక్కచేయకుండా కవిత్వం,కథలు, నవలలు, నాటికలు రాసాడు.
చెరబండరాజు.. రాజుల సంస్కృతిని కాదని ప్రజల సంస్కృతి గురించి పాడాడు . రాసాడు. ఏది నమ్మాడో అదే రాసాడు. ఏది రాసాడో ఆ ఆదర్శానికి అనుగుణంగా ఆచరించాడు . జీవించాడు. ఆ క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలిచాడు. తన విశ్వాసాల కోసం, రచన కోసం జైలు పాలయ్యాడు. ఎమర్జెన్సీ చీకటి నిర్బంధాన్ని అనుభవించాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే గాంధీ 'రోగ నిలయం'లో (గాంధీ ఆసుపత్రి) కేన్సర్తో బాధపడుతూ నెలల తరబడి గడిపాడు. కోమాలోకి వెళ్లి కన్నుమూసాడు. సికింద్రాబాద్ - కుట్ర కేసులో ముద్దాయిగా జైలు సంకెళ్ళనే లయ బద్ధంగా మోగిస్తూ..
ఈ మట్టిని తొలచుకొని విప్లవాలు లేస్తున్నాయి
ఎరుపెక్కిన మట్టికి మానెత్తుటి లాల్ సలామ్'
అని కటకటాలనుంచి గొంతెత్తి పాడాడు.
జైలు, కోర్టు, ఆసుపత్రి-ఎక్కడయినా ప్రజల గురించి ఆలపిస్తూనే ఆఖరి శ్వాసదాకా బతికాడు.
ఆగస్టు పదిహేను ద్రోహాన్ని చెప్పకపోతే
అన్నం సహించదునాకు
ఏరోజైనా
ప్రజా పోరాటాల విషయాన్ని రచించకపోతే
ఆరోజు జీవించి నట్టుండదు
అని రాసిన చెరబండరాజు పీడిత పోరాట ప్రజలకు చిరస్మరణీయుడు.
- వరవర రావు
(శ్రమజీవి,జులై-సెప్టెంబర్,2001 లో ప్రచురితం)

20, డిసెంబర్ 2024, శుక్రవారం

యువజన నాయకుడిగా...మునీర్

అఖిలభారత యువజన సమాఖ్య (AIYF )నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీ క్రియాశీల కార్యకర్తగా ప్రజల పక్షాన నిలబడి,  మునీర్ అనేక ఉద్యమాలను  నడిపించాడు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  గిరిజనులు ఆధునిక సౌకర్యాలైన   రవాణా, వసతికి దూరంగా  కొండ కోనల్లో జీవిస్తారు. నిరుపేదలైన గిరిజన, ఆదివాసి, షెడ్యూల్డ్ కులాలు, ఇతర పేద వర్గాలకు ప్రభుత్వ భూములు పంచాలని పోరాటం చేశాడు. స్కూల్స్,హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని అనేక పోరాటాలు నిర్మించాడు. పేదల అభివృద్ధికి ప్రయత్నించని ప్రభుత్వ అలసత్వంపై,  పోలీసుల దాష్ఠికాలపై,దొరల  ఆగడాలను ఎదిరిస్తూ మునీర్ ప్రస్థానం సాగింది.
  కాలినడకన ఇంటింటికి, గల్లీ గల్లీకి తిరిగి మందమర్రి ప్రజల్ని చైతన్యపరిచాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో   సైకిల్ పై తిరుగుతూ అనేక గ్రామాల జన సమీకరణకు,పార్టీ విస్తరణకు విశేష కృషి చేశాడు. ఆసిఫాబాద్, మంచిర్యాల, లక్షేట్టిపేట నెన్నెల తదితర మండలాల్లో కష్టజీవులు, నిరుపేదలకు మెరుగైన జీవనం, కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వాధికారులతో పలుమార్లు చర్చలు చేశాడు. కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి.నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పనిచేయటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్ల పోలీసులు అతన్ని అనేక తప్పుడు కేసుల్లో ఇరికించారు. అక్రమంగా అరెస్టు చేసి జైలు పాలు చేశారు. కోర్టుల చుట్టూ తిప్పారు.

హమాలి అంజయ్య లాకప్ హత్య
(ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు రాయాలి.అది రాష్ట్రవ్యాప్త ఇష్యూ గా ఎలా మారిందో!)

  హైదరాబాద్, గౌలిగూడ బస్ స్టేషన్ లో హమాలీ పనిచేసే(1980) అంజయ్యను పోలీసులు కొట్టి చంపారని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. పోలీస్ దుర్మార్గానికి నిరసనగా సిపిఐ  పార్టీ రాష్ట్ర వ్యాప్త బందుకు పిలుపునిచ్చింది.  మందమర్రిలో  కార్మిక నాయకులు వి. టి అబ్రహం, మునీర్ నేతృత్వంలో  ఆ బంద్ సంపూర్ణంగా  విజయవంతం అయింది .  ఆ సందర్భంగా  ప్రజలు ఒక ఊరేగింపు నిర్వహించారు. ఆ ఊరేగింపును  అడ్డుకోవడానికి  'డిఎస్పీ ' స్థాయి అధికారి ఆధ్వర్యంలో పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.పోలీస్ చర్యలను కమ్యూనిస్టు శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయు. పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేసి ప్రజల్ని చెదరగొట్టారు. ముఖ్య నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీస్ స్టేషన్ కు తరలించి చిత్రహింసలు పెట్టారు. పోలీస్ దుర్మార్గం పట్టణంలో విస్తృతంగా ప్రచారం అయ్యింది.సిపిఐ నాయకులను పోలీసులు కొడుతున్నారనే విషయం తెలుసుకుని గని కార్మికులు, మహిళలు,యువకులు పెద్ద ఎత్తున  కుటుంబాలతో సహా కదిలి వచ్చి పోలీస్ స్టేషన్ ఎదుట వందలాది మందితో భారీ ధర్నా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ముందు నుంచి ప్రజలు వెళ్లిపోవాలని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను  ప్రజలు ఖాతరు చేయలేదు. ప్రజల సంఖ్య గంట గంటకు పెరిగిపోయింది. పరిస్థితి మరింతగా ఉద్రిక్తితం గా మారింది.. గేట్లు బద్దలు కొట్టి, ప్రజలు పోలీస్ స్టేషన్ పై దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా సమాచారం అందుకున్న ఉన్నత పోలీసు అధికారులు మునీర్ తో పాటు ఇతర నాయకులను విడిచిపెట్టేశారు.
పోలీసులు తమ  తప్పు కప్పిపుచ్చుకోవడానికి  శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని    ఉద్యమకారులపైనే తిరిగి కేసు పెట్టారు. మండమర్రికి సమీపం లోని సోమగూడెం వద్ద రెండు బస్సులను ఎవరో దగ్ధం చేశారు .  ఆ బస్సు దగ్ధం కేసులో కూడా మునీర్ మిత్ర బృందాన్ని ఇరికించారు.

సారా వ్యతిరేక పోరాటం లో
దూబగుంట కంటే ముందు మందమర్రి

సింగరేణి కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి  నెల రోజులు కష్టపడి సంపాదించిన సొమ్ములో అధిక భాగం సారా,బ్రాందీ తాగటానికి ఖర్చు అయ్యేవి. గనులపై  జీతం అందుకున్న అనేకమంది కార్మికులు ముందు ఇళ్లకు వెళ్లకుండా కల్లు దుకాణాలకు చేరేవారు. జేబులో ఉన్న డబ్బులు ఖర్చయ్యే వరకు సారా కొట్టు, బ్రాందీ షాపే వీరికి ఆవాసాలుగా మారి పోయేవి.మరి గని కష్టం వల్లో, గని అధికారుల దురుసు ప్రవర్తన వల్లో, లేదా ఊరి తాలూకూ ఏ దయనీయ పరిస్థితులూ గుర్తుకు వచ్చేవో కాని ఈ ప్రపంచానికి దూరంగా కార్మికులు తాగుడు లోకం లోకి వెళ్లిపోయేవారు.
కార్మికులకు ఆహ్లాదాన్ని అందుబాటులోకి  తెస్తున్నాం... అనే పేరుమీద సింగరేణి యాజమాన్యం ఏర్పాటుచేసిన 'రిక్రియేషన్ క్లబ్బులు' పేకాట కేంద్రాలుగా విలసిల్లేవి. జీతాలు అందుకున్న తర్వాత కార్మికులు  కొందరు పేకాట ఆడడానికి నేరుగా ఇక్కడికే చేరుకునేవారు.రోజుల తరబడి ఇక్కడే భోజనాలు.ఇక్కడేనిద్ర.  ఇలాంటి మగ మహారాజుల జాడ కోసం భార్యా పిల్లలు బజారంతా వెతికేవారు. క్లబ్ లోనే    కాపురం పెట్టిన వారిని, మద్యం  మత్తులో ఎక్కడపడితే అక్కడే పడిపోయిన వారిని ఇంటికి తీసుకు వెళ్లడానికి కుటుంబీకులు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు.
మత్తులో సోయి తప్పిన కార్మికుల జేబుల్లోంచి మందమర్రి దొర గుండాలు డబ్బులు దొంగిలించేవారు. ప్రతిఘటించిన వారిని తన్ని  మరీ బలవంతంగా లాక్కునేవారు
ప్రతినెలా సాగే ఈ తతంగాన్ని  కమ్యూనిస్టు పార్టీ నిశితంగా గమనించింది. మందమర్రి లోని కార్మిక వాడలలో సారా కొట్టు, బ్రాందీ షాపులు ఎత్తివేయాలనే పోరాటం ఊపు అందుకొంది. దూబగుంట (నెల్లూరు జిల్లా)లో కంటే ముందు సారా వ్యతిరేక పోరాటం   ఇక్కడ జరిగింది.
మహిళా నాయకురాళ్ళు మహా లక్ష్మమ్మ, మనెమ్మల(వీరిద్దరూ గురుంచి కొంచెం వివరంగా రాయాలి) నేతృత్వంలో మద్యం వ్యతిరేక పోరాటాలు కొనసాగాయి. సారా కొట్లను కూల్చివేసి, బ్రాందీ షాపుల పై భౌతిక దాడులకు పాల్పడ్డారు. మహిళలు భారీ సంఖ్యలో కదిలారు.కార్మిక నాయకులు అబ్రహం,మునీర్ మార్గదర్శకత్వంలోనే మద్యం వ్యతిరేక పోరాటాలు నడుస్తు న్నాయని తెలిసి, డైరెక్ట్ గా వారినేమీ చేసులేక  అక్రమ కేసులు పెట్టారు. అయినా భయపడకుండా మహిళలు చేసిన పోరాటం వలన కార్మిక వాడల నుంచి సారాకొట్లు,, బ్రాందీ షాపులను ఎత్తివేసారు. ఫలితంగా కార్మిక వాడల్లో   ప్రశాంతత నెలకొన్నది.

మరో జూదం *తంబోలా* ఆట

కార్మికుల సొమ్మును దోచుకోవడానికి అలవాటు పడిన అసాంఘిక ముఠాలు వినోదాత్మక ఆట పేరిట తంబోలా అనే జూదానికి తెర లేపారు. సర్కస్ నిర్వాహకులు వేసే పెద్ద టెంటు లాంటిదే వీరు కూడా ఏర్పాటు చేశారు.  ఈ తంబోలా కేంద్రంలోకి వెళ్లాలంటే ప్రవేశ రుసుము (టికెట్) తప్పనిసరి.ఈ జూద గృహానికి పోలీసులే  కాపలా కాసేవారు.  హాల్ లోనికి ప్రవేశించిన ఆటగాళ్లు డబ్బులు చెల్లించి నెంబర్ ఆట ఆడుతారు.   అసాంఘిక కార్యకలాపాల అడ్డాలుగా ఇవి వుండేవి.  రాత్రిపూట జరిగే ఈ తాంబోలా ఆటలో ఒక స్టేజి కూడా వుంటుంది. ఈ స్టేజి పైన మహిళలతో అర్థనగ్న,అసభ్య, అశ్లీల నృత్యాలను ప్రదర్శించేవారు. ఈ నృత్యాలు చూస్తూ జనం ఊగిపోయి, తమ జేబులు ఖాళీ అవుతున్న విషయాన్ని గుర్తించేవారు కాదు.
డ్యూటీలు మాని ఇక్కడికి పెద్ద సంఖ్యలో కార్మికులు చేరుకునేవారు. కార్మికుల కుటుంబాలలో చిచ్చు రేపుతున్న ఈ సంఘటన యూనియన్ దృష్టికి వచ్చింది.

తంబోలా కేంద్రంపై దాడి

తంబోలా ఆట పేరిట జరిగే దోపిడి కేంద్రంపై మునీర్ నేతృత్వంలో యువకులు దాడి చేశారు. అడ్డువచ్చిన గుండాలను చితక బాదారు. పెద్ద సంఖ్యలో యువకులు రావడంతో గుండాలు భయంతో పరిగెత్తి తప్పించుకున్నారు. ప్రజలు తాంబోలా టెంట్ ను తగలబెట్టి, ఆటను పూర్తిగా రద్దు చేయించారు. ఈ పరిణామం కార్మిక కుటుంబాలకు సంతోషం నింపింది. దొర కంట్లో నిప్పులు కురిపించింది. తంబోలా కేంద్రంపై జరిగిన దాడి వలన ఆర్థిక నష్టం  కలుగుతుందని భావించిన ఆ కేంద్రం నిర్వాహకులు మునీర్ మిత్ర బృందంపై తప్పుడు కేసు నమోదు చేయించారు.
మునీర్ తో పాటు యువకులందరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ వార్త కార్మిక వాడల్లో ప్రచారం కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ చేరుకొన్నారు. వీరి విడుదల కోసం ఆందోళనకు దిగారు. గత్యంతరం లేక కేసు నమోదు చేసి యువకులను విడిచిపెట్టారు.

