24, జనవరి 2024, బుధవారం

పేజీ 56

 షెడ్యూల్డ్ తెగగా గుర్తింపు కోసం ప్రమాణాలను  రాజ్యాంగం నిర్వచించలేదు  . కాబట్టి బ్రిటిష్   కాలం నాటి 1931 జనాభా లెక్కల ప్రకారమే ఉన్న నిర్వచనాన్ని  ఇది స్వాతంత్ర్యం తర్వాత ప్రారంభ సంవత్సరాల్లో ఉపయోగించు కొన్నది. ఆ విధంగా  షెడ్యూల్ తెగలను "బహిష్కరించబడిన" మరియు "పాక్షికంగా మినహాయించబడిన ప్రాంతాలలో నివసించే 'వెనుకబడిన తెగలు' అని పిలుస్తారు. ప్రావిన్షియల్ అసెంబ్లీలలో 'వెనుకబడిన తెగల' ప్రాతినిధ్యం కోసం మొదటిసారిగా 1935లో  భారత ప్రభుత్వ చట్టం        ద్వారా ఏర్పాటు చేయబడింది.

1965లో, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల జాబితాల సవరణపై ఒక సలహా కమిటీని ఏర్పాటు చేశారు, దీనికి అధ్యక్షత వహించిన బి.ఎన్. లోకూర్, అప్పట్లో కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి. లోకూర్ కమిటీ యొక్క ఐదు ప్రమాణాలు ST జాబితా క్రింద ఒక కమ్యూనిటీని గుర్తించడానికి ఆదిమ లక్షణాలు.. "ఒక విలక్షణమైన సంస్కృతి, భౌగోళిక ఒంటరితనం, పెద్దగా మరియు వెనుకబడిన సంఘంతో సంప్రదింపుల యొక్క సంకోచం".

ఫిబ్రవరి 2014లో ఏర్పాటైన అంతర్గత ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ ఈ ప్రమాణాలను 'నిరుపయోగం', 'అభిమానం', 'పిడివాదం' మరియు 'దృఢమైనది'గా వివరించింది. అప్పటి గిరిజన వ్యవహారాల కార్యదర్శి హృషికేష్ పాండా నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కూడా అనుసరిస్తున్న విధానం 'గజిబిజిగా' ఉందని మరియు 'నిశ్చయాత్మక చర్య మరియు చేరిక కోసం రాజ్యాంగ ఎజెండాను ఓడించడం.. అని అన్నారు. ఈ ప్రమాణాలు మరియు ప్రక్రియ కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు నలభై కమ్యూనిటీలను మినహాయించడం లేదా చేర్చడంలో జాప్యం జరుగుతోందని ఇది నిర్ధారించింది.

2014లో బాధ్యతలు స్వీకరించిన మొదటి మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం, టాస్క్‌ఫోర్స్ నివేదిక ఆధారంగా విధానాన్ని మరియు ప్రమాణాలను మార్చడానికి డ్రాఫ్ట్ నోట్‌ను తరలించింది. అయితే, ఆ సమయంలో చాలా తక్కువ చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోంది మరియు అప్పటి నుండి, రెండవ మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా, ఈ ప్రమాణాలను నిర్ణయించాలని పార్లమెంటులో పట్టుబట్టారు.

పేజీ 55

22, జనవరి 2024, సోమవారం

నందితా హక్సర్

జూన్ 2022లో, ఆదివాసీలు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌పై 'భూమి ప్రకృతి మాతకు చెందుతుంది మరియు ఏదైనా నిర్దిష్ట సమాజానికి చెందినది కాదు' అని ఆరోపించినందుకు తీవ్రంగా ప్రతిస్పందించారు. 32 గిరిజన సంఘాలకు భూమి ఒక గుర్తింపు అని మరియు దానితో తమకు పవిత్రమైన సంబంధం ఉందని గిరిజన సంస్థలు నొక్కిచెప్పాయి.

షెడ్యూల్డ్ తెగల డిమాండ్ కమిటీ ఆఫ్ మణిపూర్ (STDCM) - సెప్టెంబర్ 201333లో కమిటీ పేరు నుండి 'వ్యాలీ' తొలగించబడింది, 1949లో బ్రిటీష్‌సెర్గర్ క్యాంపడాన్ యూనియన్‌కు ముందు, బ్రిటీష్ వారు గిరిజనులలో గిరిజనులను తెగగా నియమించారు. . వారి ప్రకారం, వారు కేవలం ఆ స్థితిని పునరుద్ధరించమని అడుగుతున్నారు.