సినిమాహాల్ శ్రీ కృష్ణా టాకీస్
మందమర్రి పట్టణంలో జరిగే అరాచకాలకు ఈ సినిమా హాలు   పెద్ద అడ్డా!  ఇది ఇక్కడి స్థానిక భూస్వామి శ్రీపతి రావు ది. మందమర్రిలో చట్టం, న్యాయం, ధర్మం అన్ని ఈ *దొర* కనుసన్నులలోనే నడిచేవి. దొర  రూపొందించిన నియమ, నిబంధనలు మాత్రమే సినిమా హాల్లో అమలు జరగాలి.  ఏమాత్రం అటు ఇటు జరిగినా దొర గుండాలు ప్రేక్షకుల పై విరుచుకు పడేవారు.
  హీరో, హీరోయిన్ల పై వచ్చే పాటలకు ఈలవేసినా, చప్పట్లు కొట్టినా తప్పే! హీరో, విలన్ మధ్య జరిగే కొట్లాట సన్నివేశాలకు స్పందించి చప్పట్లు కొట్టినా, అరిచినా,గంతులు వేసినా, పేపర్లు చింపి విసిరినా క్షమించరాని నేరమే! గుండాల దెబ్బలకు గురికావాల్సిందే. ఎప్పుడూ తాగిన మత్తులో వుండే వీరు    ప్రేక్షకులనే కనికరం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టేవారు .
సినిమా కి వచ్చే స్త్రీల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. సంతోషంగా నవ్వుతూ తుల్లుతూ సినిమాకు వెళ్లిన మహిళలు కొందరు  సినిమా టాకీస్ సమీపంలో బావిలో శవాలుగా తేలిన  సంఘటనలు ఉన్నాయి. అవన్నీ దొర గుండాలు చేసిన హత్యలే.కాని,అనుమానాస్పద మరణాలుగా నమోదు అయ్యేవి . సినిమాకు వచ్చిన స్త్రీల పై  దొర గుండాలే అత్యాచారం చేసి ,చంపి ,ఆ శవాలను బావిలో వేసేవారు.
*******
ఒకరోజు (సంవత్సరం రాయాలి కనీసం ..టైమ్ రాయాలి.  ) పట్టణ మహిళా సమాఖ్య నాయకురాలు మనెమ్మ కుమారుడు రాజు, మరో విద్యార్థి రవి *పొట్టేలు పున్నమ్మ*  సినిమాకు వెళ్లారు . పిల్లలు ఇద్దరూ  సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏఐఎస్ఎఫ్ లో చురుకుగా వుండేవారు. సినిమా హాలు నిబంధనలకు విరుద్ధంగా పిల్లలు ఈల వేశారని, అల్లరి చేశారని గుండాలు వీరిని  విపరీతముగా కొట్టారు. పిల్లలపై జరిగిన దాడి వార్త పట్టణమంతా దావానంలా వ్యాపించింది.
ప్రజలపై గుండాల అరాచకాలను నిలువరించాలని సిపిఐ శ్రేణులు అప్పటికే నిర్ణయించుకుని ఉన్నాయి.  సిపిఐ  పార్టీ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కు విద్యార్థులపై జరిగిన దాడి తెలిసింది. పిల్లలపై జరిగిన దాడితో నాయకులు, కార్యకర్తలు కోపంతో రగిలిపోయారు. గుండాలకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు.
అందుబాటులో ఉన్న కర్రలు, రాళ్లు,చేతికి ఏది దొరికితే అది పట్టుకొని  గుండాలకు బుద్ధి చెప్పాలని ప్రజా సమూహం సినిమా హాల్ వైపు బయలు దేరింది. వీరి వెంట మహిళలు కూడా కారంపొడి, చీపుర్లు పట్టుకొని నడిచారు.
గూండాలు టాకీస్ సమీపంలోనే ఉన్నారు. మునీర్ నేతృత్వంలో ప్రజా సమూహం ఒక్కసారిగా గుండాలపై దాడికి దిగింది. ఊహించని దాడికి కంగుతిన్న గుండాలు కొద్దిసేపట్లోనే  ప్రతిఘటించారు. భారీ సంఖ్యలో మూగిన జనం ముందు వీరి కండ బలం  ఏమీ పనిచేయలేదు. ప్రజల దాడి నుండి తప్పించుకోవడానికి వారు సినిమా హాల్ లోనికి చొర బడ్డారు. పారిపోతున్న గుండాలను ప్రజలు వెంటపడి  మరీ తరిమి కొట్టారు
సినిమా హాల్ లోపలకి ప్రవేశించిన గుండాల అరుపులు, కేకలతో భయభ్రాంతులకు గురైన ప్రొజెక్టర్ రూమ్ లోని సిబ్బంది ప్రదర్శనను నిలిపివేశారు.హాలులో లైట్లను వేశారు. ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. ప్రేక్షకులకు ధైర్యం చెబుతూ, వారిని ఇళ్లకు పంపుతూ ప్రజలు గుండాలను వెంబడించారు.
గుండాలకు బుద్ధి చెప్పండి...
గుండాయిజం నశించాలి...
గుండాల్లారా ఖబర్దార్ అంటూ  నినాదాలు చేస్తూ గుండాలపై ప్రజల  దాడి కొనసాగుతున్నది

అదే రోజు సినిమా చూడడానికి మునీర్ తల్లి, చెల్లెలు కూడా వచ్చారు. ఈ విషయం మునీర్ కు తెలియదు.
విద్యార్థులపై జరిగిన దాడితో  చలించి పోయిన మునీర్ చేతిలో లాఠీతో గుండాయిజం *బంద్ కరో* అంటూ గూండాల పైకి దూకుతున్నాడు.
మునీర్ చేతిలో లాఠీని చూసి మునీర్ తల్లి, చెల్లి ఇద్దరూ ఆశర్యపోయారు.
ఏడుస్తూ ...
"క్యా కర్ రా",
"హాత్ మే లాఠీ కైకు", అంటూ 
వారిరువురు బిగ్గరగా అరుస్తున్నారు.
"ఆప్ ఘర్ జావో,
"హం ఆయంగే"
"ఫికర్ మత్ కీజియే"
జల్ది జాయియే" అంటూ
గుండాలను తరుముకుంటూ మునీరు వెళ్లిపోయాడు.
గతంలో సినిమా హాలుకు వచ్చిన ప్రేక్షకులతో వ్యవహరించిన తీరును  మళ్ళీ గుర్తు చేసుకుంటూ ప్రజలు  పెద్ద ఎత్తున దాడికి దిగారు.
బుకింగ్ కౌంటర్లు, ప్రొజెక్టర్ రూమ్, కుర్చీలు, ఇతర ఫర్నిచర్ విపరీతంగా ధ్వంసం అయ్యింది. ప్రజల దాడి నుంచి తప్పించుకోవడానికి గుండాలు తలో దిక్కు పారిపోయారు. దొరికిన వారిని  దొరికినట్టు ప్రజలు చితక బాదారు. సినిమా హాల్ పై జరిగిన దాడిని ప్రజలు స్వాగతించారు. కొందరైతే మరీ సంబరాలు చేసుకున్నారు.

మునీర్ తల్లి,చెల్లెలు కన్నీరు పెడుతూనే భయం భయంగా ఇంటికి చేరుకున్నారు. అర్ధరాత్రి మునీర్ కూడా ఇంటికి చేరుకొని, ఏమీ తెలియనట్లు పడుకున్నాడు. టాకీస్ లో చూసిన గొడవను ఎవరు కూడా మునీర్ తండ్రితో చెప్పలేదు.
అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి తలుపులను  గట్టిగా కొడుతూ,ఎవరో  "మేం పోలీసులం .తలుపు తీయండి " అంటూ పిలుస్తున్నారు.
భయపడుతూనే "కౌన్ హై ?"అంటూ   మునీర్ తల్లి వెళ్లి తలుపు తీసింది.
" ఇత్ని రాత్ క్యా కామ్ ?"
"క్యో ఆయి హో  ?"  అంటూ  ప్రశ్నించింది.
   మేము పోలీసులం..మునీర్ ఉన్నాడా? అంటూ పోలీసులు ఎదురు ప్రశ్న వేశారు.
"ఇంకా ఇంటికి రాలేదు"... అని సమాధానం ఇచ్చింది.
"మేం ఇంటిని సోదా చేస్తాం".. అంటూ పోలీసులు ముందుకు కదిలారు.
"ఇంట్లోకి రావద్దు" అంటూ మునీర్ తల్లి గట్టి గట్టిగా అరిచింది.
ఆ గొడవకు మేల్కొన్న మునీర్ తండ్రి
"క్యా హోరా ?" అంటూ బెడ్ రూమ్ నుంచి హాల్ లోకి వచ్చాడు.
ఎదురుగా పోలీసులు కనబడడంతో వారికి నమస్కారం చేసి,
" క్యా హై సాబ్ ఇత్నీ రాత్ ఆయే?" అంటూ పలకరించాడు. సినిమా హాలుపై  దాడి  గురుంచి చెప్పి ,మునీర్ కోసమే వచ్చామని పోలీసులు అన్నారు.
మునీర్ ఇంకా ఇంటికే రాలేదని తల్లి చెబుతుండగానే మునీర్ బాహర్ ఆవో అంటూ గట్టిగా కేక వేసి పిలిచాడు. తండ్రి పిలుపుతో బయటకు వచ్చిన మునీర్ ను పోలీసులకు అప్పగించాడు. అదేవిధంగా సంధానిని కూడా పోలీసులు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు.
బచ్చా హై సాబ్, సుభా మైహి, లేయాఖే ఆప్ కీ హవాలా కర్ దుంగా అని బ్రతిమాలడంతో సంధానిని వదిలిపెట్టి వెళ్లారు.
మునీర్ తండ్రి గౌస్ మియా కే కే 5 గనిలో పి.ఎగా (పెద్ద రైటేరు) పనిచేయటం ఆయన సత్ప్రవర్తన, అవినీతి రహితుడు, క్రమశిక్షణతో పనిచేయడం వలన అధికారులు, కార్మికులలో ఆయనకు మంచి పేరుంది.
పోలీసుల వెంట, సినిమా హాల్ యజమాని కొడుకు సురేందర్ రావు కూడా ఉండటం విశేషం. మునీర్ ను చూసిన వెంటనే ఆయన ముఖం ఎర్రగా కందిపోయింది. ఆగ్రహంతో పళ్ళు పటపట కొరికాడు. వీడికి బుద్ధి చెప్పండి అంటూ పోలీసులను ఆజ్ఞాపించాడు. అప్పటికే పోలీసు వ్యాన్ లో మునీర్ మిత్రులు కూడా ఉన్నారు. వీరందరికీ ఆరోజు రాత్రి పూట పోలీసులు గట్టిగానే అరుసుకున్నారు.

పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా

మునీర్ తో పాటు ఇతర యువకులను పోలీసులు అరెస్టు చేసి, చిత్రహింసలకు గురి చేస్తున్నారని కార్మిక వాడల్లో ప్రచారమైంది. మందమర్రి భూస్వామి కొడుకు సురేందర్రావు స్వయంగా పోలీస్ స్టేషన్లో అడ్డావేసి వీరిని చిత్రహింసలు పెట్టిస్తున్నాడని వార్త ప్రజలను కోపోద్రికుల్ని చేసింది.
మునీర్ తో పాటు అరెస్ట్ అయిన వారందరినీ భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. పోలీసుల దౌర్జన్యం నశించాలి. దొర గుండాయిజం నశించాలి. గుండాల్లారా ఖబర్దార్ అంటూ నినాదాలు మార్మోగుతున్నాయి. గంట, గంటకు ప్రజలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు. ఉదయం షిఫ్టు ముగించుకొని ఇళ్లకు వెళ్లే కార్మికులు కూడా పోలీస్ స్టేషన్ వద్ద ఆగుతున్నారు.జన ప్రవాహం, నినాదాల హోరు పెరిగిపోతున్నది. పోలీస్ స్టేషన్ ఎదుట చేస్తున్న ధర్నాను విరమించాలని, శాంతి భద్రతలకు విఘాతo కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు మైకులలో హెచ్చరిస్తున్నారు. అయినా జనం వెనక్కి తగ్గటం లేదు. రాత్రి కావస్తుండడంతో పోలీసులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి వీరిని విడుదల చేశారు.

చీర చింపి కట్టు కట్టిన వీరవనిత
పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, సినిమా టాకీస్ పై దాడి నిర్వహించారనే కోపంతో  పోలీసులు ఊగిపోయారు. మునీర్  ను ఇష్టం వచ్చినట్టు లాఠీలతో చితక బాదారు. తలకు తగిలిన లాఠీ దెబ్బకు తల పగిలి, రక్తం కారుతున్నది.ప్రజా ఆందోళనతో సిపిఐ నాయకులను పోలీసులు విడిచిపెట్టినప్పుడు బయటకు వస్తున్న మునీర్ తల నుండి రక్తం కారుతూనే ఉంది.మునర్ చేతితో దెబ్బ తగిలిన చోట ఒత్తి పట్టుకున్నప్పటికీ రక్తం కారటం ఆగటం లేదు. దీన్ని గమనించిన ఓ ఆడబిడ్డ తన చీర కొంగు చింపి కట్టు కట్టింది. అది ఆనాడు ప్రజా చైతన్యానికి, ఉద్యమకారుల ఎడల ఉన్న ప్రేమకు నిదర్శనం.
పోలీసులు విడుదల చేసిన నాయకులను ప్రజలు గుండెలకు హత్తుకున్నారు.వారికి జేజేలు పలుకుతూ స్వాగతం పలికారు. మునీర్ ను ప్రజలు భుజాలపై ఎక్కించుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
అవమాన భారంతో దొర రగిలిపోతున్నాడు.మునీర్, సిపిఐ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం బయటకు పొక్కింది. ఎప్పుడైనా వీరిపై దాడి జరగవచ్చునని పుకార్లు బయలుదేరాయి.

15, డిసెంబర్ 2024, ఆదివారం

సి ఎస్ పి కంటా పోరాటం

సిఎస్పి కాంటా పోరాటం 

మందమర్రి డివిజన్ బొగ్గు గనుల నుంచి జరిగే ఉత్పత్తిని లారీల ద్వారా సిఎస్ పి(coal  screening plant )వద్దకు రవాణా చేస్తారు.సి ఎస్ పి బంకర్లలో బొగ్గు నింపి, రకరకాల సైజులుగా బొగ్గును వేరు చేస్తారు . బొగ్గు ఆధారిత పరిశ్రమల యజమానులు ,వారి వారి  అవసరాల  మేరకు, నిర్ణీత పరిమాణం కలిగిన దానిని కొనుగోలు చేస్తారు.
 బొగ్గు కొనడానికి అర్హత కలిగిన వారు, సింగరేణి సంస్థ వారికి కేటాయించిన ప్రాంతం నుండి కొనుగోలు చేసి, లారీల ద్వారా వారి పరిశ్రమ ఉన్న ప్రాంతానికి తరలించుకుంటారు .  
కొనుగోలుదారుడు కోరుకున్న నాణ్యత, బొగ్గు సైజు,  చెల్లించిన డబ్బుల ఆధారంగా సి ఎస్ పి వద్ద బంకర్ల నుంచి లారీలలోకి బొగ్గును నింపుతారు. యాజమాన్యం జారీ చేసిన *వే బిల్* ఆధారంగా బొగ్గును తూకం వేస్తారు. చెల్లించిన డబ్బుకు సరిపడా బొగ్గును లారీలో నింపి, వే బ్రిడ్జిపై తూకం వేసి, సంబంధిత అధికారి అనుమతి మేరకు లారీని బయటకు పంపిస్తారు. బొగ్గుతో నిండిన లారీ లో వినియోగదారుడు చెల్లించిన డబ్బు కంటే ఎక్కువ వస్తే, దానిని లారీ నుంచి కోల్ యార్డులో వేస్తారు. తక్కువ వస్తే కోల్ యార్డులో ఉన్న బొగ్గును లారీల్లోకి మనుషుల ద్వారా నింపుతారు. ఈ పని చేయడానికి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు సి ఎస్ పి వద్ద ఉండేవారు. వీరిని లారీ" లోడింగ్, అన్ లోడింగ్" కార్మికులుగా పిలుస్తారు.
 బొగ్గు నింపిన లారీ నుంచి, బొగ్గు తొలగించిన ప్రతి లారీకి కొంత డబ్బును వీరికి కూలీగా చెల్లిస్తారు.
ఒకరోజు మొత్తంలో వచ్చిన సొమ్మును, ఆరోజు పనిచేసిన కూలీలందరూ సమానంగా పంచుకుంటారు.
 
కార్మికులపై పెత్తనం గుండాలదే!

బొగ్గును లారీలలో నింపినా, తొలగించినా లారీ యజమాని ఇచ్చే డబ్బులను మందమర్రి *దొర* ఏర్పాటుచేసిన ప్రైవేట్ సైన్యం (గుండాలు) వసూలు చేసేవారు. వసూలైన సొమ్మును పనిచేసిన వారికి పంచాలి. కానీ వసూలైన సొమ్ములో 80 శాతం కార్మికులకు పంచి, మిగతా 20%  "మామూలు" పేరిట గుండాలు తమ జేబులో వేసుకునేవారు. రోజంతా కష్టపడి, రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్ము, కార్మికుల కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. గుండాల పెత్తనం, పైగా వారు ఏమీ  పనిచేయకుండా డబ్బులు తీసుకోవడంపై కార్మికులు తీవ్రంగా మదనపడేవారు.
ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన కూలీలపై గుండాలు భౌతిక దాడులకు పాల్పడేవారు  . గుండాయిజాన్ని అడ్డుకునే ధైర్యం ఎవరికి ఉండేది కాదు. ఎవరైనా ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా, బాధితులపైనే కేసులయ్యేవి. గుండాలకు మర్యాద జరిగేది.

 ఇక్కడ *దొర* మాటే శాసనం.

లారీ లోడింగ్ అన్ లోడింగ్ కార్మికులు 24 గంటలు ఎండకు ఎండి,వానకు తడిసి, చలికి వణుకుతూ పని చేసినా, కనీసం రెండు పూటలా ఇంటిల్లిపాది బువ్వ తినడానికి  సరిపడా కూలి డబ్బులు రాకపోయేవి. దొర గుండాల అన్యాయాలు, దౌర్జన్యంపై  ప్రశ్నించే వారికోసం ఎదురుచూస్తున్న సమయంలో కార్మిక నాయకులు  వి. టి అబ్రహం, మునీర్ వారికి అండగా నిలిచారు. 

సి ఎస్ పి కాంటా వద్ద దొర గుండాల అక్రమాలపై, దౌర్జన్యం పై వారు పలుమార్లు ప్రశ్నించడం, ఎదిరించడం, హెచ్చరించడం జరిగింది. లారీ లోడింగ్, అన్ లోడింగ్ కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేసి, వారి కనీస హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు.
దొర సామ్రాజ్యంలోకి ఇతరులు రావటం ఒక సాహసమే. వారి అన్యాయాలను ప్రశ్నించడం, నిలదీయడం  ; వారి అహానికి, ఆధిపత్యానికి దెబ్బ తగిలింది. ఎదురు తిరిగిన వారి అంతు చూడడమే గుండాల లక్ష్యం. వారిని ఏరిపారేయడమే  దొర నైజం.
ఇదే పద్ధతిని అబ్రహం, మునీర్ పైన కూడా అమలు చేయాలని అనుకున్నారు . 

సిఎస్పి కాంటా వద్ద గుండాలు గొడవ చేయడం సర్వసాధారణం. కానీ ,  ఆరోజు పథకం ప్రకారం గొడవ సృష్టించి,కార్మిక నాయకుడు అబ్రహం, మునీర్ లకు గొడవ విషయమై ఒక  "ఇన్ఫార్మర్" ద్వారా వారే కబురు పంపారు. ప్రీ షిఫ్టు డ్యూటీ నుంచి వచ్చి ఇంటి వద్దనే ఉన్న మునీర్ కు సమాచారం చేరింది. వెంటనే తన సైకిల్ పై అబ్రహం ఇంటికి వెళ్ళాడు. సహజంగా స్పందించిన అబ్రహం కాంట వద్దకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అబ్రహంను సైకిల్ పై కూర్చోబెట్టుకొని, మునీర్ సైకిల్ తొక్కుతూ కాంటా వైపు బయలుదేరారు. మార్గంలోని యూనియన్ కార్యాలయం వద్ద ఉన్న సంధాని, మల్లేష్, కనుకయ్యతో పాటు మరో నలుగురైదుగురు కూడా వీరి  వెంట బయలుదేరారు.

 కాంటా వద్దకు  చేరుకున్న వెంటనే గుండాలు ఒక్కసారిగా  వీరిపై మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఊహించని దాడి నుంచి   వెంటనే తేరుకొని  కార్మిక నాయకులు ప్రతిదాడికి సిద్ధమయ్యారు. గుండాలు పెద్ద సంఖ్యలో ఉండి , మారణాయుధాలు కలిగి  ఉన్నప్పటికీ భయపడకుండా ఎదురు దాడికి దిగారు. 
కార్మిక నేత అబ్రహం పై గొడ్డలితో దాడి జరగబోతున్న విషయాన్ని గమనించిన మునీర్, తన చేతిలోని సైకిల్నిఎత్తి  పట్టి  అమాంతం  గుండాల పైకి విసిరాడు. అక్కడే ఉన్న సబ్బలితో గుండాల పై  దాడికి పరిగెత్తాడు. గొడవలో అదుపుతప్పి అబ్రహం కిందపడ్డాడు. కింద పడ్డ ఆయనపై అనేకమంది కత్తులు, గొడ్డళ్లు, ఇనుపరారులతో దాడికి దిగారు  .ఇది చూసి మునీర్ అతనికి  రక్షణగా అబ్రహం పై  పడుకుని పోయాడు . అబ్రహంకు తగలాల్సిన దెబ్బలు, మునీర్ కు తగిలాయి. ఇద్దరు చనిపోయారని గుండాలు భావించారు. సి.ఎస్.పి కాంటా వద్ద గుండాలకు, కమ్యూనిస్టులకు జరుగుతున్న గొడవపై కార్యకర్తలకు సమాచారం అందింది.భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో గుండాలు పరారయ్యారు.

అబ్రహం తల, వీపు  మీద గాయాలయ్యాయి. మునీర్ తల పగిలింది, వీపులో గొడ్డలి దిగి, అలాగే ఉంది. ఒంటిమీద ఎక్కడ చూసినా కత్తి, గొడ్డలి గాయాలు.రక్తం కారతూనే ఉంది.
 కార్యకర్తలు హుటాహుటిన, ఇరువురు నాయకులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అబ్రహంకు  తగిలిన గాయాలకు 30 కుట్లు వేశారు. మునీర్ కు 32 కుట్లు వేసి ప్రాథమిక చికిత్స అందించారు. వైద్యులు, సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల ప్రాణాపాయస్థితి తప్పింది.

కార్మిక నాయకుడు అబ్రహం,యువజన నాయకుడు మునీర్ లపై దొర గుండాలు దాడి చేసిన విషయం పట్టణంలో దావానంలా వ్యాపించింది. కార్మికులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఇసుకవేస్తే రాలనంత జనంతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతమంతా ప్రజలతో కిటికిటలాడింది. ఎవరి ముఖంలో చూసినా  ఆందోళనే. దొరగుండాయిజంపై యువకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు శాపనార్ధాలు పెడుతూ, బండ బూతులు తిడుతున్నారు.దొరపై  ప్రతి దాడి చేయాలని యువకులు, విద్యార్థులు బహిరంగంగా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. 
ప్రస్తుత పరిస్థితుల్లో తొందరపాటు వద్దని, ముందు నాయకులను ప్రమాదం నుంచి రక్షించుకుందామని నాయకులు సముదాయిస్తూ వచ్చారు.

మునీర్ తల్లి ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎసిసి సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మిక నాయకుడైన నిజాముద్దీన్ తన కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నాడు. ఈయన మునీర్ కు మామ కూడా!
ఆసుపత్రి లోపల జరుగుతున్న చికిత్స,వారి ఆరోగ్య పరిస్థితి గురించి బయట వేచి ఉన్న ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.ప్రజల నినాదాల జోరు, నాయకుల ఆందోళన మధ్య ఆసుపత్రి వైద్యులు బయటకు వచ్చి, ఇరువురికి ప్రమాదం లేదని ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
 మెరుగైన వైద్యం కోసం అబ్రహాoను వరంగల్ ఎంజీఎం మునీరును బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రికి తరలించారు.

గుండాల దాడికి నిరసనగా భారీ ప్రదర్శన 

6,జనవరి 1979న మందమర్రి భూస్వామి గుండాయిజానికి వ్యతిరేకంగా, కార్మిక నాయకుడు అబ్రహం, మునీర్ పై జరిగిన హత్య యత్నానికి నిరసనగా ప్రదర్శన చేయాలని ఏఐటియుసి, సిపిఐ పార్టీ నిర్ణయించింది. 
వీరిపై దాడికి నిరసనగా మునీర్ పనిచేసే కేకే-5 గని కార్మికులు మొదటి షిఫ్ట్ విధులను బహిష్కరించారు. వీరి బాటలోనే, కేకే-1, కే కే -2  గనులు, వివిధ డిపార్ట్ మెంట్ కార్మికులు విధులను బహిష్కరించి,పెద్ద సంఖ్యలో యూనియన్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు మహిళలు, విద్యార్థులు, యువకులు కూడా భారీ సంఖ్యలో యూనియన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. 

హత్యా రాజకీయాలను అంతం చేద్దాం...

 మందమర్రి దొర గుండాయిజం నశించాలి... అంటూ పట్టణంలో ప్రదర్శన ప్రారంభమైంది. దోషులను కఠినంగా శిక్షించాలి!
 గుండాల్లారా ఖబర్దార్ !...  అంటూ ప్రదర్శన పురవీధుల్లో కొనసాగుతున్నది. దారి వెంట ఉన్న దొర సారా కొట్టు, బ్రాందీ షాపులను ప్రజలు ధ్వంసం చేశారు. ప్రజా ప్రదర్శన మందమర్రి ప్రధాన మార్కెట్ కు చేరుకున్నది. అక్కడ ఉన్న సినిమా హాల్ పై ప్రజలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. తిరిగి ప్రదర్శన మార్కెట్ నుంచి యాపల్ వైపు సాగుతున్నది. ప్రదర్శనలో పాల్గొనే వారి సంఖ్య  కూడా పెరుగుతూనే ఉంది. నినాదాల హోరుతో పట్టణం మార్మోగుతున్నది. 