మరోవైపు ఆదివాసీలు తమను ఆదివాసీల కంటే ఉన్నతంగా భావించి స్వాతంత్య్రానంతరం షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చడానికి నిరాకరించిన వారు  మైతేయి లేనని వాదిస్తున్నారు. అయితే, కొంతమంది హిందూ మైతే యు లు మాత్రమే ST హోదాను నిరాకరించారని మరియు సనామహీ మతాన్ని ఆచరించే వారిని అడగలేదని మైతీలు అభిప్రాయపడుతున్నారు. ఈ అభిప్రాయం L.B ద్వారా ఒక వ్యాసంలో ప్రతిబింబిస్తుంది. సింగ్, ఇండియన్ నేవీ యొక్క రిటైర్డ్ కెప్టెన్ మరియు ఈ విషయంపై వార్తా వెబ్‌సైట్‌లకు తరచుగా కంట్రిబ్యూటర్, ది సంగై ఎక్స్‌ప్రెస్:

"1891 నుండి 1931 వరకు బ్రిటీష్ వారు నిర్వహించిన జనాభా గణనలో మెయితీ (మీటీ/మీతేయి) "కొండ తెగ"గా వర్గీకరించబడింది. అయితే, 20 సెప్టెంబర్ 1951న ప్రకటించిన STల జాబితా నుండి మెయిటీలు మినహాయించబడ్డారు, కానీ నాగాలు ,కుకీలు మాత్రం చేర్చబడ్డారు.

మణిపూర్,

ప్రజలు నిన్ను 'అమ్మా' అని పిలుచుకుంటారు
నేను కూడా నిన్ను 'అమ్మా' అని పిలుస్తాను
 కానీ.. నేను.. నీ కోసం చనిపోలేను..

ఎవరైనా చనిపోవాల్సి వస్తే..
నీ వనరులను పీల్చి పిప్పి చేసే  వారే చావాలి

ఏడు తరాలుగా  మోసం చేస్తూ, దోపిడీ  చేస్తూ , బెదిరిస్తూ    ధనాన్ని కూడబెట్టిన  వారే  నీ  కోసం చనిపోనివ్వు !
నేనెందుకు చావాలి?

-తంగ్జామ్ ఇబోపిషాక్ సింగ్

14, జనవరి 2024, ఆదివారం

13, జనవరి 2024, శనివారం

manipur24

మణి పూర్ లో ఏమి జరిగింది.. ఎందుకు జరిగింది... ఇంకా ఒక యుద్ద వాతావరణం ఎందుకు నెలకొని వుంది... ఈ విషయాల పట్ల సామాజిక స్పృహా కలిగిన వర్గాలకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చి వుంటుంది...

 అయితే నేను  చెప్పబోయే విషయాలు కొన్ని కొత్తగా    వుంటాయి..ఎందుకంటే  కొందరి మిత్రుల తో కలిసి నేను మణిపూర్ వెళ్లి వచ్చాను.. బాధితులతో కలిసి మాట్లాడాను..
'గ్రౌండ్ రియాలిటీస్' అంటారు కదా !కళ్ల తో చూసిన వాస్తవాలు.
శరణార్థి శిబిరాల లో  మనలాంటి వారి సహాయ సహకారాల కోసం వారు పడే తాపత్రయం నన్ను కదిలించి వేసింది..
అది మతమో ..మత మౌఢ్యమో.. ఏదైనా అనుకోండి.. కాని దేశం నలుమూలల నుండి క్రిస్టియన్ సంస్థలు అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు..
ప్రభుత్వాలు చేయవలిసిన పనిని ప్రజా సమూహాలు చేస్తున్నాయి..
 ఈ సానుభూతి,సహానుబూతి వల్ల బాధితులకు ఈ రోజు గడిచిపోతుంది.. లేదా కొన్ని నెలలు నెట్టుకు రావచ్చు..
కాని.. భవిష్యత్తు మాటేమిటి?పిల్లలకు ఏమి దారి చూపిస్తాం.. ఎన్నాళ్ళు ఇలా ఆకాశం వేపు చూస్తాం. ..నా కాళ్ళ కింద నేలకు ఎందుకు రెక్కలు వచ్చాయి...
ఈ సంఘీభావ గాలిలో ఎంత కాలం బ్రతుకుతాము..