పోలీస్ కాల్పులు 

ప్రజా ప్రదర్శన మందమర్రి  యాపల్  ఏరియా కి     చేరుకున్నది. అప్పటికే రోడ్డుపై పోలీసు బలగాలు తుపాకులు పట్టుకుని అడ్డా వేసి ఉన్నారు. ప్రదర్శన వీరికి సమీపంలోనికి రాగానే ఎలాంటి హెచ్చరికలు లేకుండా, ఏకపక్షంగా ప్రదర్శనకారులపై పోలీసులు తుపాకులు పేల్చారు. 
పోలీస్ కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. 
 పద్దెనిమిది (18) మందికి తూటాల గాయాలయ్యాయి. ప్రదర్శనకారులు భయంతో పరుగులు తీశారు. 
 ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్న నాయకుడు గుండా మల్లేషన్న పక్కనున్న వ్యక్తి కాల్పుల్లో మరణించాడు.ఆయన తృటిలో తూటా నుంచి తప్పించుకున్నాడు. పోలీస్ కాల్పుల్లో గాయపడిన వారిని, మరణించిన వారిని పోలీసులే హాస్పిటల్ కు  తరలించారు.నాయకులను, ప్రజలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్  కు తరలించారు. అనేక మందిపై పోలీస్ కేసులు నమోదు అయ్యాయి . కాల్పుల్లో గాయపడిన మరో వ్యక్తి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో  మృతి చెందాడు. దీనితో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. అప్పటికే గుండాల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న అబ్రహం,మునీర్ పై కూడా కేసు నమోదు కావడం ఒక విచిత్రం . 

రాష్ట్ర వ్యాప్త బందుకు సిపిఐ పిలుపు 

మందమర్రిలో పోలీసుల ఏకపక్ష కాల్పులు, ప్రజల మరణాలకు నిరసనగా సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్త బందుకు పిలుపునిచ్చింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ సంఘటనపై సిపిఐ ఫ్లోర్ లీడర్ సిహెచ్ రాజేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కడిగిపారేశాడు. 

న్యాయంగా పోతే ఇట్లనే ఉంటది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మునీర్ ను వారి కుటుంబ సభ్యులు పరమార్శించి,కన్నీళ్లు పెట్టుకున్నారు. 
మునీర్ తల్లి అతన్ని   ఓదార్చుతూ ... 
బిడ్డ! న్యాయంగా నడుచుకుంటే ఇట్లనే ఉంటది. 
" ఆప్ కు కుచ్ నహీ హోగా...బే పీకర్ రహీయే.". అంటూ ఆసుపత్రిలో అందరికి ధైర్యాన్ని ఇచ్చింది. 

అమరుల స్థూపావిష్కరణ.

కార్మిక నాయకుడు అబ్రహం, యువజన నాయకుడు మునీర్ ఇరువురు ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. వీరి ఆరోగ్యం కాస్త కుదుటపడిన వెంటనే పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన వారి జ్ఞాపకార్థం, అమరుల స్థూప నిర్మాణాన్ని చేపట్టారు. ప్రజల భాగస్వామ్యం, సిపిఐ సభ్యులు, సానుభూతిపరుల సహకారంతో పట్టణంలో భారీ స్థూపాన్ని విజయవంతంగా నిర్మించారు. ప్రజల సమక్షంలో దాన్ని  ఆవిష్కరించారు. 

(మృతి చెందిన వారి పేర్లను రాయాలి .స్థూపం ఫోటో రావాలి)

బెల్లంపల్లిలో హత్యాయత్నం.

మందమర్రి పట్టణంలో, బొగ్గు గనులపై తన ఆధిపత్యం తగ్గిపోతున్నదని, దీనికి ప్రధాన కారణం మునీర్ కార్యాచరణ  అనే స్థిరమైన అభిప్రాయానికి *దొర*, ఆయన అనుచర గణం వచ్చింది.ఇతడిని అడ్డు తొలగించకుంటే తన ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని దొర అభిప్రాయంగా గూండాలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. సారా, బ్రాందీ దుకాణాల వద్ద తాగిన మైకంలో మునీర్ అంతు చూస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దొరకు అనుకూలంగా పనిచేస్తే అందలం ఎక్కుతాడు.... లేదంటే పాడే ఎక్కుతాడంటూ మునీర్ మిత్రులకు కూడా హెచ్చరికలు పంపుతూనే ఉన్నారు.
బెల్లంపల్లి "కాల్ టెక్స్" సమీపంలోని  ఒక సినిమా టాకీసులో సినిమా చూడటానికి తన మిత్రుడు సారయ్యతో కలిసి (1980 సంవత్సరంలో ) మునీర్ వెళ్ళాడు. మందమర్రి నుంచి బెల్లంపల్లికి వీరు ఇరువురు సైకిల్ పై మ్యాట్నీ షో చూడడానికి వెళ్లారు. వీరు వెళ్తున్న విషయాన్ని గూండాలు గమనించారు.
బెల్లంపల్లిలోని సినిమా టాకీస్ వద్ద కాపు కాసారు.
మునీరు వెంట ఎక్కువ మది మిత్రులు కూడా లేరు, ఇది అనుకూలమైన సమయంగా గుండాలు భావించారు. సినిమా ముగిసి బయటకు వచ్చే టైంలో దాడి చేయాలని పథకం ప్రకారం సినిమా హాల్ వద్ద వేచి ఉన్నారు. సినిమా చూసి బయటకు వస్తున్న మునీర్, సినిమా హాల్ పరిసర ప్రాంతాలలో గుండాలు ఉండటాన్ని గమనించాడు. ఆలస్యం చేయకుండా తన మిత్రుడిని పారిపొమ్మని హెచ్చరిస్తూనే ప్రేక్షకుల్లో కలిసిపోయాడు. మునీర్ పరుగు, గుండాల అరుపులతో ప్రేక్షకులు భయభ్రాంతులకు లోనయ్యారు. ప్రేక్షకులను తప్పించుకుంటూ, గుండాలకు దొరకకుండా విపరీతమైన వేగంతో రైలు పట్టాల వెంట మందమర్రి వైపు పరుగు తీశాడు. ఆయనను గుండాలు వెంబడిస్తూ కత్తులు, గొడ్డళ్లు, ఇనుప రాడ్లు, రాళ్లు విసిరారు. వాటిని తప్పించుకుంటూ, వీరికి అందకుండా పరిగెత్తాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేకపోవడం, వ్యాయామం చేస్తూ శరీరం దృఢంగా ఉండడంతో మునీర్ వేగాన్ని గూండాలు అందుకోలేకపోయారు.
మునీర్ వెంట ఉన్న మిత్రుడు తప్పించుకొని మందమర్రి లోని వారి సహచరులకు సమాచారం అందించాడు. దాదాపు 70 మంది యువకులు యాపల్ సమీపంలోని రైల్వే ట్రాక్ కు చేరుకొన్నారు.అదే సమయంలో మునీర్ అక్కడికి చేరుకున్నాడు. ఆయన వచ్చిన వెంటనే, అందరు కలిసి పట్టణంలోకి వెళ్లారు. భవిష్యత్తులో అప్రమత్తంగా నడుచుకోవాలని ఈ సంఘటనతో గుర్తించారు.
 జైలు జీవితమూ ఒక   పోరాటమే !

 నిజామాబాద్ జైలు

నిజామాబాద్ జైలు చరిత్ర చాలా గొప్పది .  
తెలంగాణా సాయుధ పోరాటం లో పాల్గొన్న మహాకవి  దాశరథి, వట్టికోట ,సర్దార్ని జమలాపురం కేశవరావు లు 1948 లో ఏ జైలు లోనే బంధించబడ్డారు . నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి శిక్ష అనుభవించిన దాశరథి, వట్టికోట జైలు లోపల రచనలు చేశారు . 'నా తెలంగాణా కోటి రతనాల వీణ ' పద్యాలు దాశరథి ఈ జైలు లోనే రాశాడు . 1949 లో దాశరథి రచించిన 'అగ్నిధార కావ్యాన్ని ప్రచురించగా ఇందులో కనీసం సగం కవితలు ఈ జైలు లో రాసినవేనని ,ఆల్వారు స్వామీ 1955 లో ప్రచురించిన 'ప్రజలమనిషి ' నవలలో హీరో కంఠీరవం జైలు జీవితం గురుంచి తెలియ జెప్పిన ఒక అధ్యాయం అంతా ఇక్కడి అనుభవాలేనని చరిత్రకారులు చెపుతున్నారు . హైదరాబాద్ సంస్థానం భారత్ దేశం లో విలీనం ఐయన తర్వాత కూడా దాదాపు 2012 వరకు ఇది జైలు గానే కొనసాగింది .  
 

 మందమర్రి భూస్వామి శ్రీపతిరావు హత్య కేసులో నిందితులుగా పేర్కొన్న మునీర్ తో పాటు మరో 28 మందిని 1982 సంవత్సరం లో నిజామాబాద్ జైలులో పెట్టారు . కోర్టు ఆదేశంతో పోలీసులు  వారిని నిజామాబాద్  జైలు కు    తీసుకువచ్చారు .  జైలు అధికారులు వారిని  తనిఖీ చేసి,లోనికి అనుమతించారు. 
అప్పటికే అక్కడ విచారణ ఖైదీలుగా వివిధ నక్సలైట్ గ్రూపుల నాయకులు సాయినాథ్,  గజ్జల గంగారాం తమ్ముడు గజ్జల కమలాకర్, పోశెట్టి, సమితి ప్రెసిడెంట్ అశోక్, కాంగ్రెస్ నాయకులు ఆఫ్జల్,తోట మధుసూదన్ రావు ఉన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తపాలాపూర్ హత్య కేసు నిందితులు కూడా మునీర్ బృందానికి జైల్లో కలిశారు. వారందరితో కలిసి మాట్లాడడం, చర్చించడం వీరికి ఒక  దినచర్యగా మారింది.

సన్నబియ్యం అన్నం కోసం  నిరాహార దీక్ష

 విచారణ ఖైదీలకు జైల్లో వడ్డించే భోజనంలో పురుగులు వచ్చేవి. దొడ్డు బియ్యం వండి పెట్టేవారు. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన రేషన్ కూడా సక్రమంగా ఇచ్చేవారు కాదు. మంచి భోజనం కోసం మధ్యాహ్నం సమయంలో మునీర్ నేతృత్వంలో నినాదాలు ఇస్తూ , ఆందోళన చేసేవారు . వీరి నిరసనకు జైలు అధికారులు ఏమాత్రం స్పందించలేదు.  పై  అధికారుల దృష్టికి తీసుకురావడం కోసం ఖైదీలు  నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీనితో జైలు అధికారులు దిగివచ్చి సన్నబియ్యం వండుతామని హామీ  ఇచ్చారు.  ఆ హామీతో ఖైదీలు నిరాహార దీక్ష విరమించారు . 
మందమర్రి భూస్వామి హత్య కేసులో నిందితులుగా వచ్చిన వారి సంఖ్య(28) ఎక్కువ. కాబట్టి  ప్రతి విషయానికి అందరు కలిసి , జైలు అధికారులతో వాగ్వివాదానికి దిగేవారు .. వీరి ఐక్యత జైలు సిబ్బందికి పెద్ద తలనొప్పిగా ఉండేది . . 

మోగిన సైరన్ 

నిజామాబాద్ జైలు మధ్యలో నీటి ఫౌంటెన్ ఉంది. మునీర్ మిత్రుడు భోజాలు  మధ్యాహ్నo భోజనం చేసి ఫౌంటెన్ వద్ద కూర్చుని ఉన్నాడు. అక్కడే ఉన్న మరో ఖైదీ కూర్చుని ఉన్నాడు.ఇరువురి మధ్య మాట మాట పెరిగి  అది కొట్లాట కు దారి తీసింది .  ఖైదీలు కొట్టుకుంటున్న విషయాన్ని గమనించిన  జైలు సిబ్బంది అప్రమత్తమయ్యారు. జైలులోని సైరన్ ని  మోగించారు. 
అత్యవసర పరిస్థితిలో మాత్రమే మోగించే సైరన్  శబ్దాన్ని విన్న వెంటనే ఖైదీలు చేస్తున్న పనులను  ఎక్కడివక్కడ నిలిపివేయాలి. వేగంగా వారికి కేటాయించిన బ్యారక్ లోనికి చేరుకోవాలి.అది ;  జైలు నిబంధన . 
సైరన్ విన్న వెంటనే ఖైదీలందరూ తమ తమ బ్యారక్ లకు చేరుకున్నారు.
 1969 వ  సంవత్సరంలో ఒకసారి   మోగిన సైరన్, తిరిగి 1982 లోనే మోగటం ఒక  విశేషం. 

 మునీర్, అబ్రహం, భోజాలు, బాక్సర్ దాస్ మరియు   మరికొందరిని జైలర్ వద్దకు   తీసుకుని వెళ్లారు. 
జైలర్ ముందు ఖైదీల బట్టలు విప్పించారు. అబ్రహం, బాక్సర్ దాసుల సమక్షంలో మునీర్ ను  జైలు సిబ్బంది విపరీతంగా కొట్టారు . మునీరు ఏ తప్పు చేయలేదు.. దయ చేసి  కొట్టవద్దని అబ్రహం,బాక్సర్ దాస్ ఎంత బ్రతిమాలినా , జైలు సిబ్బంది వినిపించు కోలేదు . 
 కళ్ళకు గంతలు కట్టి మరీ  కొట్టారు .  ఆ తర్వాత మునీర్ ను ఒక  చీకటి గదికి తరలించారు .దాన్ని జైలు భాష లో 'గంజి ' అంటారు 
అప్పటికే హత్య కేసు విచారణ పేరిట, పోలీసులు కొట్టిన దెబ్బలకు  మునీర్  ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది.  మల విసర్జన చేసే సమయంలో అతనికి మలంతో పాటు రక్తం  పడేది . 


చీకటి గది (గంజి ) లో నిరాహార దీక్ష 


 ఎక్కువ తప్పులు చేసిన వారిని, అత్యంత వివాదాస్పద వ్యక్తులను చీకటి గదిలో బంధించటం జైలులో ఒక సంప్రదాయం .ఈ గదిలో ఖైదీతో పాటు  ఇతరులు ఎవరూ  ఉండరు. ఒంటరిగానే ఉండాలి . గదిలోకి కొద్దిపాటి  గాలి మినహా ఎలాంటి  వెలుతురు రాదు. మలమూత్రాల విసర్జన కూడా అక్కడే చేయాలి. కూర్చోవడం మినహా  అక్కడ నిటారుగా నిలబడలేము. గది ఎత్తు నాలుగు ఫీట్ల (అడుగులు ) లోపు ఉంటుంది. 
అలాంటి చీకటి కొట్లో  బంధించడం, మునీర్  పౌరుషాన్ని మరింత రెచ్చగొట్టింది . 
నన్నెందుకు కొట్టారో చెప్పాలి అంటూ అదే  చీకటి గదిలో నిరాహార దీక్షకు దిగాడు. 
నన్ను కొట్టడానికి అసలు  కారణం చెప్పాలని భోజనం తెచ్చిన పోలీసులతో వాదనకు దిగాడు. 
అన్నం తినను, నీళ్లు తాగను..  అంటూ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. మునీర్ వద్దకు పోలీసులు రావడానికి ప్రయత్నించారు. పోలీసులను గదిలోకి రాకుండా అడ్డుకోవడానికి అన్నం తెచ్చిన సత్తు ప్లేటును (అల్యూమినియం గిన్నెను) ముక్కలుగా విరిచాడు.  దగ్గరకు వస్తే కోసుకుని చచ్చిపోతాను అంటూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయం ఇతర ఖైదీలకు, వారి ద్వారా జైలు బయట ఉన్న వ్యక్తులకు తెలిసింది. 
*ద హిందూ* ఇంగ్లీష్ దినపత్రికలో నిజామాబాద్ జైలులో ఖైదీ నిరాహార దీక్ష అంటూ వార్తా వచ్చింది. దీనితో జైల్లో జరిగిన సంఘటనపై విచారణ చేయడానికి రాష్ట్ర జైలు అధికారి రెడ్డి వస్తున్నారని మునీర్ కు  ఎవరో సమాచారం చేరవేశారు. ఇప్పటికైనా దీక్ష విరమించమని జైలర్ అబ్రహం ద్వారా మునీర్ కు చెప్పించారు. అబ్రహం  మాటతో మునీర్ గది నుండి బయటకు రావడానికి అంగీకరించాడు. 'గంజి' నుంచి బయటకు స్వతహాగా నడుచుకుంటూ రాలేకపోయాడు. పోలీసుల సహాయం లేకుండా  నడవ లేక పోయాడు.
 పోలీస్ దెబ్బలకు కాలి వేళ్ళు పగిలి రక్తం గడ్డకట్టింది.  పోలీసులు కొట్టిన దెబ్బలకు వీపులో  చర్మం కందిపోయింది. ఒంటినిండా గాయాలయ్యాయి. జైలు ఆసుపత్రిలో చికిత్స చేయించి మునీర్ ను  బ్యారక్ లోకి  తరలించారు. 
నాలుగు రోజుల తర్వాత 'షేనాకత్ పరేడ్' (గుర్తింపు ప్రక్రియ) చేపడతామని ముందుగానే మునీరుకు సమాచారం ఇచ్చారు.
షేనాకత్ పరేడ్ లో కొట్టిన జైలు సిబ్బందిని గుర్తించవద్దని, మీరు గుర్తిస్తే, మా ఉద్యోగాలు పోతాయని, కుటుంబాలు ఆగమవుతాయని జైలు సిబ్బంది స్వయంగా మునీర్ ను వేడుకున్నారు.  కాని  ,మునీర్ వారికి  ఏలాంటి వాగ్దానం  చేయలేదు . మునీర్ మొండితనం  జైలు సిబ్బందిలో మరింత  భయాన్ని  పెంచింది. 
పరేడ్ జరగటానికి  ముందు  రోజు  సాయంత్రం జైలు సిబ్బంది తో పాటు  వారి  భార్యాపిల్లలు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, కుటుంబీకులు అందరూ మునీర్ వద్దకు వచ్చారు. తమ దుఃఖ పూరిత ముఖాల్ని చూసి , తమ కుటుంబాలను ఆదుకోవాలని, తమ వాళ్లను గుర్తించవద్దని ప్రాధేయపడ్డారు. వీరికి కూడా మునీర్ నుంచి ఎలాంటి  స్పష్టమైన హామీ దొరక లేదు.
విచారణాధికారి రెడ్డి నిర్ణీత సమయానుసారం జైలుకు చేరుకున్నాడు.
 నిజామాబాద్ జైలులో పనిచేసే మొత్తం 
 సిబ్బందిని ఒక వరుసలో నిలబెట్టారు.
అనంతరం మునీర్ ను పిలుచుకు రావాలని ఆజ్ఞాపించాడు. ఆయన ఆదేశంతో మునీర్ ఉన్న గది వద్దకు వెళ్లి  అతన్ని విచారణ గదికి తీసుకువచ్చారు. 
 బ్యారక్ నుండి వచ్చే సమయంలో  జైలర్   అబ్రహం కూడా జైల్ పోలీసులను క్షమించమని మునీర్  ను  కోరాడు.  కాని , ఆయనకు కూడా ఎలాంటి  స్పష్టత ఇవ్వకుండా నడుచుకుంటూ మునీర్  విచారణ గదికి వచ్చేసాడు . 
జైలు సిబ్బంది వరుస క్రమంలో నిలబడి ఉన్నారు. వారి వేపు చేయి చూపిస్తూ , వారిలో మిమ్మల్ని కొట్టిన వాళ్లు ఎవరో గుర్తించాలని విచారణాధికారి మునీర్ ను కోరాడు . జైలు సిబ్బందిని మునీర్   నిశితంగా పరిశీలించాడు . అనంతరం ,  విచారణాధికారి వైపు తిరిగి ..
 "వీళ్ళు ఎవరూ  నన్ను కొట్టలేదు " అని  చెప్పాడు 
జైలులో పనిచేసేది మొత్తం  వీళ్లే  మరి ! ఇక వీళ్లే  నిన్ను కొట్టనప్పుడు, మరెవరు కొట్టి ఉంటారని  విచారణ అధికారి ఆశర్యం తో తిరిగి ప్రశ్న  వేశాడు 
" ఏమో ", అన్నాడు  మునీర్ . 
అక్కడి నుండి  మునీర్ తో పాటు అందరూ వెళ్లిపోయారు. తిరిగి విచారణ అధికారి మునీర్ ను తన  దగ్గరకు  పిలుచుకున్నాడు. మునీర్ తో విడిగా మాట్లాడాడు . 
 "నీవు కమ్యూనిస్టువు, గొప్ప మానవతా వాదివి " అంటూ ప్రశంసించాడు.
 గొప్ప నాయకుడిగా ఎదుగుతావని  చెప్పి  భుజం తట్టి వెళ్లిపోయాడు.

ఉరిశిక్ష పడేటోడికి  పెండ్లి పిల్ల 

ఒకరి పట్ల ఈర్ష్య, ద్వేషం, పగ, సాధింపు ఉండరాదని "షేనాకత్" సందర్భంగా అప్పుడెప్పుడో  అమ్మ చెప్పిన మాటలు మునీర్ కు  జ్ఞాపకం వచ్చాయి. 
 తనను అంత నిర్దాక్షిణ్యంగా   కొట్టిన జైలు సిబ్బందిని అందుకే అంత "ఈజీ' గా  క్షమించ గలిగాడు . తనను వారెవ్వరూ  కొట్టలేదని అబద్దం  చెప్పాడు .
షేనాకత్ పరేడ్ లో మునీర్ వ్యవహరించిన తీరు జైలు సిబ్బందిలో, వారి కుటుంబాలలో  ఎంతో మార్పు ని తీసుకు వచ్చింది . జైలు సిబ్బంది  అందరూ మునీర్ అభిమానులుగా మారిపోయారు. ఈ సంఘటనతో సిబ్బంది  తమ ఇంటి నుంచి  భోజనం, టిఫిన్స్ తెచ్చి మునీర్ మరియు అతని మిత్రులకు ఇవ్వడం ప్రారంభించారు.
ఖైదీగా ఉన్న మునీర్ కు జైలు సిబ్బందికి మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. మునీర్ వ్యక్తిగత వివరాల ను  జైలు సిబ్బంది సేకరించారు.
  ముస్లిం మతానికి చెందిన ఒకాయన తమ  అమ్మాయిని  మునీర్  కి  ఇచ్చి పెళ్లి చేయడానికి ముందుకొచ్చాడు . 
ఖైదీగా ఉన్న వ్యక్తి, అందులోనూ హత్య కేసు నమోదై ఉంది.చాలా కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. అన్ని విషయాలు తెలిసి కూడా మునీర్ కు పిల్లను ఇవ్వటానికి ముందుకు రావడం అంటే  అదీ    మునీర్  వ్యక్తిత్వం. . 
అయితే ,మునీర్ సహచరులు మాత్రం  "ఉరిశిక్ష పడేటోడికి  పెండ్లి పిల్ల కావాలంట"..  అంటూ  
"బనాయుంచే" వారు . 

గ్యాంగ్ లీడర్ మునీర్ 

గాంధీ జయంతి సందర్భంగా  నిజామాబాద్ జైలులో ఖైదీలకు సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించారు. మునీర్ బృందం ఒక  నాటకం వేయడానికి ముందుకు వచ్చారు. ప్రజానాట్యమండలి కళాకారుడుగా పనిచేస్తున్న భోజాలు వీరితోనే ఉన్నాడు.
 "భారత్ లో దొంగ" అనే నాటిక వేయటానికి సంసిద్ధులయ్యారు.ఇందుకోసం రిహార్సల్స్ చేశారు. అందులో పాత్రధారులుగా;
దొంగ-మునీర్, 
దొంగ తండ్రి - లక్ష్మణ్,
 దొంగ తమ్ముడు- అశోక్,
 భూస్వామి - గజ్జల కమలాకర్, 
గుండాలు -- బోజాలు,అఫ్జల్
 కారోబార్ - దొంతుల రాజo, 
 మరియు 
రచయిత - అబ్రహం, 
దర్శకుడు గా  తోట మధుసూదన్ పనిచేశారు.

 నాటిక కథా  సారాంశం

 బాగా చదువుకుని పట్నంలో ఉద్యోగం చేయాలనే ఆశయంతో ఒక  గ్రామీణ యువకుడు చిన్ననాటి నుంచి కలలు కనేవాడు. పట్టుదలతో చదివి పీజీ పూర్తి చేశాడు. ఉద్యోగం వేటలో పట్నం వెళ్ళాడు.పట్నంలో తెలిసిన వాళ్ళు ఎవరూ  లేరు. ఉదయం పూట వివిధ ప్రాంతాలలో తిరిగి  , తిరిగి , రాత్రి పార్కులో బెంచ్ పై పడుకుంటాడు. రాత్రిపూట పెట్రోలింగ్ చేసే పోలీసుల కంటబడతాడు ఆ  యువకుడు . పార్కులోని బెంచి పై పడుకొని ఉన్న అతన్ని   నిద్రలేపి పొలిసు ప్రశ్నలు వేస్తారు .  యువకుడి సమాధానాలు సరిగానే ఉన్నా ,అతని  వద్ద ఉన్న డబ్బులు కాజేయాలనే దురుద్దేశంతో పోలీసులు లంచం అడుగుతారు. 
"నా దగ్గర డబ్బులు లేవు, ఉద్యోగం కోసం వచ్చాను. పేదవాడను", అని ఎంత బతిమాలినా  పోలీసులు వినిపించుకోరు. పైగా "దొంగ" అని ముద్ర వేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తారు. 

బ్యాక్ గ్రౌండ్ లో *ఊరిడిసి నే పోతునా.. ఉరి పెట్టుకుని చచ్చిపోతునా" అంటూ యువకుడి కష్టాన్ని తెలిపే పాట వస్తూ ఉంటుంది.
 గ్రామ భూస్వామికి ఈ వ్యవహారం తెలిసి, ఆయన పోలీసులతో సంప్రదించి, యువకుడిని విడిపిస్తాడు గ్రామం ఇతివృత్తంగా సాగే ఈ నాటికలో భూస్వామి, ఆయన అనుచరులు, సిబ్బంది వ్యవహారం. పట్టణంలో పేదల పరిస్థితి, పోలీసుల పనితీరు, పోలీసులతో భూస్వామి సంబంధాలు, ఈ నాటికలో  కొట్టొచ్చినట్టు కనబడతాయి. 

గాంధీ జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా జడ్జి   మునీర్ గ్యాంగ్ ప్రదర్శించిన నాటికకు ఉత్తమ నాటికగా బహుమతి ప్రకటించాడు . నటీనటులను జడ్జి చాలా మెచ్చుకున్నాడు.  .
" కోర్టులో కేసుల విచారణ ; సాక్షులు , కాగితాలపై ఆధారపడి మాత్రమే  నడుస్తాయని, విశ్వాసానికి  నమ్మకానికి తావు ఉండదని మరియు  వ్యక్తిగతంగా  జడ్జీలకు రాగద్వేషాలు ఉండవని " జడ్జి ఇచ్చిన సందేశాన్ని మునీర్  ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటాడు.