అన్నీ ప్రశ్నలే... సమాధానం దొరకని ప్రశ్నలు..
మేము నలుగురం... యాత్రికుల్లా వెళ్ళాం.. మా దగ్గర అదనంగా ఏమీ లేదు వారికి పంచటానికి..
కాసిన్ని స్వాంతన వచనాలు.. కొన్ని కన్నీటి చుక్కలు తప్ప .. 

మేము రచయితలం..మీగురుంచి రాస్తాము.. మీ బాధల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాం... మీ వెంట మేమే కాదు మొత్తం ప్రపంచాన్ని నిలబెడతాం...
మాటలేగా.. హృదయపూర్వకంగానే చెప్పాము... 
అసలు పని ఇప్పుడే మొదలవుతుంది..
మా యాత్రానుభవాలు మిమ్మల్ని ఎంతగా కదిలిస్తాయో చూడాలి.. మీ స్పందన కోసం మణిపూర్ ఎదురు చూస్తూనే వుంటుంది..
మణిపూర్ లో గొడవలు మొదలైన మూడు నెలలకు అంటే ఎండా కాలం లో అక్కడికి వెళ్ళాం.. అంత ఎండల్లోనూ మణిపూర్ చాలా పచ్చ పచ్చగా వుంది..
మణి పూర్ రాజధాని ఇంపాల్  ఉద్రిక్తంగా ఉందని  పక్క రాష్ట్రం నాగాలాండ్ ద్వారా మణి పూర్ లోని కాంగోపి జిల్లా కేంద్రానికి చేరుకున్నాం..
నాగాలాండ్ ...భారత దేశం లో ఇంగ్లీష్ లో పిలవబడే ఒకే ఒక్క  రాష్ట్రం ఇదే... నాగాల భూమి..నాగా లాండ్.
దీని రాజధాని కొహిమా... కొహిమా అంటే ఒక ప్రత్యేక మైన పువ్వు.. ఈ కొండ ప్రాంతాల్లో నే పూస్తుందంట...
కొహిమా కొండప్రాంతం కావటం వల్ల ఇక్కడ విమానాశ్రయం లేదు.. మైదాన ప్రాంతమైన దిమాపూర్ లో విమానం దిగి అక్కడ నుండి మణిపూర్ కి వెహికిల్ లో వెళ్ళాం.
దిమాపూర్ లో మా ముగ్గురికి   మరో నలుగురు మిత్రులు తోడయ్యారు..
అందులో బిషప్ ఒకరు.. ఆయనే మా టీం లీడర్.. తెలుగు వాడు.. హైదరాబాద్ వాస్తవ్యులు కూడా..
ఇంకో ముఖ్యమైన వ్యకి  'రింగ్ వార్'.ఇది మేము కంఫర్ట్ గా పిలుచుకునే పేరు..  ఆమె  అసలు పేరు మనకి పలకడానికి  కొంచెం కష్టంగానే ఉంటుంది...
కాని ఒక అద్భుతమైన మైన మనిషి ఆవిడ...
దిమపూర్ లో దిగిన రోజు సాయంత్రం ఆమె ఇంటికి 'టీ' కి వెళ్ళాం... ఎంత ఆప్యాయంగా మర్యాద చేసిందో..! 
ఇంత దూరం వచ్చినందుకు ఒక మంచి హృదయం ఉన్న మనిషి ని కలుసుకోగలిగాం ..అని అనిపించింది..
కోవిడ్ పీడిత  కాలం లో చిన్న వయసు లోనే తన భర్త ను కోల్పోయింది.. తన భర్త ఫోటో చూపించి... మై  హ్యాండ్సమ్  హస్బెండ్  ..అని భలేగా నవ్వేసింది..
మాకోసం వెహికిల్ ఆమే మాట్లాడి పెట్టింది.. మాతో పాటు కలిసి మాణిపూర్ కి వచ్చింది... ఆమె రావడం వల్ల మాకు మణిపూర్ ఏదో సొంత ఊరు లాగా అయింది..
దారిపొడుగునా మాకు తెలిసిన పాత మనిషి లా కలిసిపోయింది...
ఆమె ద్వారానే మణి పూర్ మాకు మరింత బాగా అర్థమైంది...