జైలు సిబ్బంది కొట్టిన దెబ్బలకు, మునీర్ ఒంటిపై ఏర్పడిన గాయాలు పూర్తిగా నయం కాలేదు.ముఖ్యంగా వీపు భాగంలో మూడు నెలల తర్వాత కూడా గాయం పచ్చిగానే ఉంది.అప్పటికే వీరిపై వివిధ కోర్టులలో నమోదైన 18 కేసుల వాయిదాలకు మునీర్ గ్యాంగును హాజరు పరచడం లేదు. ఆరోగ్యం కొంత మెరుగైన తర్వాత వీరిని లక్షెట్టిపేట కోర్టులో హాజరు పరిచారు.

 " మాకొద్దు   ఈ   నిజామాబాద్ జైలు"

కేసు వాయిదా ప్రకారం మునీర్ తో పాటు మిగతా 28 మందిని లక్షెట్టిపేట కోర్టు జడ్జి ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. వీరి హాజరును పరీక్షించారు. కేసు మళ్లీ వాయిదా తేదీని జడ్జి ప్రకటించే సమయంలో
 "సార్ ! నాకు ఒక్క  నిమిషం మాట్లాడే అవకాశం ఇవ్వండి " అని   జడ్జిని మునీర్ కోరాడు  అందుకు జడ్జి సమ్మతించాడు . 

"సార్ ! మేము నిజామాబాద్ జైలుకు వెల్లము. దయచేసి మమ్ములను వరంగల్ జైలుకు పంపండి."
 "ఎందుకోసం  ?" అని  జడ్జి అడిగాడు 

 సార్ !  మిమ్మల్ని మీ ఛాంబర్ లో కలిసే అవకాశం ఒక్కసారి  ఇప్పించండి ! " అని  జడ్జిని ప్రాధేయ పడ్డాడు మునీర్ . 

 జడ్జి  చాలా  సానుకూలంగా స్పందించాడు .

 కోర్టు భోజన విరామ సమయంలో జడ్జిని, వారి చాంబర్ లో మునీర్  ఒంటరిగా కలిశాడు. నిజామాబాద్ జైలులో జరిగిన గొడవ,విచారణ విషయాలు  అన్నీ పూర్తిగా వివరించి చెప్పాడు .  తన ఒంటిపై ఉన్న గాయాలు, కాలుకు తగిలిన దెబ్బలు చూపించాడు.

 " దయచేసి నిజామాబాద్ జైలుకు పంపించవద్దని   విన్నవించుకున్నాడు . 
మునీర్  వాదనతో జడ్జి ఏకీభవించాడు .

   ఈ కేసులోని  ముద్దాయిలను వరంగల్ జైలుకు తరలించాలని జడ్జి  ఆర్డర్ జారీ చేశాడు .   మునీర్ అతని మిత్రులు ఎంతో సంతోషించారు. 
వీరందరినీ లక్షిట్టిపేట కోర్టు హాల్ నుంచి నేరుగా వరంగల్ జైలుకు  తరలించారు.

కోర్టు వాయిదా లో బిర్యాని పండుగ  

కోర్టు వాయిదాలకు హాజరయ్యే ఖైదీలకు వారి బంధువులు, మిత్రులు తీసుకువచ్చిన భోజనం, పండ్లు తినడానికి అవకాశం ఉండేది.  కోర్టు వాయిదాల తేదీని  ముందుగానే తెలుసుకొని బంధుమిత్రులు, కుటుంబీకులు వీరిని కోర్టు వద్ద కలుసుకోవడానికి ఎదురు చూసేవారు. పోలీస్ ఎస్కార్ట్ తో వచ్చిన తమ ఆత్మీయులను చూసి కంటతడి పెట్టుకునేవారు. పోలీసులను బ్రతిమాలి  ఖైదీలకు దగ్గరగా కూర్చుని మాట్లాడేవారు. యోగక్షేమాలు తెలుసు కునేవారు. ఆ సందర్భంలోనే ఇంటి నుండి తెచ్చిన భోజనం, పిండి వటలు, పండ్లు, ఫలహారాలు, సిగరెట్లు, బీడీలు ఖైదీలకు ఇచ్చేవారు.
మునీర్ తల్లి     హలీమా బేగం, మునీర్ తో పాటు జైలు లో  ఉన్న 28 మందికి సరిపడా బిర్యాని వండుకుని పెద్ద గంజు (వంట పాత్ర ) లో తీసుకువచ్చేది. మిగతా ఖైదీల బంధువులు తీసుకువచ్చే భోజనాలను అందరు కలిసి పంచుకొని, తినేవారు.

కమ్యూనిస్టుల అడ్డా... వరంగల్ జైలు

వరంగల్ జైలులో మునీర్ తో పాటు మరో  తొమ్మిది మందికి బెయిల్ రాలేదు. రెండున్నర సంవత్సరాలు వరంగల్ కేంద్ర కారాగారంలో ఉండాల్సివచ్చింది . 
జైలు, వీరికి కొత్త ప్రపంచాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగించింది. అనేక కొత్త విషయాలను నేర్పింది .సమాజం పట్ల  వారి  బాధ్యతను గుర్తు చేసింది . 

. జైలు శిక్షలకు గురయ్యేది , విచారణ ఖైదీలుగా జైల్లోనే మిగిలి  పోయేది నిజంగా   నిరుపేదలు లేదా  కింది కులాల వారు  మాత్రమే ! ఈ సత్యం జైలు జీవితం లో అనుభవం లోకి వచ్చింది . 

 వరంగల్  జైల్లో నక్సలైట్ నాయకులు, నక్సలైట్  సానుభూతిపరులుగా పోలీసులు పేర్కొన్న వారందరినీ ఒకే బ్యారెక్.లో కలిపి ఉంచుతారు. దానిని నక్సల్  బ్యారక్ గా పిలిచేవారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా  పెద్ద సంఖ్యలో జైలుకు వచ్చేవారు.
జైలులో వార్తాపత్రికలు, పుస్తకాలు చదువుకునే అవకాశం ఉండేది. ఆటలు ఆడుకోవడానికి సమయం ఇచ్చేవారు. జైల్లో ఉన్న అవకాశాన్ని మునీర్ సద్వినియోగ పరుచుకున్నాడు. జైల్లో ప్రపంచ రాజకీయాలు, వివిధ దేశాల స్థితిగతులు, సామాజిక వ్యవహారాలు వైజ్ఞానిక  విషయాలపై వాదనలు, చర్చలు విస్తృతంగా కొనసాగేవి. మిత్రులకు, బంధువులకు, ఆప్తులకు ఉత్తరాలు రాసుకునే అవకాశం ఉండేది. పాటలు పాడేవారికి అక్కడ  అడ్డే లేదు.
నక్సల్ బ్యారక్ నుండి పాటల ఊట జాలు పారేది.  ఒక వ్యాపకం ఏర్పాటు చేసుకుంటే, జైలు జీవితాన్ని ఖైదీలు ఆనందంగా గడపవచ్చు. దోస్తానా ఉంటే జైలు కూడా ఇల్లు లాంటిదే. మన ప్రవర్తనతో మిత్రులను సంపాదించుకోవాలి, కాపాడుకోవాలి, బాధ, దుఃఖం, ఆవేశం, ఒంటరితనం అసహనం, కసి, పగ రగిలిపోయే రకరకాల వ్యక్తుల మధ్య జీవనం కొనసాగించాల్సి ఉంటుంది. ఇది ఒక రకమైన మరుపురాని, మర్చిపోలేని అనుభవాన్ని ఇస్తుంది.

మందమర్రి లో గుండాల దాడి, హత్య కేసు విచారణ సందర్భంగా పోలీసు చిత్రహింసలు, నిజామాబాద్ జైల్లో  సిబ్బంది దాడితో మునీర్ ఒంటి మీద  గాయాలు  లేని చోటు లేదంటే అతిశయోక్తి కాదు . .మరిన్ని దెబ్బలను తట్టుకునే స్థితి శరీరానికి లేకుండా పోయింది. 
గుండె, మనసు రెండు గట్టివి కాబట్టి ఇంకా మన మధ్య జీవించి ఉన్నాడు.కాని, ఇటీవల ఆ గుండెకూ  గాయమైయుంది . 

               జైలులోని ఖైదీలతో మాట్లాడేందుకు కాకతీయ వైద్య విద్యార్థులు, వరంగల్ న్యాయవాదులు, న్యాయవిద్యను అభ్యసించే విద్యార్థులు వచ్చేవారు. వరంగల్ సీనియర్ న్యాయవాది జంగా భద్రయ్య, న్యాయ విద్యార్థిగా ఉన్న బోయినపల్లి వినోద్ తరచుగా మునీర్ బృందాన్ని కలిసేవారు.

హైదరాబాద్ దాదా కొత్త దాస్ వివాదం 

హైదరాబాద్ సిటీలో  పెద్ద దాదాగా పేరున్న కొత్తదాసును కూడా వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు. అతను  పలు కేసులలో విచారణ ఎదుర్కొంటున్నాడు . కొత్త దాసును మొదట హైదరాబాద్ లోని చంచల్ గూడా జైలులో ఉంచారు. జైలు కేంద్రంగా  అతడు తన కార్యకలాపాలను  యధేచ్ఛగా కొనసాగించే   వా డు. తరచుగా సిబ్బందితో గొడవ పడేవాడు. అతని  ప్రవర్తనతో విసుగెత్తిన జైలు సిబ్బంది అతడ్ని హైదరాబాద్ నుంచి వరంగల్ జైలుకు తరలించారు. 
 ఒక కేసు వాయిదాకు కొత్తదాసును కోర్టులో హాజరు పరచడానికి  వరంగల్ నుంచి హైదరాబాద్ తీసుకువెళ్లారు. తిరిగి వరంగల్ జైలుకు వచ్చే సమయంలో , కొత్త దాసు కు, పోలీసులకుమధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు కొత్తదాసును విపరీతంగా కొట్టారు. తుపాకీ బానెట్ తో పొడిచారు. రక్తపు మడుగులో తీసుకువచ్చి, జైలు గదిలో పడేశారు. దీనిని చూసి మునీర్ తట్టుకోలేకపోయాడు. కొత్త దాస్ పై పోలీసుల దాడి కి నిరసనగా ఆందోళన చేశాడు . కొత్తదాసును కొట్టిన సంఘటనపై పిటిషన్ రాసి జైలు అధికారులకు పంపించాడు. ఈ విషయం తెలిసి పిటిషన్ రాసిన మునీర్  ని  కలవమని ప్రముఖ నక్సలైట్ నాయకుడు రవూఫ్ కబురు పంపించాడు.

రవూఫ్ తో పరిచయం

కొత్త దాస్ పై పోలీసులు జరిపిన దాడికి వ్యతిరేకంగా స్పందించిన తీరు, ఉన్నతాధికారులకు రాసిన పిటీషన్ చూసి జైలులోని ప్రముఖులు మునీర్ ని  ప్రశంస లతో ముంచెత్తారు . 
ఖైదీల నుంచి భారీగా అభినందనలు వచ్చాయి. 
సిపిఐ ఎంఎల్ నాయకుడు రవూఫ్ కు న్యాయ శాస్త్రంలో ప్రవేశం ఉంది. కొత్త దాస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ మునీర్   పిటిషన్ లో పేర్కొన్న ముఖ్యమైన పాయింట్లు   చూసి  ఆశ్చర్య చకితుడయ్యాడు..
అందుకే  మునీర్ ను కలవమని ప్రత్యేకంగా  కబురు పంపించాడు. 
ఆయన రాగానే కరచాలనం చేసి, కూర్చోమన్నాడు. మునీర్ కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఏం చదువుకున్నావని అడిగాడు, న్యాయ శాస్త్రంలో ప్రవేశం ఉందా అని ఆరా తీశాడు . 
"లేదు", అని మునీర్ ముక్తసరిగా  సమాధానం ఇచ్చాడు. దీంతో ఆయన ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఒక క్రమ పద్ధతిలో, ఇంగ్లీషులో  పిటిషన్ ఎలా రాయగలిగావని ప్రశ్నించాడు.

 మందమర్రి ప్రాంతంలో కార్మిక నాయకుడిగా పనిచేస్తున్న వి టి అబ్రహం తో ఉన్న సహచర్యం, ఆయనతో కలిసి పనిచేయడం ఒక కారణం . .తాను ఉద్యోగం చేసే పని స్థలంలో సహోద్యోగి ఆంగ్లో ఇండియన్ లవ్ లిన్ అనే  క్లర్క్ తో ఉన్న స్నేహం మరో కారణం . వారు మాట్లాడే భాష, రాసే పద్ధతి నచ్చి నేర్చుకున్నానని చెప్పాడు
మునీర్ నిజాయితీ కి , ధైర్యానికి ఆయన  ఎంతో ముచ్చట పడ్డాడు ఆ తర్వాత వీరి మధ్య స్నేహం జైల్లో ఉన్నంతవరకు కొనసాగింది. అనేక విషయాలపై ఇరువురు చర్చించుకునేవారు.

రాఖీల రికార్డు...