తను  కుకీ .. నాగాలాండ్ లోని ఈ దిమాపూర్ లో ఉంటోంది .. మే 3 ,2023 న జరిగిన దారుణాలు తర్వాత ఎంతో మంది కుకీలకు ,మరెంతో మంది మైతేలకు తన ఇంట్లోనే ఆశ్రయం  కల్పించింది.  .. తాను వొట్టి ఆశ్రయాన్నే కాదు వారికి ఒక జీవితకాలం బ్రతకగలిగే ఆత్మ స్థైర్యాన్ని కలిగిస్తుంది .. 

ఇలా దారి పొడుగునా ఇలా  ఎందరో మనుషులు మణిపూర్ గాయాలను గుండెకు హత్తుకున్నవారు .. 

మరి ఎవరు ఈ రావణ కాష్టాన్ని రగిలిస్తున్నది .. ఈ రోజుకు..  అంటే 2024 కు ఇంకా హత్యాకాండ జరుగుతూనే వుంది .. 

ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ ఈ సారి మణిపూర్ నుంచే తన రెండో భారత్ జోడో  యాత్ర ని ప్రారంభించాడు .. అధికార పక్షాలు .. కేంద్రం తో సహా (డబల్ ఇంజిన్ సర్కారు) ఒక పక్షం  కొమ్ము కాస్తూ కొండ ప్రాతాల కుకీలపై దాడికి పరోక్ష మద్దత్తు ఇస్తున్నారు . 

9, ఆగస్టు 2023, బుధవారం

 సియాసత్  పత్రిక ఎడిటర్ జహీరుద్దీన్  ఆలీఖాన్ కు నివాళి .. 

గద్దర్ అంతిమ యాత్ర (07. 08.) తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన ప్రాణ మిత్రుడు 

మనందరికి మిత్రుడే .. 

అప్పటికే తెలుగు నేల బరువెక్కిన గుండెతో  గద్దర్ మరణ దుః ఖాన్ని మోస్తున్నది .మిత్రుడి అంతిమ కార్యక్రమాలు ఇంకా పూర్తవనే లేదు . అంతలోనే ఆలీఖాన్ హఠాత్ మరణం   గుండెని పిండి వేసింది . 

అప్పటిదాకా మన కళ్లెదుటే కదలాడిన మనిషి కుప్పలా కూలిపోతే ఎవరిమైనా ఎలా తట్టుకుంటాం ?

అతడు మీలో చాలా మందికి పరిచయం లేకపోవచ్చు .. నాకూ  అంతే !

అయితే ముందు చాలా సార్లు అతని పేరు విని వున్నాను . అతని గొప్ప మనసు గురుంచి తెలుసు  కొన్నాను . 

మంచితనం అనేది మనకు ఎంత దూరంలో వున్నా దాని గుబాళింపు మనకు ఎలాగోలా చేరిపోతుంది.

అలీఖాన్ చనిపోక ముందు రెండురోజులు దాదాపు నా కళ్ళ ముందే   వున్నాడు . వీక్షణం వేణుగోపాల్ పుస్తకం   "విద్వేషపు విశ్వ గురు " ఆవిష్కరణ సభలో ,ఆ తర్వాత జయశంకర్ సార్  సంస్మరణ సభలోను . 

ఒక్కసారి దగ్గరగా చూస్తే మరిచిపోయే ముఖం కాదు ఆయనది . 

ప్రేమాస్పుదుడైన  మనిషి  తన శత్రువు నైనా  వెంటాడుతుంటాడు . 

సమాజ నిర్మాణానికి అవసరమైన బిడ్డల మరణాన్ని "ఒక తల్లి" హృదయాన్ని మోసుకు తిరిగే ఏ ప్రజా సమూహం తట్టుకోలేదు . 

ఆలీఖాన్ భాయ్  నువ్వు మా దోస్తువు .. మా ప్రాణానివి .. 

మీ నవ్వు ముఖాలే మా జెండాలు .. 

మీ ఆశయాలే మా 'ఎజెండాలు "..