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీల పండగ ఒకటి  మునీర్ కు జీవితాంతం  మరుపురాని అనురాగాన్ని మిగిల్చింది. అతను  జైల్లో ఉన్నప్పుడు  వచ్చిన   రాఖీల పండగ   సందర్భంగా  ఒక్క కోల్ బెల్ట్ ప్రాంతం నుంచే  దాదాపు మూడు వందల యాభై మూడు  (353 )రాఖీలు  పోస్టు ద్వారా జైలుకు వచ్చాయి. 
ముస్లిం మతస్థుడికి ఇంత పెద్ద సంఖ్యలో ఆడబిడ్డలు రాఖీలు పంపడం జైల్లో సంచలనంగా మారింది. 
రాఖీ పండుగ నాడు స్వయంగా ఆశీర్వదించడానికి  పెద్ద  సంఖ్యలోఆడబిడ్డలు రాఖీలు తీసుకొని భర్త పిల్లలతో, తల్లిదండ్రులతో కలిసి  జైలుకు  రావటo మరో విశేషం.
మునీర్ కు వచ్చిన రాఖీల విషయం తెలుసుకొని, జైలు అధికారి రియాజ్ అహ్మద్ ఆయనను తన చాంబర్ కు పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. ఇన్ని రాఖీలు జైల్ లోని ఒక వ్యక్తికి రావడం, అందులోనూ ముస్లిం మతస్థుడికి రావడం జైలర్, జైలు సిబ్బందిని కూడా ఆశ్చర్య  పరిచింది. ఈ రాఖీల పరంపరను చూసిన తర్వాత జైలులోని ఖైదీల అందరికీ రాఖీలు పంచాలని జైలర్ నిర్ణయించుకున్నాడు. జైలర్ సొంత డబ్బులతో మరో 350 రాఖీలు తెప్పించి, మునీర్ పేరుమీద అందరికీ కట్టించాడు.  జైలు చరిత్రలో ఇది   ఒక మర్చిపోలేని సంఘటన.

ఆదుకున్న న్యాయవాదులు...

కేసు గెలవటం కోసం  కోర్టుకు వచ్చే  ప్రతి వాళ్లకి  న్యాయవాదులకు భారీ మొత్తం లో  ఫీజులు చెల్లించటం ఒక తప్పనిసరి పరిస్థితి . 
మునీర్ నిందితుడిగా కోర్టు మెట్లు ఎక్కిన లక్షెట్టిపేట కోర్టు న్యాయవాదుల నుండి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ క్రిమినల్ లాయర్ గా పేరుపొందిన సి.పద్మనాభరెడ్డి, ప్రముఖ పౌర హక్కుల నాయకుడు కె జి కన్నాభిరాన్, చల్లా నర్సింహా రెడ్డి లాంటి న్యాయవాదులు మునీర్ క్రమశిక్షణకు, నిజాయితీకి ముగ్దులయ్యేవారు. 
కేసు వాయిదాలకు   హాజరు కావడానికి కూడా డబ్బులు లేని స్థితి మునీర్ ది.
 ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడే మునీర్ కు న్యాయవాదులే తొవ్వ ఖర్చులు, తిండి ఖర్చులు సమకూర్చేవారు.
న్యాయవాదులకు ఫీజు ఇవ్వాలని ఒక్కరు కూడా అడగకపోవడం  ఆ న్యాయవాదుల మంచితనం, మానవత్వానికి నిదర్శనం. 
హైకోర్టులో హత్య కేసు వాదనలకు వచ్చిన సందర్భంగా కేసు పై ఇచ్చిన నోట్ చూసి క్రిమినల్ లాయర్ పద్మనాభ రెడ్డి గారు ఆశ్చర్యపోయారు. ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్. కె ప్రోగ్రాంలో ప్రముఖ న్యాయవాది కె జి కన్నబిరాన్ తనకు ఇష్టమైన క్లయింట్ ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు, "ఇద్దరు ఉన్నారని, అందులో ఒకరు మునీర్" అని పేర్కొనటం చాలా పెద్ద  విశేషం.

గుండె పిండిన విషాదం అది...

చేయని తప్పుకు జైల్లో నిర్బంధించబడిన తన సహచరుడు బోజాలు కొడుకు చనిపోయాడని కబురు వచ్చింది. తనకు తల కొరివి పెట్టవలసిన కొడుకే చనిపోయాడని, కనీసం ఆఖరి చూపుకు కూడా నోచుకో లేకపోయానని గుండెలు బాదుకుంటూ, ఏడ్చిన తీరు తాను ఎన్నటికీ మర్చిపోలేన ని  అంటాడు మునీర్ . మరో మిత్రుడు కనకరాజు భార్య కూడా అనారోగ్యంతో మరణించింది. కనకరాజుకుఈ దుర్వార్త ఎలా చెప్పాలో, ఎవరితో చెప్పించాలో అనే విషయమై జైలు సహచరులందరూ చాలాసేపు చర్చించుకున్నారు.
చివరకు అందరూ చుట్టూ చేరి, ఒకరి తర్వాత ఒకరుగా ఆ మాట, ఈ మాట చెబుతూ భార్య చనిపోయిన విషయం చెప్పారు. ఆ బాధను తట్టుకోలేక కనకరాజు గావు కేక పెట్టి, బిగ్గరగా ఏడుపు మొదలుపెట్టాడు. పెళ్లినాటి నుంచి భార్యాభర్తల మధ్య జరిగిన సంఘటనలను నెమరు వేసుకుంటూ ఏడ్చిన తీరు, కళ్ళముందు కదలాడుతుందని ఆత్మీయుల వద్ద చెబుతూ కంటనీరు పెట్టుకుంటాడు. ఒక  ఖైదీ జీవితం ఎలా   వుంటుందో అప్పుడే  అర్థమైందని చెబుతాడు.

14, డిసెంబర్ 2024, శనివారం

మందమర్రి భూస్వామి హత్య.

మందమర్రి దొర, భూస్వామి శ్రీపతిరావుకు వందల ఎకరాల భూములు, ఆస్తులు,పశువులు కలిగి వుండేవాడు . పాలేర్లు జీతగాళ్లు పెద్ద సంఖ్యలో ఆయన వద్ద పనిచేసేవారు. సమీప ప్రాంతంలోని సారా దుకాణాలు ఆయన ఆధ్వర్యంలోనే నడిచేవి.అన్ని దొర గడీల లాగానే ఈయన గడి ముందు నుంచి కూడా ప్రజలెవరు తలపాగా చుట్టుకొని కాని ,చెప్పులు తొడుక్కొని కాని  తలెత్తి నడవడానికి వీలులేదు . అది దొరల రాజ్యం . 
 కచ్చీరు గద్దెపై ఎవరు కూర్చుని ఉన్నా  , లేకున్నా అటువైపు నుంచి నడిచే ప్రజలు తలపాగా తీసి, చెప్పులు చేతిలో పట్టుకొని, కచ్చీరు గద్దెకు నమస్కరిస్తూ,వంగి,వంగి నడుచుకుంటూ వెళ్లాల్సిందే! ఇందుకు విరుద్ధంగా నడిస్తే , వారికి తిట్లు, దెబ్బలు తప్పేవి కావు .   దొర ప్రయాణించే సవారి కచ్చురం ఊరు మందమర్రి నుంచి బయలుదేరిందంటే ఆ రోడ్డు వెంట ఎవరు ఎదురుగా రాకూడదు.
దొర ప్రయాణించే బండికి కట్టిన ఎద్దు మెడలోని గంట శబ్దం విని ప్రజలు దారి నుంచి తప్పుకొని, తలవంచుకొని రోడ్డు పక్కన నిలుచునేవారు. ప్రభుత్వ అధికారులు, శాసనాలు చేసే ప్రజాప్రతినిధులు కూడా ఈయన మాటను ధిక్కరించేవారు కాదు.
మందమర్రి పట్టణ నడిబొడ్డున ఆయనకు శ్రీకృష్ణ సినిమా టాకీస్ ఉండేది. సినిమా టాకీస్ కేంద్రంగా ఆయన కార్యకలాపాలు కొనసాగేవి. మందమర్రితో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా దొర అనుచరుల, మిత్రుల, గూండాల స్వైర విహారం ఏమాత్రం  అడ్డు, అదుపు లేకుండా కొనసాగేది.
మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం సిపిఐ(కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా )   అనుబంధ సంస్థ  సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్  పనిచేస్తున్నది.  కమ్యూనిస్టు పార్టీ అప్పుడప్పుడేమందమర్రి,బెల్లంపల్లి, మంచిర్యాల, లక్షెట్టిపేట, ఆసిఫాబాద్, చెన్నూరు, నెన్నెల ప్రాంతాలలో  బలపడుతున్నది.
కమ్యూనిస్టు పార్టీ శాఖలను గ్రామ, గ్రామాన బలోపేతం చేస్తూ, మందమర్రి, రామకృష్ణాపూర్ బెల్లంపల్లి ఏరియాలలో పనిచేసే బొగ్గు గని కార్మికులకు అండగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాడుతున్నారు. కార్మికుల హక్కుల కోసం చిత్తశుద్ధితో పనిచేయడం వలన వీరికి కార్మికుల్లో మంచి పట్టు లభించింది.
సింగరేణి అధికారులకు, కాంట్రాక్టర్లకు, చుట్టుపక్కల చిన్న చిన్న పరిశ్రమల యజమానులకు *దొర*, కాంగ్రెస్ నాయకుడు శ్రీపతిరావు అండదండలు పుష్కలంగా ఉండేవి. కాంట్రాక్టర్ల దోపిడీ, గుండాయిజానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ దాని అనుబంధ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాడుతుండేవి . వీరి పోరాటాలు,దొర ఆధిపత్యానికి సవాలుగా మారాయి.ఈ కారణంగా  ఇరు వర్గాల మధ్య తరచుగా గొడవలు జరిగేవి.
ఈ పరంపరలో 1980 సంవత్సరంలో **""తేదీ రాయాలి**""" నాడు రాత్రిపూట మందమర్రి సినిమా హాల్ సమీపంలోని మార్కెట్ ప్రాంతం లో  శ్రీపతిరావు దొరను గుర్తు తెలియని  వ్యక్తులు హత్య చేశారు. శ్రీపతిరావు హత్య కోల్ బెల్ట్ ఏరియా లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయింది . ఈ హత్యను పోలీసు యంత్రాంగం  ఒక సవాల్ గా తీసుకుంది . దర్యాప్తు ముమ్మరం చేసింది.  దర్యాప్తులో భాగంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు వజీర్ సుల్తాన్  మరియు మరికొందరి ఇళ్లను పోలీసులు తనిఖీ చేశారు. వారు ఇంటిలోనే ఉండడంతో వారిని విచారించి, వెళ్లిపోయారు . కార్మిక నాయకుడు వి . టి అబ్రహం, యువజన నాయకుడు మునీర్ ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. వీరి ఆచూకీ తెలియ రాలేదు. భార్యా పిల్లలను, కుటుంబ సభ్యులను కూడా వేరే ప్రాంతాలకు తరలించినట్టు పోలీసులకు సమాచారం అందింది. దొర హత్యతో ఆయన అనుచరులు ఆగ్రహంతో కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తల ఇండ్లపై దాడులు చేశారు. దొరికిన వారిని దొరికినట్టు  విపరీతంగా కొట్టారు . ఆస్తులను ధ్వంసం చేశారు. కార్మిక వాడలు, బొగ్గు గనులపై స్వైర విహారం చేస్తూ ఎర్ర జెండాకు అండగా ఉన్న ఎవరిని  కూడా వదిలిపెట్టకుండా కొట్టారు ..  పోలీసులకు విష్యం తెలిసినా డోరా మనుషులకే వత్తాసు పలికారు  . 

సిపిఐ ఆఫీస్ కి  నిప్పు 

మందమర్రి భూస్వామి శ్రీపతిరావును సిపిఐ శ్రేణులే  హత్య చేశారనే బలమైన నమ్మకం తోనే  పట్టణంలోని సిపిఐ ఆఫీస్ కు  దొర మనుషులెవరో  నిప్పు పెట్టారు . కార్యాలయంలోని ఫర్నిచర్ ను తగలబెట్టారు. ఎర్రజెండా గద్దెను కూల్చివేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుల, సానుభూతిపరుల ఇళ్లపై దాడులు యధేచ్ఛగా కొనసాగాయి . పోలీసుల గాలింపు కూడా ముమ్మరమైంది . వీరు ఇండ్లపై దాడి చేసి మగవాళ్ళు లేకుంటే మహిళలను బండబూతులు తిడుతూ, ఇంట్లోని తినుబండారాలను, నిత్యావసర వస్తువులను ధ్వంసం చేసారు . తినే వాటిలో కిరోసిన్ పోసి అన్నం లో మన్ను పోసినట్టు చేసేవారు  . మగవాళ్ళను వ్యాన్లలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు  తరలించారు . అందరిని చిత్రహింసలకు గురి చేశారు.  మహిళలను  , పిల్లలను రాయడానికి వీలులేని భాషలో తిట్టేవారు. 
పట్టణంలో యధేచ్ఛగా కొనసాగుతున్న భౌతిక దాడులు, విధ్వంసంతో వల్ల   ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీసేవారు . ఎప్పుడు, ఏ వైపు నుంచి గుండాలు దాడి చేస్తారో, ఏ దుర్వార్త వినవలసి వస్తుందోననే   భయాందోళనల తో ప్రజలు  ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించారు.
ఆచూకీ తెలియకుండా జాగ్రత్తగా  తప్పించుకుని తిరుగుతున్న కార్మిక నేత వి టి అబ్రహం, యువజన నాయకుడు  మునీర్ కోసం పోలీసులు గాలింపును  విస్తృతం   చేశారు .  డిఎస్పి విజయేందర్ రెడ్డి,సిఐ రాజు, ఎస్సై చిత్తరంజన్, హెడ్ కానిస్టేబుల్ నాయుడు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందం   నియామకం జరిగింది . 

అజ్ఞాతంలోకి మునీర్ 

శ్రీపతిరావు హత్య విషయం తెలిసిన తర్వాత మునీర్ ఆత్మ రక్షణ కోసం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు . మొదట చంద్ర  పహాడ్ గ్రామంలోని సిపిఐ సానుభూతిపరుడి ఇంట్లో తలదాచుకున్నాడు. మందమర్రి మార్కెట్ సమీపంలో యునాని వైద్యుడిగా పేరు గడించిన మునీర్ తాత ఇంటిలో రెండు రోజులు ఉన్నాడు.ఆ సమయంలో మల,మూత్రాల విసర్జనకు కూడా అతన్ని బయటకు వెళ్ళనివ్వలేదు.  తాతగారే  మల,మూత్రాలను ఒక కుండలో  పట్టి , బయట పడ వేసే వాడు. అతని  చిన్నాన్న ఇంట్లో మరో రెండు రోజులు ఉన్నాడు. అనంతరం  ఆ ఇల్లు ఖాళీ చేసి బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని అయ్యప్పగుట్టపై తలదాచుకున్నాడు.అక్కడికి   ఒక కొరియర్ (పార్టీ వ్యక్తే )మూడు రోజులపాటు గుట్టపైకి భోజనం తీసుకువచ్చాడు. పట్టణంలో జరుగుతున్న విషయాలన్నటిని మునీరుకి వివరంగా  చెప్పేవాడు . నాలుగవ రోజున  కొరియర్ రాలేదు.
 అతను  రాకపోవడం   మునీర్ లో చాలా సందేహాలు రేకెత్తించింది .గుట్ట పైకి వచ్చే మార్గాన్ని అనుక్షణం, అప్రమత్తతతో గమనిస్తున్నాడు. 24 గంటలు గడిచినా  కొరియర్ రాలేదు. ఆయన వద్ద ఉన్న తిండి,మంచినీరు కూడా అయిపోయాయి. ఈ ప్రాంతం సురక్షితం కాదని, అక్కడ నుండి వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నాడు. చీకటి పడుతుండగా మెల్లగా  గుట్ట దిగటం ప్రారంభించాడు. ఒకవైపు ఆకలి బాధ, మరోవైపు వెల్తురు సరిగా లేకపోవడంతో నడక తడబడుతున్నది. ఎండాకాలం వేడిగాల్పులతో నోరు ఎండిపోతున్నది.విపరీతమైన దప్పికతో తల్లడిల్లుతున్నాడు. గుట్ట దిగే మార్గంలో ఒక దగ్గర బురదమడుగు కనిపించింది. 
ఆ మడుగులోని నీళ్లు ముడ్డి కడుక్కోవడానికి కూడా పనికిరాని విధంగా ఉన్నాయి. గొంతు తడారి పోతుండడంతో గత్యంతరం లేక మోకాళ్లపై వంగి ఆ నీటినే నోటిలోకి పీల్చుకొన్నాడు .  నీటితోపాటు బురద కూడా మునీర్ కడుపులోకి వెళ్ళింది. ఆ సమయంలో అదే వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చినట్లయ్యింది. మెల్లగా గుట్ట దిగి చీకటిలోనే పరిసరాలను గమనిస్తూ, అలికిడి వింటూ బెల్లంపల్లిలోని సిపిఐ నాయకుడు గుండా మల్లేషన్న ఇంటికి చేరుకున్నాడు.
మల్లేషన్నతో పాటు ఆయన భార్యతో కూడా మునీర్ కు పరిచయాలు ఉన్నాయి. రాత్రిపూట ఇంటికి చేరిన మునీర్ అడుగు తీసి అడుగు వేయటానికి ఇబ్బంది పడుతున్నాడు. ముఖము పీక్కుపోయింది. ఒళ్లంతా చెమట వాసన. దీనిని మల్లేషన్న గమనించాడు.వెంటనే స్నానానికి, భోజనానికి చక చకా ఏర్పాట్లు చేయించాడు.
మునీర్ స్నానం చేసి, భోజనం చేసిన తర్వాత, అతను   వేరే షెల్టర్ లో పడుకోవడానికి  మల్లేశన్న  అవసరమైన అన్ని ఏర్పాట్లు  చేశాడు.అక్కడి నుండి మారి , బెల్లంపల్లి ఏఐటీయుసీ(సిపిఐ పార్టీ కార్మికసంఘం ) నాయకుడు కుమారస్వామి అత్తగారింట్లో రెండు రోజులు ఉన్నాడు. ఈ విషయం కుమారస్వామికి కూడా  తెలియదు.
మునీర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న సమాచారం మల్లేష్ అన్నకు ఉన్నది. ఇక్కడ మునీర్ ఉండడం శ్రేయస్కరం కాదని, మల్లేషన్న భావించాడు. ఆయన తల్లిదండ్రులు పనిచేసే మహారాష్ట్రలోని బల్హార్ష ప్రాంతంలో మునీరు ఉండడానికి తగిన  ఏర్పాట్లు చేశాడు. మల్లేషన్నతన  తమ్ముడిని వెంటబెట్టుకుని మునీర్ బల్హార్షా వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశాడు. 
కార్మిక నాయకుడు కుమారస్వామి అత్తగారి ఇంటికి  రాత్రిపూట మల్లేష్ అన్న తమ్ముడు గుండా వెంకటి  చేరుకున్నాడు . 

మహారాష్ట్రకు  పయనం...

గుండా వెంకటి వెంట రాగా  మునీర్ బెల్లంపల్లి లోని  శాంతిఖని గని ప్రాంతానికి   కాలి  నడకన చేరుకున్నాడు . బొగ్గు రవాణా చేసే లారీలు శాంతిఖని నుంచి మహారాష్ట్రకు వెళ్తాయి. 
లారీ క్లీనర్లుగా అవతారమెత్తిన  ఈ ఇద్దరు ,పోలీసుల కళ్ళుగప్పి బొగ్గు లారీలో మహారాష్ట్రలోని బల్హర్షకు పయనం కట్టారు. 
గుండ మల్లేషన్న తల్లిదండ్రులు ఇరువురు బొగ్గు గని కార్మికులే. మునీర్ బల్హర్ష లోని మల్లేషన్న తల్లిదండ్రుల నివసించే ఇంటికి చేరుకున్నాడు . అప్పటికే అక్కడ వి.టి అబ్రహం ఉండడంతో మునీరుకు కొండంత బలం వచ్చినట్లయ్యింది.
 గుండా వెంకటి మునీర్ ను తన తల్లిదండ్రులకు  అప్పగించి, ఆయనను మంచిగా చూసుకోవాలని, అన్ని జాగ్రత్తలు చెప్పి   వెంకటి బెల్లంపల్లికి తిరిగి వచ్చాడు.

 మునీర్ కొ ద్ది రోజులు అక్కడే  వున్నాడు . మందమర్రిలో ఉద్రిక్తత ఇంకా తగ్గలేదు. పోలీసు దాడులు, గుండాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 
దీంతో అబ్రహం కేరళకు వెళ్ళిపోయాడు . 
మునీర్ కు పరిచయం ఉన్న ఒక  విద్యార్థి హైదరాబాదులో ఉంటున్నాడు. ఆయనతో సంప్రదించి ఆయన ఉండే హాస్టల్ కు  చేరుకున్నాడు. హైదరాబాదుకు చేరుకున్న మునీర్ ను  ప్రముఖ  కార్మిక నేత కేఎల్ మహేంద్ర కలుసుకొని పరామర్శించారు. ఆనాటి సిపిఐ హైదరాబాద్ నగర నాయకుడు ప్రభాకర్ కు మునీర్ అంటే ఎంతో  అభిమానం. చాలా  ఆప్యాయతతో మునీర్ కు అండగా నిలబడినాడు.
 కమ్యూనిస్టు నాయకుడు మల్లేషన్నపోలీస్ అధికారులతో సంప్రదించి,  మునీర్ ను బెల్లంపల్లిలో పోలీసులకు అప్పగించాడు. 

మునీర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగం...

 తీవ్రమైన చిత్రహింసలు


పోలీసుల అదుపులోకి వచ్చిన మునీర్ ను వారు  కసితీరా తిట్టారు .  కొట్టారు.  రోజుల తరబడి రామకృష్ణాపూర్, మంచిర్యాల, లక్షెట్టిపేట, మందమర్రి పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ విచారణ  పేరుతో  చిత్రహింసలు పెట్టారు.
 "హత్య ఎలా చేశారు? 
హంతకులు ఎవరు?
 ఎంతమంది హత్యలో పాల్గొన్నారు? 
హత్యకు వాడిన ఆయుధాలు ఏమిటి?
అవి ఎక్కడ ఉన్నాయి ? 
.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు .
 విచారణ పేరిట పోలీసులు  తీవ్రమైన చిత్రహింసలకు పాల్పడ్డారు   
రోకలిబండ ఎక్కించడం .. కాళ్లపై లావాటి కర్రలు పెట్టి .. పోలీసులు నిలబడి తొక్కుతారు . 
రాకెట్ వేయడం .. తలకిందులుగా వేలాడదీసి కొట్టడం .. 

తలకాయను గోడకేసి బాదడం తో  నుదురు చిట్లి , తీవ్ర రక్తస్రావం అయింది. 
కటింగ్ ప్లేయర్ తో కాళ్ళ గోర్లను పీకారు. 
చాతి మధ్యలో సిగరెట్ తో కాల్చిన గాయం  పెద్ద మరకగా మారింది.
అది ఇప్పటికీ  మాసిపోలేదు .
చేతులపైన సిగరెట్లతో కాల్చారు. 
బూటు కాళ్లతో ఎక్కడపడితే అక్కడ తన్నారు. 
ఒంటిపై విరిగిన లాటీలకు లెక్కే  లేదు . . 
పోలీసులు ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా..  హత్యతో మాకు సంబంధం లేదు. మేము చేయలేదు .. అనే మాట తప్ప,మరో మాట మునీర్ నోటి నుండి వారు  రాబట్ట లేకపోయారు. 
లాఠీ దెబ్బలకు మునీర్ ఎడమ చేయి చిటికన వేలు నరం తెగిపోయింది. 
ఇప్పటికి ఆ వేలు అప్పటి చిత్రహింసలకు  సాక్షీభూతంగాఆ చిటికిన వేలు  ఇప్పటికీ   వంకరగానే ఉండిపోయింది . 

సి.ఎస్.పి కాంటా వద్ద గూండాలు జరిపిన దాడి (  సంవత్సరం      )లో మునీర్ తల పగిలి పోయి  కుట్లు  వేయాల్సిన  పరిస్థితి వచ్చింది .  ఒంటిపై  ఆ గాయాలు ఇంకా పూర్తిగా మాని పోలేదు.

మునీర్ నుంచి తాము కోరుకున్న  సమాచారం రాబట్టాలని   పోలీసులు కొట్టిన దెబ్బలకు ఆయన తట్టుకోలేక అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయాడు . మందమర్రిలో పోలీస్ డాక్టర్ గా పేరున్న  డాక్టర్  రామారావును పోలీస్ స్టేషన్ కు  పిలిపించారు . మునీర్ ను ఆయనకు చూపించి, చికిత్స చేయమన్నారు. మునీర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని , ఇంకా కొడితే చనిపోతాడని డాక్టర్  చెప్పాడు. ఇక్కడ చికిత్స చేయలేనని, ఆసుపత్రికి తీసుకురావాలని అన్నాడు . తప్పనిసరి పరిస్థితుల్లో మునీర్ ను  హాస్పటల్కు   తరలించి చికిత్స చేయించారు.
 శాంతి భద్రతల పరిరక్షకుడిగా, గుండాల పాలిట సింహ స్వప్నంగా పేరు గడించిన ఎస్సై రామస్వామిని ఖమ్మం జిల్లా నుండి  బదిలీ చేసి మందమర్రి ఎస్సైగా నియమించారు.
ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రామస్వామి, భూస్వామి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న మునీర్ ను విచారించాడు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి చేతులకు బేడీలు వేసి మునీర్ ను సాయంత్రం సమయంలో మందమర్రి మార్కెట్ కు తీసుకువచ్చారు.
పోలీస్ వ్యాన్ నుంచి మునీర్ ను కిందకు దింపి బహిరంగంగా లాఠీలతో కొట్టడం ప్రారంభించారు. ఈ విషయం పట్టణంలో గుప్పుమంది. కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో మందమర్రి మార్కెట్ వద్దకు తరలివచ్చారు.
పోలీసుల దెబ్బలకు భయపడకుండా
మేం ఉద్యమకారులం...
 గూండాలం కాదు...
 ఏం కొడుతున్నావు... ?
దమ్ముంటే చేతులకు ఉన్న బేడీలు తీయండి!..   అంటూ మునీర్ పోలీసులకు సవాల్ విసిరాడు. 
మార్కెట్లో గుమిగూడిన  ప్రజలు మునీర్ కు మద్దతుగా.. 
 పోలీసు జులుం నశించాలి !.. 
అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు 
.. ప్రజల సంఖ్య, నినాదాల జోరు పెరగడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. మునీర్ ను మళ్లీ పోలీస్ వ్యాన్ ఎక్కించుకొని పోలీస్ స్టేషన్  కు  తరలించారు.
పోలీసుల  అదుపులో మునీర్ ఉన్న విషయం స్థానిక పార్టీ నాయకులకు , ప్రజలకు తెలియదు.
మార్కెట్ సంఘటనతో మునీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని, చిత్రహింసలకు పాల్పడుతున్నారనే విషయం తెలిసింది.పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడినట్లు పోలీసులు గమనించారు. మునీర్ అరెస్టుకు నిరసనగా బొగ్గు గనుల్లో సమ్మె జరిగే పరిస్థితి నెలకొన్నదని పోలీస్ అధికారులకు సమాచారం అందింది.తాజాగా నెలకొన్న పరిస్థితిపై పోలీసు అధికారులు సమీక్ష చేసి, అదే రోజు రాత్రి లక్షెట్టిపేట మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఎదుట మునీ ర్ ను హాజరు పరిచారు.ఆయన రిమాండ్ రిపోర్టు రాయడంతో నిజామాబాద్ జైలుకు తరలించారు.